narasimha swami
-
ఆరోగ్య భోగాలనిచ్చే యోగ నరసింహ స్వామి
తిరుమల ఆలయాన్ని దర్శించిన ఎవరికైనా యోగ నరసింహస్వామి గురించి తెలిసే ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి సన్నిధి దాటి ముందుకు వెళుతుండగానే యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆలయంలో స్వామి వారు పడమర వైపు తిరిగి వెంకటేశ్వరస్వామి వారిని చూస్తున్నట్లు ఉంటుంది. ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనం లోనే ఉంటారు. రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో ఉంటాడని చెప్పింది. ఈ స్వామి వారిని దివ్యప్రబంధంలో ఆళ్వారులు అలగియ సింగర్(అందాల నరసింహుడు) అనే పేరుతో పిలిచారు. శ్రీమద్రామానుజులవారు ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు.ఈ స్వామికి నిత్యకైంకర్యాలేవీ జరుగకపోయినా ప్రతి శనివారం తిరుమంజనం (దివ్యాభిషేకం) నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు,దివ్యప్రబంధపారాయణలు అందుకుంటాడు.ఈ స్వామికి ఉత్సవవిగ్రహం లేదు.కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్ర ఈ యోగనరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఘనంగా తిరునక్షత్రోత్సవం
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శ్రావణ శుద్ధ శుక్రవారం ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవం (పుట్టినరోజు) సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో సువర్ణ పుష్పార్చన, ప్రత్యేక సుదర్శన నారసింహా యాగం, నారసింహ అష్టోత్తర పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఇందుకోసం ఆలయంలో పారాయణం చేయడానికి ప్రత్యేకంగా ఐదుగురు ప్రత్యేక రుత్విక్కులను ఆహ్వానించారు. ఆలయాన్ని, స్వామి అమ్మవార్లను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంరపింతి ప్రత్యేక గజ వాహన సేవలో ఊరేగించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మెన్ బి. నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అధికారులు చంద్రశేఖర్, దోర్భల భాస్కరశర్మ, గోపాల్, వేముల వెంకటేశ్ పాల్గొన్నారు. -
పానకాల స్వామిని దర్శించుకున్న ఏపీ సీఎస్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉన్న నరసింహ స్వామిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలతో ఆశ్వీరచనాలు అందజేశారు. -
గణనీయంగా పెరిగిన యాదగిరిగుట్ట ఆదాయం
నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే రూ.11 కోట్ల మేర అధికంగా లభించిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. గత ఏడాది 66,58, 47, 445 రూపాయలు రాగా, ఈసారి 73,03, 15, 953 రూపాయల మేర సమకూరిందన్నారు. భక్తులకు సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు. అలాగే, రక్షణ చర్యలను కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు.