National Bird
-
జాతీయ పక్షి జాడేదీ?
అటవీప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే జాతీయ పక్షి నెమలి జాతి నానాటికి కనుమరుగవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఏజన్సీలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారులు, పొలాలు, గ్రామశివారుల్లో కనిపించేవి. ఇప్పడు చూద్దామంటే మచ్చుకై నా వాటి జాడ కనిపించడం లేదు.ఎక్కడో లోతట్టు అటవీ ప్రాంతంలో తప్ప, మిగతా ప్రదేశాల్లో నెమలి అరుపులు వినిపించడం లేదు. వై.రామవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నెమళ్ల జాడ కనిపించడం లేదు. ఒకప్పుడు 10 వేల వరకు వీటి సంతతి ఉండేది. ఇప్పుడు మూడు వేలకు లోపే ఉందని అటవీశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇవి అంతరించి పోవడానికి వెనుక చాలా కారణాలు లేకపోలేదు. ► వేటగాళ్లు విచ్చలవిడిగా వేటాడుతున్నారు. కొంతమంది విద్యుత్ అమర్చడం వల్ల మృత్యువాతపడుతున్నాయి. ► పొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహారక మందుల ప్రభావం కూడా నెమళ్ల సంతతిపై చూపుతోంది. ఆహార ధాన్యాలు తినేందుకు వస్తున్న నెమళ్లు పురుగు క్రిమిసంహారక మందుల అవశేషాలు కారణంగా మృత్యువాత పడుతున్నాయి. వై.రామవచం మండల సరిహద్దు గ్రామాలైన దబ్బపాలెం, నంగలకొండ, చాకిరేవులు తదితర గ్రామాల్లో పురుగుమందులు అవశేషాలున్న పంటలను తిని నెమళ్లు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ► కొంతమంది అడవిలో నెమళ్లు పెట్టిన గుడ్లను, వాటి పిల్లలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ కారణంగా కూడా వాటి సంతతి వృద్ధి చెందడం లేదు. ► మైదాన ప్రాంతానికి చెందిన వేటగాళ్లు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆవుల సాయంతో నెమళ్లను వేటాడేవారు. ఆవుల చాటున మాటువేసి నెమళ్లను పట్టుకుని హతమార్చేవారు. లోతట్టు ప్రాంతాలైన జంగాలకోట, బురదకోట, రాములుకొండ పరిసరాల్లో ఈ రకం వేట ఎక్కువగా జరిగేది. అప్పటిలో మావోయిస్టులు ప్రభావం ఎక్కువగా ఉన్నందున అటవీసిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించలేకపోయేవారు. ► పోడు వ్యవసాయం పేరిట అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఈ కారణంగా కూడా మరో ప్రాంతానికి వలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ► వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా వాటి ప్రయోజనం కనిపించడం లేదు. విద్యుత్ కంచెకు ప్రాణాలు బలి నెమళ్లు, అడవి జంతువుల కోసం ఏర్పాటుచేస్తున్న విద్యుత్ కంచె ప్రాణనష్టం జరుగుతోంది. వై.రామవరం మండలంలో విద్యుత్ కంచెలో చిక్కుకుని గిరిజనులు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. పదేళ్లక్రితం చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన కుర్రే వెంకటేశ్వర్లు, గిరిజనుడు విద్యుత్ కంచెకు బలయ్యాడు. గతేడాది మండలంలోని సింహాద్రిపాలేనికి చెందిన ఓ గిరిజనుడు మృత్యువాత పడ్డాడు. ప్రత్యేక విభాగం ఉన్నా.. వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అటవీశాఖలో ప్రత్యేక విభాగం ఉంది. రంపచోడవరం అటవీడివిజన్కు రాజమహేంద్రవరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనికి డీఎఫ్‌వో స్థాయి అధికారి ఉంటారు. వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం అందిస్తే తగిన రక్షణ చర్యలు చేపడతారు. చట్టపరమైన చర్యలుతీసుకుంటాం వన్యప్రాణులను వేటాడటం, హతమార్చడం చట్టరీత్యానేరం. ఎక్కడైనా వేటాడితే వెంటనే తమ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి తెలియజేస్తాం. – సత్యనారాయణ,డిప్యూటీ రేంజి అధికారి, వై.రామవరం -
నేషనల్ బర్డ్ డే.. బుల్లిగువ్వా ఎక్కడ నీ సవ్వడి
-
జాతీయ పక్షిగా కాకి!
