Nannante Movie
-
హార్ట్ టచింగ్ సబ్జెక్ట్‌తో 'నాన్నంటే' సినిమా
మనసుని తాకే ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన సినిమా 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా.. అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. వైఎస్‌కె, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో ప్రీమియర్ షో వేశారు. పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ నాన్న అంటే ఎంతో ఎమోషన్ ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారని అన్నారు. ఈ సినిమాలోని సందేశం యువతకి కనెక్ట్ అవుతుందని అన్నారు. (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా బూతులు!)నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. 'నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలి. అతి త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని అన్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
‘నాన్నంటే' .. పిల్లలకు మంచి సందేశం ఇచ్చే చిత్రం
వై ఎస్ కె, నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై అశోక్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సాయి, నాగరాజ్, భాషా, నటుడు ఆర్పీ మాట్లాడుతూ.. బంధాలు, అనుబంధాలు ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలకు అందరు సపోర్ట్ చేయాలని కోరారు. కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... నాన్న గొప్పదనాన్ని ఈ చిత్రం మరింత గొప్పగా చెప్పిందని, పిల్లలకు మంచి మెసేజ్ ఇస్తుందని అన్నారు. శివ సాంగ్ చాలా బాగుందన్నారు.ర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ... నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. కోట శంకర్ రావు మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ తనకు మంచి పాత్ర ఇచ్చారని, మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు.