NASAs Curiosity rover
-
కొత్త అన్వేషణ ప్రారంభించనున్న క్యూరియాసిటీ
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకునిపై ఉన్న మౌంట్ షార్ప్ పర్వత ప్రాంతానికి చేరుకుంది. విస్తారమైన గాలే కార్టర్ మధ్యలో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో క్యూరియాసిటీ తన తదుపరి అన్వేషణను ప్రారంభించనుంది. సుమారు రెండేళ్ల తర్వాత, తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం అనంతరం క్యూరియాసిటీ మౌంట్ షార్ప్ బేస్‌కు చేరిందని యూఎస్ స్పేస్ ఏజన్సీ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచానికి తన సత్తా చాటిన క్యూరియాసిటీ ఇప్పుడు కొత్త అన్వేషణను ప్రారంభిస్తుందని నాసా ప్లానెటరీ సైన్స్ డివిజన్ డెరైక్టర్ జిమ్ గ్రీన్ వెల్లడించారు. -
అరుణగ్రహంపై రెండేళ్లు...
అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న నాసా క్యూరియాసిటీ రోవర్ మంగళవారం నాటికి మార్స్‌పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. రోదసిలో దాదాపు 9 నెలలు ప్రయాణించి ఆగస్టు 5, 2012న మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో వాలిపోయిన క్యూరియాసిటీ ఈ రెండేళ్లలో ఆ గ్ర హం గురించి ఎన్నో వివరాలను భూమి కి పంపింది. అంగారకుడి మట్టి, శిలలపై లేజర్లను ప్రయోగించి వాటిలోని ఖనిజాలు, రసాయనాల వివరాలు సేకరించింది. ఒకప్పుడు అక్కడ సూక్ష్మజీవుల ఉనికికి అనుకూలమైన వాతావరణం ఉండేదా? అన్న కోణంలో పరిశోధించింది. ఎల్లోనైఫ్ బే అనే ప్రాంతంలో గతంలో నీరు పెద్ద ఎత్తున ప్రవహించిందని గుర్తించింది. అక్కడ ఒకప్పుడు ఉన్న మంచినీటి సరస్సు ఆనవాళ్లనూ కనుగొంది. గేల్‌క్రేటర్ మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ షార్ప్ పర్వతం దిశగా సాగుతున్న రోవర్ మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోనుంది. అయితే మౌంట్ షార్ప్‌కు చెందిన పర్వతపాదం 500 మీటర్ల దూరంలోనే ఉందని, క్యూరియాసిటీ అక్కడికి చేరితే చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
మార్స్‌పై 350 కోట్ల ఏళ్ల క్రితం హిమానీనదాలు!
అరుణగ్రహంపై ప్రస్తుతం నాసా క్యూరియాసిటీ రోవర్ తిరుగుతున్న గేల్ క్రేటర్ ప్రాంతంలో ఒకప్పుడు హిమానీనదాలు, సరస్సులు ఉండేవట. గేల్ క్రేటర్ ప్రాంతంలో సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం చాలా చల్లని నీరు నదులుగా ప్రవహించడమే కాకుండా లోతట్టుప్రాంతాల్లో సరస్సులూ ఉండేవట. నీటి ప్రవాహాల కారణంగా భూమిపై అలాస్కా, ఐల్యాండ్ వంటి చోట్ల ఏర్పడిన తరహాలో మైదానాలు కూడా మార్స్‌పై ఏర్పడ్డాయట. అంగారకుడిపై ఇటీవలే ఒక సంవత్సరం(మనకు 687 రోజులు) పూర్తిచేసుకున్న క్యూరియాసిటీ తీసిన చిత్రాలను, మార్స్ చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి అందిన సమాచారాన్ని అధ్యయనం చేయగా ఈ వివరాలు తెలిశాయని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. చిత్రంలో ఎడమవైపున మార్స్‌పై ఒకప్పుడు హిమానీనదాల వల్ల ఏర్పడిన ఉపరితల మార్పులు కాగా.. కుడివైపున ప్రస్తుతం భూమిపై ఐల్యాండ్ ప్రాంతంలోని ఓ గ్లేసియర్ వద్ద జరిగిన ఉపరితల మార్పులు.