national citizens
-
అట్టుడుకుతున్న ఈశాన్యం
గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పౌర నిరసనలకు కేంద్రంగా మారిన అస్సాం రాజధాని గువాహటిలో బుధవారం నిరవధిక కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూని ధిక్కరిస్తూ నిరసనకారులు వీధుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. గువాహటి, దిస్పూర్, డిబ్రూగఢ్, జోర్హాత్, త్రిపుర రాజధాని అగర్తల తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అస్సాం రాజధాని దిస్పూర్లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు దిస్పూర్లో ఆదివారం భేటీ కానున్న వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనల కారణంగా తేజ్‌పూర్ నుంచి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కొద్దిసేపు గువాహటి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పలు రైళ్లను రద్దు చేశారు. త్రిపుర, అస్సాంలలో ఆర్మీని మోహరించారు. అస్సాంలోని 10 జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ను నిలిపేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్తో పాటు ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కూడా నిలిపేశారు. ఆందోళన ఎందుకు? ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని జనాభా స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు వర్తించదు. ఇప్పటికే అస్సాం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కొందరిలో నెలకొంది. -
ఎన్నార్సీ తప్పనిసరి
కోల్‌కతా: దేశ భద్రత కోసం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ మతాలకు చెందిన శరణార్థులకు మాత్రం పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా భారత పౌరసత్వం కలి్పస్తామన్నారు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అమిత్ మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నార్సీ గురించి తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారని తెలిపారు. ఎన్నార్సీ పేరుతో బెంగాలీలను తరిమేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ, తమపై ఆమె తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్లో ఎన్నార్సీ అమలవుతుందని, భయపడాల్సినంత ఏమీ జరగదని తెలిపారు. చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని స్పష్టం చేశారు. చొరబాటుదారులతో ప్రపంచంలో ఏ దేశం సుభిక్షంగా ఉండలేదని, అందుకే చొరబాట్లను నిరోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మమతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చొరబాటుదారులను బెంగాల్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు వారే ఆమెకు ఓటుబ్యాంకుగా మారారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా స్పందిస్తూ.. ‘దయచేసి ప్రజల్లో భేదాభిప్రాయాలు సృష్టించకండి. బెంగాలీలు మతాలకతీతంగా తమ నాయకులను గౌరవిస్తున్నారు. దాన్నెవరూ చెరపలేరు’ అని అమిత్‌షా వ్యాఖ్యలకు పరోక్షంగా బదులిచ్చారు. -
‘నీ జాతి ఏమిటి.. పందిమాంసం తిను’
గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. బీఫ్ అమ్ముతున్నాడనే కారణంగా ఓ ముస్లిం వ్యక్తిపై మూకదాడి జరిగింది. అతడిపై దాడికి పాల్పడ్డ కొంతమంది వ్యక్తులు పందిమాంసం తినాలంటూ ఒత్తిడి చేశారు. ‘నీ జాతి ఏమిటి. నువ్వు బంగ్లాదేశీవా. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)’ లో నీ పేరు ఉందా’ అని అతడిని నిలదీశారు. ఏప్రిల్ 7న అసోంలోని బిస్వంత్ చరియాలిలో జరిగిన ఈ హేయమైన చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. షౌకత్ అలీ(68) గత 35 ఏళ్లుగా స్థానిక మార్కెట్లో ఈటరీ నడుపుతున్నాడని, ఈ క్రమంలో వారాంతాల్లో బీఫ్ అమ్ముతాడనే కారణంగా ఆదివారం అతడిపై దాడి జరిగిందని పేర్కొన్నారు. అలీతో పాటు మార్కెట్ మేనేజర్‌పై మూక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు.. ‘ గత ఐదేళ్లలో మూకదాడులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి ప్రతీ వీడియో నాకు బాధ కలిగిస్తోంది. అసోంలో బీఫ్ లీగలే.. కానీ అమాయక వ్యక్తులపై దాడికి పాల్పడటం ఇండియాలో ఇల్లీగల్’ అంటూ ట్వీట్ చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వెలువరించిన మేనిఫెస్టోలో ఎన్ఆర్సీపై త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : ‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది? కాగా భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ కారణంగా గత కొంతకాలంగా అసోంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పలు మూకదాడులు జరుగుతున్నాయి. I know many people who feel they’re desensitized because of the number of lynchings in the last 5 years. I am not, each video infuriates me & saddens me It’s irrelevant that beef is legal in Assam, lynching an innocent old man is illegal in every part of India https://t.co/aqx8LqQjki — Asaduddin Owaisi (@asadowaisi) April 8, 2019 -
