- మండల కేంద్రాల్లో కొత్త శాఖల ఏర్పాటు
- ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ప్రజలందరికీ జాతీయబ్యాంకుల సేవలను అందుబాటులోకి తెస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. పాడేరులో ఆంధ్రాబ్యాంకు నూతన శాఖను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లోను రెండు, మూడు జాతీయ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఏజెన్సీ ప్రజలకు బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రోత్సాహకాలు, రాయితీలు సకాలంలో అందేవిధంగా కొత్తబ్యాంకుల సేవలు ఉంటాయన్నారు. ఆరునెలల నుంచి ఏజెన్సీలో బ్యాంకుల సేవల విస్తరణకు తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఐటీడీఏ సిద్ధమవడంతో అనేక జాతీయ బ్యాంకులన్నీ ఏజెన్సీలో కొత్తశాఖల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని వారందరికీ ఏజెన్సీ తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు.
బ్యాంకుల ఏర్పాటుకు అద్దె భవనాల కొరత ఉండడంతో ఐటీడీఏ బ్యాంకులకు భవనాలను సమకూరుస్తుందన్నారు. డుంబ్రిగుడ, ముంచంగి పుట్టు, పెదబయలు కేంద్రాల్లో కూడా ఆం ధ్రాబ్యాంకు శాఖల ఏ ర్పాటుకు చర్యలు తీ సుకుంటున్నామన్నా రు. ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మే నేజర్ జి.వి.లలిత్ ప్ర సాద్ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ సహకారంతో పాడేరులో ఆంధ్రాబ్యాంకు 105 వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. ఏటీఎంను కూడా ప్రారంభిస్తామన్నారు.
ప్రధానమంత్రి జనధన యోజన కింద బీమా సేవలను కూడా వినియోగదారులకు అందిస్తామన్నారు. అంతకుముందు ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్ట్రాంగ్ రూంను ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, బ్యాంక్ కౌంటర్‌ను ఆర్డీఓ రాజకుమారిలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు ఏజీఎం ఎ.రవిరమణ, చీఫ్ మేనేజర్ రామకోటయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రమణమూర్తి, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన సంక్షేమ డీఈఈ డీవీఆర్‌ఎం రాజు, ఐకేపీ ఏపీడీ రత్నాకర్, ఐటీడీఏ ఉద్యానవన అధికారి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ ప్రారంభించే భవన నిర్మాణ పనులను పరిశీలించారు.