Narayana Puram
-
కాంగ్రెస్‌కు ఓటు వేయండి : జేసీ
-
చంద్రబాబుకు జేసీ దివాకర్ ఝలక్
సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడుకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని తన మనసులోని మాటను చెప్పారు. హిందీ రాకపోవడం వల్ల ఎంపీగా ఫెయిల్ అయ్యానని అంగీకరించారు. తన కుటుంబం గద్వాల్ నుంచి వలస వచ్చిన మాట వాస్తవమేనని, తన స్థానికతను ప్రశ్నించొద్దని కోరారు. చదవండి : 420కి ఓటు వేయొద్దు -
"కుల"కలం
ఒకప్పుడు వారు గిరిజనులు. ఇప్పుడు కారు. ఒకప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు గుర్తించం పొమ్మంటోంది. అర్హత ఉన్నా గిరిజనులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గిరిజనులుగా గుర్తించమని ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకూ గిరిజనులుగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ససేమిరా అంటోంది. ఏనేటికోండ్రు కులం గిరిజనుల గోడును నిర్లక్ష్యం చేస్తోంది. విజయనగరం, బలిజిపేట (పార్వతీపురం): నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న ఏనేటి కోండ్రు కులస్తులను ప్రభుత్వం గిరిజనులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గ్రామంలో 15 కుటుం బాలు వందేళ్లకు పైగా నివసిస్తున్నాయి. ఎస్టీలైన వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వీరిని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలసలోనూ గుర్తిస్తుండటం విశేషం. 1990 వరకు తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువపత్రాలు ఇచ్చారని.. ఆ తర్వాతే నిలిపివేశారని కుల పెద్దలు నాగభూషణరావు, నీలకంఠం తెలిపారు. తమ కులస్తులు కొందరు చదువుకునేటప్పుడు ఎస్టీలుగానే గుర్తించి కులధ్రువీకరణ మంజూరు చేశారని, పాఠశాల టీసీల్లో కూడా ఎస్టీలుగా ధ్రువీకరించి ప్రస్తుతం కాదనడం సమంజసంగా లేదని తెలిపారు. ఎందుకు గుర్తించరు? నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న తమ కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోని తమ కులస్తులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నాయని ఎం.వెంకటరమణ, ఆర్.ఫకీరు, ఎం.గణపతి, మురళి తెలిపారు. కులపరంగా ఆచార సంప్రదాయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఎస్టీలం ఎలా కాకుండా పోతామని ప్రశ్నిస్తున్నారు. అంధకారంలో పిల్లల భవిత కుల ధ్రువపత్రాలకు నిరాకరిస్తుండటంతో 1990 అనంతరం పిల్లల చదువుల కోసం ఓసీలుగానే బడిలో చేర్పించి చదివిస్తున్నామని తెలిపారు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామన్నారు. నిరుపేదలమైన తమకు జీవనాధారం కష్టమై పిల్లలను చదివించడం భారంగా ఉందని తెలిపారు. వేలకు వేలు చెల్లించలేక తక్కువ చదువులతో మాన్పించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోయా నాకు 2005లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం లేనందున వచ్చిన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి నిరుత్సాహానికి గురయ్యాను. నేటికీ మేము ఏ కులస్తులమో అర్థం కావటం లేదు. – ఎం.గణపతి, నారాయణపురం పదోన్నతి రాలేదు అంగన్వాడీ కార్యకర్తగా చేస్తున్న నాకు 2011లో సూపర్వైజర్గా పదోన్నతి లభించింది. కానీ కుల ధ్రువపత్రం లేనందున పదోన్నతి నిలిచిపోయింది. మా పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. – ఎం.సరోజిని, నారాయణపురం పరిశీలిస్తా మీసేవలో కుల ధ్రువీకరణ నిమిత్తం దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అవకాశం ఉంటే సహకరిస్తాం. అన్నీ పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తాం.– బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
గోకర్ణపల్లి.. ఖాళీ!