ఎన్ఆర్సీపై ప్రధాని భరోసా
ఇంఫాల్/సిల్చార్: నిజమైన పౌరులందరికీ జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)లో చోటు దక్కుతుందనిఅస్సాం ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పౌరసత్వ బిల్లుకు త్వరలోనే పార్లమెంటు ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఈశాన్య భారతంలో ప్రచారానికి మోదీ శుక్రవారం అస్సాంలో శంఖారావం పూరించారు. మణిపూర్‌లోనూ ఆయన పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అస్సాంలోని సిల్చార్ సమీపంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో మోదీ మాట్లాడారు. ‘ఎన్ఆర్సీని రూపొందిస్తున్నప్పుడు అనేకులు ఎదుర్కొన్న ఇబ్బందులు నాకు తెలుసు. కానీ నిజమైన పౌరులెవ్వరికీ అన్యాయం జరగదని నేను మీకు హామీనిస్తున్నా. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసినందుకుగాను నేను ఈ రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉన్నా’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మొత్తం 100 రోజుల్లో 20 రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. పనితీరును మార్చేశాం.. 2014లో తాము అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల పనితీరును మార్చేశామని మోదీ మణిపూర్‌లో చెప్పారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో మోదీ ఎనిమిది కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి మరో నాలుగింటికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసి వదిలేసిన రూ. 12 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మేం ముందుకు తీసుకెళ్లాం. గత 4 దశాబ్దాల్లో మణిపూర్‌కు అభివృద్ధి ఫలాలను నాటి ప్రభుత్వాలు దక్కనివ్వలేదన్నారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాల రాజధానుల మధ్య రైల్వే అనుసంధానత కల్పిస్తామని మోదీ చెప్పారు. -
ఇక అన్ని రాష్ట్రాలకూ ఆ జాబితా..
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో చేపట్టిన జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) పెను వివాదం రేపగా తాజాగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్సీ నిర్వహించేందుకు హోం మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేపడతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓం మాధుర్ పేర్కొనడం గమనార్హం. అందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు దేశం ధర్మశాల కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఎన్ఆర్సీని కేవలం అసోంకు పరిమితం చేయరాదని, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది. కాగా, అసోం ఎన్ఆర్సీ ముసాయిదాలో 40 లక్షల మంది ప్రజలకు చోటు దక్కకపోవడంతో ఈ జాబితాపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. మరోవైపు అక్రమ విదేశీయులుగా ప్రకటించిన వారికి బయోమెట్రిక్ వర్క్ పర్మిట్ జారీ చేయాలని హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని సమాచారం. అక్రమ విదేశీయులకు ఎలా చెక్ పెడతారని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉండటంతో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను హోమంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. వీరిని ఆయా రాష్ట్రాల్లో స్ధిరాస్తులు కొనుగోలు చేకుండా నిలువరించే చర్యలు చేపట్టవచ్చని సమాచారం. -
మోదీ అవినీతిని బయటపెడదాం
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ అనధికారికంగా ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు ప్రజాఉద్యమాలు తీసుకురావాలని నిర్ణయించింది. దీనమైన దేశ ఆర్థిక స్థితి, బ్యాంకు కుంభకోణాలు, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై దూకుడుగా బీజేపీని ఎదుర్కొనాలని శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించింది. పార్టీ చీఫ్ రాహుల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. రాహుల్‌తోపాటుగా మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ, ఆజాద్, ఖర్గే, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. యూపీఏ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియా వ్యక్తిగత కారణాలతో సీడబ్ల్యూసీ భేటీకి గైర్హాజరయ్యారు. పార్లమెంటు