సాక్షి, బెంగళూర్ : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై విరుచుపడ్డారు. శనివారం మండ్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ ఉండబోదన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ గనుక అధికారంలోకి వస్తే నన్ను ఏదో ఒకటి చేయటం మాత్రం ఖాయం. ఈ మధ్యే కలబురగిలో బీజేపీ నేతలు నాపై దాడికి యత్నించారు. నా కారుపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వచ్చాక నన్ను వదిలేస్తారా?. ప్రశ్నించటమే నా తప్పు అయితే ఇది ప్రజాస్వామిక దేశం ఎలా అవుతుంది?’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. భారత్‌ను హిందూ దేశం అనటాన్ని తాను వ్యతిరేకిస్తానన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ హిందువులు ఎక్కువగా ఉన్నారని వాళ్లు(హిందూ అతివాద సంస్థలు) భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. మరి దేశంలో నెమళ్ల సంఖ్య కన్నా కాకులు కోకోల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించటమే ఉత్తమం!. కేవలం ఒక మతం ఆధారంగా దేశానికి ముద్ర వేయటం మూర్ఖత్వమే అవుతుంది’ అని ఆయన అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. -
నెమలికి ప్రాణం పోశారు..
జిన్నారం (మెదక్): గాయపడి చావు బతుకుల మద్య ఉన్న జాతీయపక్షి నెమలికి ప్రాణంపోసి సురక్షిత ప్రాంతానికి తరలించిన యువకులకు ప్రశంసలు లభించాయి. మెదక్ జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం గ్రామసమీపంలోని పొలాల్లోకి వెళ్లిన యువకులకు ఒక నెమలి కనిపించింది. అది ఎంతకూ కదలకపోయేసరికి దగ్గరికి వెళ్లి పరిశీలించగా, రెక్కుల వెనుక భాగంలో రక్తం కారుతుండటాన్ని గమనించారు. వెంటనే ఆ నెమలిని గ్రామంలోకి తీసుకొచ్చి ప్రాథమిక చికత్స చేశారు. అటవీశాఖ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో నెమలిని జిన్నారం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నెమలిని కాపాడిన రవికుమార్, కుర్మ శ్రీనివాస్, ప్రదీప్, భూపాల్, శేఖర్ లను పలువురు అభినందించారు. -
ఈకలున్నా ఇది బాల్డ్ ఈగలే..!
ప్లే టైమ్ మనిషి కన్నా నాలుగురెట్ల తీక్షణమైన చూపు, నీటిలో ఈదుతున్న చేపను సైతం పట్టేసుకొని వెళ్లేంత నేర్పు బాల్డ్ ఈగల్‌కు సొంతం. ఉత్తర అమెరికా ఖండంలో మాత్రమే కనిపించే పక్షి ఇది. సరస్సుల, జలపాతాల సమీపాల్లో ఆవాసాన్ని ఏర్పరుచుకొని నీటికి పైవైపుకు వచ్చే చేపలను పట్టేసుకొని తింటూ ఉంటుంది. గూళ్ల నిర్మాణం విషయంలో ఉత్తర అమెరికా పరిధిలో ఉండే పక్షి, జంతు జాతుల్లో బాల్డ్ ఈగల్‌కు సాటివచ్చేవి మరేవీ లేవు. అన్ని పక్షి, జంతుజాతుల కన్నా పెద్దసైజు గూళ్లను కట్టుకొంటుంది. ఈ జాతిలో పరిమాణం విషయంలో మగపక్షుల కన్నా ఆడ పక్షులే పెద్దగా ఉండటం విశేషం. యునెటైడ్ స్టేట్ ఆఫ్ అమెరికా పరిధిలో ఈ పక్షులు విస్తృతంగా ఉంటాయి. అందుకే దీన్ని అమెరికన్లు తమ జాతీయ పక్షిగా గౌరవిస్తున్నారు, తమ జాతీయ చిహ్నంలో కూడా స్థానమిచ్చారు. జీవనక్రమంలో ఈకలేమీ ఊడిపోకపోయినా దీన్ని ‘బాల్డ్ ఈగల్’గానే వ్యవహరిస్తారు. ఖతార్ దేశ నాణేలపై కూడా ఈ పక్షి ఉంటుంది.