National Bank
-
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
‘ఇన్ఫ్రా’ జాతీయ బ్యాంకుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు, అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు ఏర్పాటుకు (నాబ్‌ఫిడ్ బిల్లు/నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్) రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ సంస్థపై పార్లమెంటు పర్యవేక్షణ లేదన్న అంశాన్ని లెవనెత్తారు. సెలక్ట్ కమిటీకి పంపించాలంటూ డిమాండ్ చేశారు. చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఈ సంస్థకు సంబంధించి ఆడిట్ నివేదికలను ఏటా పార్లమెంటు పరిశీలన కోసం అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ‘అధీకృత మూలధనం రూ.10లక్షల కోట్లను సమకూర్చనున్నాం. రూ.20,000 కోట్లను ఈక్విటీ కింద, రూ.5,000 కోట్లను గ్రాంట్ కింద ప్రభుత్వం మంజూరు చేసింది’’ అని మంత్రి తెలిపారు. సౌర్వభౌమ హామీ ఉంటుందని.. ఆర్బీఐ నుంచి రుణం పొందొచ్చన్నారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నాబ్‌ఫిడ్ రుణ వితరణ చేస్తుందన్నారు. కాగా, నాబ్‌ఫిడ్ 4–5 నెలల్లో కార్యకలాపాలును ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేశాశిష్ పాండా పేర్కొన్నారు. -
రూ. 24 లక్షలు గోవిందా! బ్యాంకు అధికారులు బుక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఖాతానుంచి రూ. 24 లక్షలు మోసపూరితంగా దారి మళ్లాయి. ఢిల్లీలోని కేజీ మార్క్‌వద్ద ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో బీఎస్ఎన్ఎల్ చెక్కుల పేరుతో అక్రమంగా నగదు విత్ డ్రా అయింది. తద్వారా నకిలీ చెక్కులతో అక్రమార్కులు, అటు బ్యాంకునకు, ఇటు బీఎస్ఎన్ఎల్ సంస్థకు కుచ్చు టోపీ పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బీఎస్ఎన్ఎల్ అధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారికంగా తాము ఎలాంటి చెక్కులు జారీ చేయకుండానే తమ ఖాతా నుంచి రూ .24 లక్షలకు పైగా నగదును తప్పుగా డెబిట్ చేశారనే డీప్యూటీ మేనేజర్ లీలా రామ్ మీనా ఆరోపించారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించి, తమ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాల్సిందిగా కోరామని దీనికి బ్యాంకు తిరస్కరించిందని తెలిపారు. నవంబర్ 21న రూ. 66,505 విలువైన చెక్‌తోపాటు మొత్తం మూడు చెక్కులిచ్చామని, అయితే అవి సంబంధిత లబ్దిదారులకు చేరింది, కానీ తాము జారీ చేయని (బీఎస్ఎన్ఎల్) మరో మూడు చెక్కులను అనధికారింగా బ్యాంకు క్లియర్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రూ .24,25,635 నష్టాన్ని చవిచూశామని బీఎస్ఎన్ఎల్ ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక విచారణ తరువాత, అదే నెంబర్‌తో మరో మూడు చెక్కులను బ్యాంకుకు సమర్పించినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత
స్తంభించిన లావాదేవీలు ఖాతాదారుల ఆగ్రహం నేడు అందుబాటులోకి కొత్త రూ.500 నోట్లు జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించారుు. గంటల తరబడి బ్యాంకుల ముందు బారులు తీరిన ఖాతాదారులకు నగదు అందకపోవడంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నారుు. అధికారులను నిలదీశారు. నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు. తిరుపతి (అలిపిరి): జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఆర్బీఐ నుంచి నగదు అందడం లేదు. దీంతో బ్యాంకు శాఖల్లో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె వంటి ప్రధాన ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలకు సకాలంలో నగదు రాలేదు. బుధవారం ఉదయం 10 గంటలకు బ్యాంకుల వద్దకు చేరుకున్న ఖాతాదారులు మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి వున్నా నగదు అందలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంకుల్లో నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు. చివరికి చేసేది లేక వెనుదిరగాల్సివచ్చింది. జిల్లాకు అందిన అరకొర నగదు జిల్లా అవసరాల రీత్యా రూ.1800 కోట్లు అవసరమైతే ఆర్బీఐ నుంచి రూ.109 కోట్లు మాత్రమే అందారుు. అందులో రూ.9 కోట్లు మాత్రమే రూ.500 నోట్లు వున్నాయని జిల్లా అధికారులు ప్రకటించారు. బుధవారం కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రావాల్సి వున్నా.. వాటిని బ్యాంకులకు చేరవేయడానికి ఎక్కవ సమయం పట్టడంతో గురువారం ప్రధాన బ్యాంకు శాఖల్లో కొత్త రూ.500 నోట్లు ఖాతాదారులకు అందుబాటులోకి రానున్నారుు. ఏటీఎంలలో నో క్యాష్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాలు చాలావరకు పూర్తిస్థారుులో పనిచేయడం లేదు. తిరుపతి నగరంలో తిలక్ రోడ్డు, మదనపల్లెలో ఆర్టీసీ బస్టాండు ప్రాంతం, చిత్తూరులో జిల్లా కలెక్టరేట్లోని ఏటీఎంలు మినహా మరే ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థారుులో పనిచేయలేదు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, పుంగనూరు వంటి ప్రాంతాల్లో ఏటీఎంలు అడపాదడపా పనిచేసినా నిమిషాల వ్యవధిలో క్యాష్ ఖాళీ కావడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. -
దొంగ దొరికాడు!
