Narasaraopet Area Hospital
-
'సీఎం జగన్ దమ్మేంటో ప్రజలకు తెలుసు'
సాక్షి, నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దమ్మూధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రులకు తెలియకపోవటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్‌కు దమ్మూధైర్యం లేవంటూ ట్విట్టర్లో లోకేష్, పవన్‌కల్యాణ్ ఒకేరోజు పోస్ట్ చేశారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ఎదుట లోకేష్, పవన్‌కల్యాణ్ పోస్టులపై స్పందించారు. అప్పటి ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాందీని ఎదిరించి సొంతగా పార్టీ పెట్టుకున్న ధైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని గుర్తుచేశారు. ఇటీవలి ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత వైఎస్ జగన్ సొంతమని పేర్కొన్నారు. తాను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరి పేరును కూడా స్పష్టంగా పలకలేని లోకేష్‌కు, పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్మూ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలతో పాటు పవన్ కల్యాణ్ మంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ప్రజల మధ్య మతం, కులాల ప్రస్థావన తెస్తున్నారని, మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయోలేదో అని కాకుండా మంచి పనులు చేస్తున్నామా లేదా అనే ధోరణితోనే సీఎం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే దానికి కూడా మతం రంగు పులిమే సంస్కృతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. అమలుచేసే పథకాల్లో తప్పులు, పొరపాట్లు ఉంటే చెబితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. వ్యక్తిగతంగా సీఎంను దూషిస్తూ, ప్రజల మధ్య మతం, కులం పేరిట విభేదాలు తెచ్చే చర్యలకు ఇకనైనా ప్రతిపక్ష నాయకులు విడనాడాలని హితవుపలికారు. -
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
గుంటూరు క్రైమ్: ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు కర్కశంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా నర్సారావుపేట రూరల్ మండలం లింగంకుంట గ్రామంలోని యానాది కాలనీ సమీపంలో ఈ దారుణం జరిగింది. సోమవారం సాయంత్రం బాలిక పుట్టగొడుగుల కోసం కాలనీ నుంచి బయటకు రాగా, అదే కాలనీకి చెందిన గుడిపూడి వెంకటేశ్వర్లు(55) ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. వంటి నిండా కొరికిన, రక్కిన గాయాలతో బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడంతోపాటు బాధిత బాలికను చికిత్స కోసం నర్సారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అమ్మల వేదన.. అరణ్య రోదన
నరసరావుపేటటౌన్ : బిడ్డల జాడ తెలియక ఆ తల్లులు తల్లడిల్లిపోతున్నారు. నవమాసాలు మోసి కన్న చిన్నారులు అపహరణకు గురికావడం వారికి గుండెకోత మిగిల్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డల కోసం ఆ తల్లులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పిల్లల అదృశ్యంపై నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నమోదైన రెండు కేసుల విషయంలో నేటికీ ప్రగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారం రోజుల వయసు పసికందు అపహరణకు గురై 16 నెలలు గడిచింది. వారం కిందట ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ రెండు కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ చిన్నారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన గల్లా శారమ్మ, మరియబాబు దంపతులు వారం రోజుల పసికందుతో గతేడాది ఏప్రిల్ 15వ తేదీన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో జననీ సురక్ష యోజన కింద బాలింతలకు ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పొందేందుకు వచ్చారు. అక్కడ ఓ మహిళ చెప్పిన మాయమాటలకు మోసపోయారు. తమ బిడ్డను చూస్తూ ఉండమని అప్పగించడంతో ఆమె ఆ బిడ్డతో పరారైంది. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు అపహరణకు గురైన పాప కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. సంఘటన జరిగినప్పటి నుంచి అనేక మార్లు శారమ్మ దంపతులు పోలీస్‌స్టేషన్ వద్దకు రావడం, అయ్యా మా పాప ఆచూకీ లభించిందా.. అంటూ అధికారులను వేడుకోవడం, వారు చెప్పే సమాధానం విని తిరిగి నిరాశతో స్వగ్రామానికి చేరుకోవడం అలవాటైపోయింది. ఆడుకుంటున్న బాలుడి అపహరణ.. తాజాగా వారం రోజుల కిందట ఎన్జీవో కాలనీకి చెందిన గారపాటి జోసఫ్, మేరీల కుమారుడు ఎనిమిదేళ్ల జాన్ ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆ తర్వాత రోజు ఆగంతకులు ఫోన్ చేసి ‘మీ బిడ్డను కిడ్నాప్ చేశాం. రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం..’ అంటూ కుటుంబసభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. దీంతో జాన్ నాయనమ్మ సుశీల టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కిడ్నాప్ కేసుపై సమీక్ష నిర్వహించారు. కేసు ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గతంలో కిడ్నాప్ కేసుల్లో ఉన్న నిందితులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయినప్పటికీ చిన్న క్లూ కూడా దొరకకపోవడం విశేషం. జాన్ కుటుంబ సభ్యులు మాత్రం రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్దనే ఉంటూ తమ బిడ్డ కోసం పోలీసు అధికారులను అడుగుతూ కనిపిస్తున్నారు. మీ బిడ్డ ఆచూకీఏమైనా దొరికిందా అంటూ ఎవరైనా అడిగితే వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మిస్టరీగా మారిన రెండు కిడ్నాప్ కేసుల్లో ఎలాంటి పురోగతి లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.