పొందూరు, న్యూస్‌లైన్: ఒకవైపు నారాయణపురం కుడికాలువ.. మరోవైపు మడ్డువలస కాలువ ఉన్నా పొందూరు మం డలం గోకర్ణపల్లి పంచాయతీకి నిత్యక్షామమే. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాల కారణంగా పంటలు చేతి కందడం లేదు. పోనీ ఉపాధి హామీ పనులైన చేసుకొని ఉన్న ఊరిలో కలో గంజో తాగి బతుకుదామంటే మూడేళ్లుగా ఆ పనులు జరగడం లేదు. ఫలితంగా కుటుంబ పోషణకు ఊరు విడిచి దూరం వెళ్లక తప్పడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచేస్తున్న రెల్లుగెడ్డ గ్రామానికి ముందు నారాయణపురం కుడి కాలువ.. వెనుకవైపు మడ్డువలస కాలువ ఉన్నాయి. అందువల్ల గ్రామ పంటపొలాలకు నీటి సమస్య లేదు. కానీ సమస్య ఏమిటంటే.. వర్షాకాలంలో మడ్డువలస నీరు వచ్చి నారాయణపురం కుడికాలువలో కలుస్తుంది. ఆ నీరంతా పక్కనే ఉన్న రెల్లుగెడ్డలో కలుస్తుంది. దీంతో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. వేసిన పంటలు నాశనమవుతున్నాయి. నారాయణపురం కాలువ, రెల్లుగెడ్డ కలిసే చోట నిర్మించిన ఉపరితల చప్టా సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీటి ఉద్ధృతిని అడ్డుకోలేకపోతోంది. ఫలితంగా నీరంతా పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తోంది. మరోవైపు నానాపాట్లు పడి సాగు చేసే పంట చేతికొచ్చే సమయంలో ప్రతి ఏటా తుపానులు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలా పంట నష్టపోతున్న చిన్న రైతులు ఉపాధి హామీ పనులపై ఆశలు పెట్టుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లేరని..! అయితే మూడేళ్లుగా గ్రామంలో ఉపాధి పనులే జరగడం లేదు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడమే కారణమని తెలిసింది. గతంలో ఇక్కడ పని చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వేతనదారుల హాజరు ఎక్కువగా చూపడం, ప్రభుత్వం సరఫరా చేసిన గునపాలను వేతనదారులకు అందజేయకపోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మూడేళ్ల క్రితం సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏవో కారణాలతో వేరే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించలేదు. పర్యవేక్షించేవారు లేకపోవడంతో గ్రామానికి ఉపాధి పనులు కూడా మంజూరు చేయడం నిలిపివేశారు. ఫలితంగా పంట నష్టపోయిన చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు వేసవిలో ఉపాధి పనులకు దూరమయ్యారు. పంటలు లేక.. ఉపాధి పనులకు నోచుకోక కుటుంబ పోషణ భారంగా పరిణమించడంతో వలసబాట పట్టారు. ఈ విధంగా ఇప్పటికే సుమారు 300 మంది విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కూలి పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో చాలా ఇళ్లు తాళాలతో వెక్కిరిస్తున్నాయి. పంటలు లేక గురుగుబెల్లి లక్షునాయుడు, రాజులు, రాము, లక్ష్మీనారాయణ, సన్యాసి, కంచరాన ధర్మేంద్ర, అర్జునరావు తదితరుల పొలాలు బీడువారాయి. గ్రామానికి ఈ దుస్థితి తప్పించాలంటే మడ్డువలస కాలువ, నారాయణ కుడి కాలువల గట్లు పటిష్టం చేయడంతో పాటు చప్టాల సామర్థ్యం పెంచాలని.. తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ సీపాన శ్రీరంగ నాయకులు, ఎంపీటీసీ సభ్యుడు సీపాన చక్రధరనాయుడు, పలువురు రైతులు కోరుతున్నారు. అప్పుడే గ్రామం మళ్లీ కళకళలాడుతుందంటున్నారు. లేని పక్షంలో ముందు ముందు గ్రామం మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.