nannuru
-
భవనంపై నుంచి పడ్డ ‘నారాయణ’ విద్యార్థి
సాక్షి, ఓర్వకల్లు: నారాయణ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి భవనంపై నుంచి పడి గాయపడ్డాడు. నన్నూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. నందికొట్కూరు మండలం కోళ్ల బావాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి యాదవ్ కుమారుడు సురేంద్రయాదవ్ (17) నన్నూరు సమీపంలోని నన్నూరు నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల కిందట హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడ చదువుల ఒత్తిడితో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున నిద్రమత్తులో హాస్టల్ భవనంపైకి వెళ్లిన అతడు గ్రిల్ లేకపోవడంతో కాలుజారి కిందపడ్డాడు. దీంతో రెండుకాళ్లు, నడుము ఎముకలు విరిగాయి. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ ఇన్చార్జికి సమాచారం ఇచ్చారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాల యాజమాన్యం గ్రిల్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.(చదవండి: భార్యను కాల్ గర్ల్‌గా చిత్రించి..) -
లారీ - ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు నగరం సమీపంలోని నన్నూరు వద్ద గురువారం లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నిట్’ కోసం స్థల పరిశీలన
నన్నూరు(ఓర్వకల్లు): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం నన్నూరు సమీపంలో భూమిని గురువారం కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటు కోసం అనుకూలమైన భూమిని సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. కొన్ని అనివార్య కారణాలతో స్థల సేకరణలో జాప్యం జరిగిందన్నారు. నెల రోజుల క్రితం నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా వద్ద స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అలాగే కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద గల 150 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించామన్నారు. ఒకే చోట 300 ఎకరాలు కావాలని, జాతీయ రహదారి అందుబాటులో ఉండాలని తాజాగా ప్రభుత్వం సూచించిందన్నారు. దీంతో నన్నూరు-పూడిచెర్ల మధ్య గల 1338, 386 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి అనుకూలమైనదిగా భావించామన్నారు. గడెం తిప్పపైగల ఈ భూముల వివరాలను 48 గంటల్లో పంపాలని సర్వే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రఘుబాబు, ఇన్చార్జి తహశీల్దార్ శ్రీనాథ్, సర్వేయర్లు మల్లికార్జున, సుబ్బారెడ్డి, వీఆర్ఓ మౌలిబాషా ఉన్నారు. -
నిశ్చితార్థమైన వారానికే....
*కాబోయే భర్త అదనపు కట్నం కోసం డిమాండ్ *వివాహం నిలిచిపోతుందని యువతి ఆత్మహత్య ఓర్వకల్లు : నిశ్చితార్థమైన వారానికే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్తే అదనపు కట్నం కోసం డిమాండ్ చేయడంతో పెళ్లి ఆగిపోతుందని యువతి అఘాయిత్యానికి పాల్పడింది. కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలోని మయూరి గ్రీన్ హిల్స్‌లోని 439వ ప్లాట్‌లో శంకరాజు, సరస్వతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె హరిప్రియ(22)కు ఖమ్మం జిల్లా, భద్రాచలం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాసరాజుకు వారం రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ.6 లక్షల నగదు, 15 తులాల బంగారు ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థమైన రెండు రోజుల తర్వాత రూ.10 లక్షలు నగదు, 20 తులాలు బంగారు ఇవ్వాల్సిందేనని వరుడు ఫోన్ ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆదివారం కూడా హరిప్రియతో ఫోన్లో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. తన పెళ్లి రద్దు అవుతుందేమోనని మనస్తాపానికి లోనైన యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సరస్వతమ్మ ఉలిందకొండలో ఉపాధ్యాయురాలుగా, తండ్రి శంకరాజు కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లి ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఈ విషయంపై ఎస్ఐ విజయలక్ష్మీని వివరణ కోరగా మృతురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.