Nasir Jamshed
-
పాక్ క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ఓపెనర్ నాసిర్ జంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తోటి క్రికెటర్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కారణంగా జెంషెడ్‌కు శిక్ష పడింది. గత డిసెంబర్లో 33 ఏళ్ల నాసిర్ జంషెడ్ తన నేరాన్ని అంగీకరించగా.. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం 17 నెలల జైలు శిక్షను విధించింది. పాక్ సూపర్ లీగ్‌లో ప్లేయర్లుగా ఉన్న యూసెఫ్ అన్వర్, మొహమ్మద ఇజాజ్‌లు లీగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకుండా ఉండేందుకు జెంషెడ్ వారికి ముడుపులు ఇవ్వచూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో నేషనల్ క్రైం ఏజెన్సీ ఈ ఫిక్సింగ్‌ను బట్టబయలు చేసింది. నేషనల్ క్రైం ఏజెన్సీ విచారణలో తమ నేరాలనునాసిర్ జంషెడ్, అన్వర్, ఇజాజ్‌లు అంగీకరించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కోర్టు ఈ ముగ్గురికి శిక్షను విధించింది. జెంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష పడగా.. అన్వర్‌కు 40 నెలలు, ఇజాజ్‌కు 30 నెలల శిక్ష పడింది. 2018 ఆగస్టులోనే పాక్ క్రికెట్ బోర్డు జెంషెడ్‌పై పదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2016-17 సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నసీర్‌కు పీసీబీ పదేళ్ల నిషేధాన్ని విధించింది. నాసిర్ జంషెడ్ భార్య సమారా అఫ్జల్ స్పాట్ ఫిక్సింగ్ వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'జంషెడ్ చర్యల కారణంగా మా కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. ఇతర క్రికెటర్లను అవినీతికి పాల్పడమని చెప్పడం సమంజసం కాదు. జంషెడ్ కష్టపడి ఉంటే అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. కానీ అతను షార్ట్ కట్ మార్గం ఎంచుకుని ప్రతిదీ కోల్పోయాడు. కెరీర్, హోదా, గౌరవం అన్ని నాశనం చేసుకున్నాడంటూ' ఆమె పేర్కొన్నారు. Today is the most difficult day of my life as Nasir starts his custodial sentence & I figure out what to tell my 4 year old.. I’ve felt the need to write this in the hope that others learn from Nasirs mistakes & no one goes through the pain we have suffered in the last 3 years. pic.twitter.com/fgkkMiglgz — Dr Samara Afzal (@SamaraAfzal) February 7, 2020 -
పాకిస్తాన్ క్రికెటర్‌పై పదేళ్ల నిషేధం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ నాసిర్ జంషేడ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అతను పీసీబీ అవినీతి నిరోధక శాఖ కోడ్ అతిక్రమించినట్లు గుర్తించి చర్యలు తీసుకుంది. నాసిర్ ఏ స్థాయి క్రికెట్ ఆడటానికి వీళ్లేదని శుక్రవారం ముగ్గురు సభ్యుల స్వతంత్ర అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ప్రకటించింది. ఇక బోర్డ్ కోడ్ ఉల్లంఘించిన క్రికెటర్లు పీసీబీలో ఏలాంటి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉండదు. గత రెండేళ్లలో నాసిర్‌పై పీసీబీ రెండోసారి శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్లో అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది. 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో నాసిర్ స్పాట్ ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి ఆరోపణల్లో భాగంగా విచారణకు సహకరించనందుకు ఏడాది పాటు నిషేధం విధిస్తూ పీసీబీ చర్యలు తీసుకుంది. ఈ కేసులో బ్రిటన్ పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేశారు. పాకిస్తాన్ తరపున 48 వన్డేలు ఆడిన నాసిర్ 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1418 పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన నాసిర్ 18 టీ20లు, రెండు టెస్టులకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. -
మరో క్రికెటర్‌పై ఏడాది నిషేధం
కరాచీ: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో భాగంగా విచారణకు సహకరించనందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషెడ్‌పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వంటి తదితర టోర్నీలకు జంషెడ్‌ను ఏడాది పాటు బహిస్కరిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది ఒక టీ 20 టోర్నమెంట్లో జంషెడ్ స్పాట్ ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నేతృత్వంలోని యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) విచారణ చేపట్టడానికి సిద్దమవ్వగా, అందుకు జంషెడ్ సహకరించలేదు. దాంతో అతనిపై ఏడాది నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. అంతకుముందు పలువురు పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కుని నిషేధం ఎదుర్కొంటున్నారు. అందులో బ్యాట్స్‌మెన్ షార్జిల్ ఖాన్, ఖలిద్ లతీఫ్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, పేసర్ మొహ్మద్ ఇర్ఫాన్, ఆల్ రౌండర్ మొహ్మద్ నవాజ్‌లపై 12నెలల నిషేధం పడింది. -
ట్వంటీ20 స్పాట్ ఫిక్సింగ్: మరొకరి అరెస్ట్
లండన్: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ పై దృష్టిపెట్టిన బ్రిటన్ జాతీయ నేర విభాగం షెఫీల్డ్ లో స్థానిక పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి బెయిల్ పై విడుదలనట్లు తెలిపింది. ఫిబ్రవరి 13న పాక్ క్రికెటర్లు నాసిర్ జంషెడ్, యూసఫ్ లను అదుపులోకి తీసుకోగా రెండు రోజుల అనంతరం ఏప్రిల్ వరకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు. పీఎస్ఎల్ కు సంబంధించి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డార్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు పాక్ క్రికెటర్లు షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ లకు రెండు వారాల గడువిస్తూ వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. గత శనివారం పీసీబీ ఈ ఇద్దరు క్రికెటర్ల విషయాన్ని మీడియాకు వెల్లడించింది. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ ఇదివరకే.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ ను సస్పెండ్ చేసింది. పీఎస్ఎల్ లో పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై బ్రిటన్ ఎన్సీఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫిక్సింగ్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో మరికొందరిపై నిఘా పెట్టింది. షార్జిల్, లతీఫ్ మాత్రం తమకు ఫిక్సింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని, తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వివరాలపై మాట్లాడేందుకు పీసీబీ నిరాకరిస్తోంది.