టిప్సీ హోగయి!
నీలి చిత్రాల నుంచి బాలీవుడ్ రంగప్రవేశం చేసి యమ బిజీగా మారిపోయిన సెక్సీ సుందరి సన్నీలియోన్‌కు ఇన్నాళ్లకు గట్టి పోటీనే వచ్చినట్టుంది. జపీందర్ కౌర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘దిల్వాలీ జాలిమ్ గాళ్‌ఫ్రెండ్’లో రష్యన్ బేస్డ్ మోడల్, యాక్టర్ నటాలియా క్యాప్చుక్ ఓ ఐటెమ్ సాంగ్‌తో అదరగొట్టిందట. చిత్రంలోని ‘టిప్సీ హోగయి’ పాటకు ఈ టీవీ ప్రెజంటర్ దుమ్ము లేపిందట.
కైపెక్కించే లుక్స్... చూడగానే ఆకట్టుకొనే ఫిజిక్... దాన్ని మరింత అందంగా ప్రజంట్ చేసే చిట్టిపొట్టి డ్రెస్సింగ్... మొత్తానికి ఈ పాట పురుష పుంగవుల ఉష్ణోగ్రతలను అమాంతం పెంచేయడంలో సందేహం లేదన్నది ఇండస్ట్రీ టాక్! పూజీ, రాజ్‌వీర్‌సింగ్‌లు ఆలపించిన ఈ సాంగ్‌కు డాక్టర జియస్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. రీసెంట్గా దేశీ లుక్స్‌తో మతిపోగొట్టిన సన్నీని ఈ లేటెస్ట్ నటాలియా బీట్స్ మైమరిపిస్తాయంటున్నారు బాలీవుడ్ జనులు! లెట్స్ సీ!