► రూ.23.40 లక్షలు కాజేసినట్లు నిర్థారణ ► పదిమంది పేర్ల మీద నకిలీ బంగారం తనఖా ► పోలీసుల అదుపులో బ్యాంకు అప్రైజర్ సాగర్ పిడుగురాళ్ళ (గుంటూరు) : పట్టణంలోని ఓ జాతీయ బ్యాంకు (యూనియన్ బ్యాంక్)లో నకిలీ బంగారాన్ని పెట్టి బ్యాంకు అధికారులను మోసం చేసిన అప్రైజర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన స్నేహితులు, బంధువులు సుమారు పది మంది పేర్లపై దొంగ బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మొత్తం రూ.23.40 లక్షలను నొక్కేశాడు. బంగారాన్ని తీసుకెళ్లమని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్ చేయడంతో అసలు గుట్టు బయట పడింది. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని పరిశీలించి ప్రతి ఖాతాదారుడి వివరాలు, ఖాతాదారుడు ఎంత బంగారం బ్యాంకులో పెట్టాడు , ఎంత నగదు తీసుకున్నాడన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో బ్యాంకు ఆడిట్ బృందం రహస్యంగా రెండు వారాల పాటు విచారణ నిర్వహించింది. ఆ సమయంలోనే బ్యాంకులో భారీ నగదు స్వాహా అయినట్లు సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. అప్పట్లో బ్యాంకు పరువు పోతుందని బ్యాంకు మేనేజర్ సమాచారం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బ్యాంకులో అప్రైజర్ చేసిన మోసాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు నిగ్గు తేల్చారు. దీంతో బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్చార్జి సీఐ వై. శ్రీధర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అప్రైజర్ సాగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తిని సాక్షి వివరణ కోరగా అప్రైజర్ సాగర్ దొంగ బంగారం పెట్టి బ్యాంకు సొమ్మును కాజేసిన మాట వాస్తవమేనన్నారు. అతను కాంట్రాక్టు ఉద్యోగి అని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని, అతని వద్ద నుంచి బ్యాంకు నగదును రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
స్టేట్ బ్యాంకులు బంద్
♦ ఒక్కరోజు సమ్మెలో ఉద్యోగులు ♦ స్తంభించిన లావాదేవీలు ♦ నేడు, రేపు బ్యాంకులకు సెలవు వివిధ డిమాండ్ల సాధన కోసం జాతీయ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు పూనుకున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో సేవలు స్తంభించాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి : ఉద్యోగుల వేతనాల పెంపు ఇతర డిమాండ్లపై గత ఏడాది మే నెలలో ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో సమ్మెకు పూనుకున్నట్లు యూనియన్ నేతలు చెప్పారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ తిరువాంగూర్, మైసూర్, పాటియాలా, హైదరాబాద్, జైపూర్ తదితర బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించా రు. గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పటివరకూ అమలు చేయకపోవడం శోచనీయమని నిరసించారు. పనిభారం పెరిగిపోయిందని, అదనపు వేళలు పని చేయిస్తున్నార ని, బలవంతపు బదిలీలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెన్నై ప్యారీస్‌లో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం విధులకు హాజరయ్యారు. కింది స్థాయి సిబ్బంది లేని కారణంగా లావాదేవీలు యథావిధిగా సాగలేదు. అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం మీద 6 వేల బ్యాంకు శాఖలు ఉండగా 30 వేల మంది ఉద్యోగులు శుక్రవారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. చెన్నైలోని 1100 శాఖలకు చెందిన 8 వేలమంది సమ్మె చేశారని చెప్పారు. సమ్మె కారణంగా రాష్ట్రం మొత్తం మీద సుమారు రూ.5.6 కోట్ల చెక్కుల లావాదేవీలు