నరసరావుపేట ఎంపీగా పోటీ చేయను: కాసు
గుంటూరు : గుంటూరు జిల్లాలో కాంగ్రెస్‌కు తనయుడు ఝలక్ ఇస్తే తండ్రి మరో షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయటం లేదంటూ మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రకటించారు. మరో అభ్యర్థిని చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచించారు. కాగా నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనని కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేష్ రెడ్డి నిన్ననే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
కాగా నరసరావుపేట నియోజకవర్గంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం ఉన్న కాసు కుటుంబం కాంగ్రెస్ పార్టీ తరపును పోటీ చేయటం లేదంటూ ప్రకటించటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కోవటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా పోటీ చేయటం లేదంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.