ఆగిపోయాయి. వరుసగా సెలవులు :ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడినట్లయింది. శుక్రవారం సమ్మె, 9వ తేదీ రెండవ శనివారం, 10న ఆదివారం కారణంగా సెలవు. వరద సహాయక చర్యల కింద ప్రభుత్వం అందజేసిన రూ.5వేలు నగదు బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసుకునేందుకు బాధితులు ప్రతిరోజూ బారులుతీరుతున్నారు. ఇక, 11వ తేదీ సోమవారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత పొంగల్ పండుగ సెలవులతో మరోసారి బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. -
ఫైనాన్స్ కంపెనీలో రూ. 15 లక్షలు గోల్మాల్
పెనుకొండ : పట్టణంలోని ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ కంపెనీలో రూ.15లక్షలు గోల్మాల్ అయినట్లు కంపెనీ మేనేజర్ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఖాతాదారులకు సంబంధించి బంగారు తాకట్టు నగలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. అయితే హిందూపురంలోని ఓ జాతీయ బ్యాంకులో జమా చేయమని కంపెనీ సొమ్మును తమ సిబ్బంది బాబా ఫక్రోద్ధిన్, మునీర్ చేతికి చ్చామని ఆ నగదు రూ. 15లక్షలు పక్కదారి పట్టాయని తెలిపారు. విచారణ అనంతరం సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఏజెన్సీలో జాతీయ బ్యాంకు సేవలు విస్తృతం
మండల కేంద్రాల్లో కొత్త శాఖల ఏర్పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్ పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ప్రజలందరికీ జాతీయబ్యాంకుల సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. పాడేరులో ఆంధ్రాబ్యాంకు నూతన శాఖను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లోను రెండు, మూడు జాతీయ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రజలకు బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రోత్సాహకాలు, రాయితీలు సకాలంలో అందేవిధంగా కొత్తబ్యాంకుల సేవలు ఉంటాయన్నారు. ఆరునెలల నుంచి ఏజెన్సీలో బ్యాంకుల సేవల విస్తరణకు తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఐటీడీఏ సిద్ధమవడంతో అనేక జాతీయ బ్యాంకులన్నీ ఏజెన్సీలో కొత్తశాఖల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని వారందరికీ ఏజెన్సీ తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. బ్యాంకుల ఏర్పాటుకు అద్దె భవనాల కొరత ఉండడంతో ఐటీడీఏ బ్యాంకులకు భవనాలను సమకూరుస్తుందన్నారు. డుంబ్రిగుడ, ముంచంగి పుట్టు, పెదబయలు కేంద్రాల్లో కూడా ఆం ధ్రాబ్యాంకు శాఖల ఏ ర్పాటుకు చర్యలు తీ సుకుంటున్నామన్నా రు. ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మే నేజర్ జి.వి.లలిత్ ప్ర సాద్ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ సహకారంతో పాడేరులో ఆంధ్రాబ్యాంకు 105 వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఏటీఎంను కూడా ప్రారంభిస్తామన్నారు. ప్రధానమంత్రి జనధన యోజన కింద బీమా సేవలను కూడా వినియోగదారులకు అందిస్తామన్నారు. అంతకుముందు ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్ట్రాంగ్ రూంను ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, బ్యాంక్ కౌంటర్‌ను ఆర్డీఓ రాజకుమారిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు ఏజీఎం ఎ.రవిరమణ, చీఫ్ మేనేజర్ రామకోటయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమణమూర్తి, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన సంక్షేమ డీఈఈ డీవీఆర్‌ఎం రాజు, ఐకేపీ ఏపీడీ రత్నాకర్, ఐటీడీఏ ఉద్యానవన అధికారి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ ప్రారంభించే భవన నిర్మాణ పనులను పరిశీలించారు.