లోపలా, బయటా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలో విపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ‘నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించాం. అవినీతి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇదే మంచి తరుణం’ అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. చోక్సీ, రాఫెల్‌లపై దూకుడుగా.. సమావేశ వివరాలను పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రజాందోళనను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పీసీసీల సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 2017లో మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చినపుడు భారత విచారణ సంస్థలు క్లీన్చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకునే దేశం నుంచి చోక్సీని బయటకు పంపించిందని సుర్జేవాలా విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని గానీ, రక్షణ మంత్రి గానీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని సుర్జేవాలా అన్నారు. ఎన్నార్సీపై జాగ్రత్తగా.. అస్సాం ఎన్నార్సీ వివాదంపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నార్సీ కాంగ్రెస్ పార్టీ మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని.. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ చేసుకున్న అస్సాం ఒప్పందంలో భాగంగా ఎన్నార్సీ రూపకల్పన జరిగిందని సుర్జేవాలా తెలిపారు. భారతీయ పౌరుల్లో ఒక్కరు కూడా ఈ జాబితానుంచి తప్పిపోకుండా పార్టీ తరపున భరోసా ఇస్తున్నామన్నారు. 2005 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ 82,728 మంది బంగ్లాదేశీయులను బహిష్కరిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం నాలుగేళ్లలో 1,822 మంది బంగ్లాదేశీయులను మాత్రమే బయటకు పంపిందన్నారు. -
అసోం నూతన పౌరసత్వ జాబితాపై అపోహలొద్దు..
-
ఆ జాబితాపై అపోహలొద్దు..
సాక్షి,న్యూఢిల్లీ : అసోం నూతన పౌరసత్వ జాబితా (ఎన్ఆర్సీ)లో 40 లక్షల మంది లేకపోవడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని, ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్ష చూపే ప్రసక్తే లేదని, అనవసర వేధింపులు ఉండవని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ జాబితా నిజాయితీ, పారదర్శకతతో కూడిన ప్రక్రియ అన్నారు. సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము చర్యలు చేపడుతున్నామని మంత్రి శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడని తాము విస్మరించమని తాను హామీ ఇస్తున్నానని, ఈ జాబితాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. అసోంలో జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు దక్కని వారిపై ఎలాంటి తీవ్ర చర్యలు ఉండవని తేల్చిచెప్పారు. ఎన్ఆర్సీ తుది జాబితాలో పేరు లేని వారు విదేశీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు రేకేత్తించి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఆర్సీ జాబితాపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
అద్వానీతో దీదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పార్లమెంట్లో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీతో భేటీ అయ్యారు. వీరు ఇరువురు పలు అంశాలపై చర్చలు జరిపినా ప్రధానంగా అస్సాం ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన పౌరుల ముసాయిదా జాబితా గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు ఈ జాబితాపై బెంగాల్ దీదీ తీవ్రస్ధాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. పౌరుల జాబితాలో 40 లక్షల మందిని పక్కనపెట్టడంపై అసోం, మోదీ సర్కార్ల తీరును ఆమె ఆక్షేపిస్తున్నారు. అసోం జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) ముసాయిదా విడుదల అంతర్యుద్ధం, రక్తపాతానికి దారితీస్తుందని మమతా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఎన్ఆర్సీ వ్యవహారంపై బుధవారం రాజ్యసభలో పాలక, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళనతో సభ పలుమార్లు వాయిదా పడింది. -
ఆ జాబితాపై దీదీ ఫైర్
కోల్‌కతా : అస్సాం ప్రభుత్వం విడుదల చేసిన పౌరుల ముసాయిదా జాబితాలో 40 లక్షల మందికి పైగా ప్రజలకు చోటు దక్కకపోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. స్వదేశంలోనే వారు శరణార్ధులుగా మారారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విభజించి పాలించే విధానమే..ప్రజల్ని ఏకాకులుగా చేసి మానవత్వాన్ని మసిచేయడమేనని దీదీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తాను వ్యక్తిగతంగా ఈ అంశాన్ని తీసుకువెళతానన్నారు. ప్రజల్ని కాపాడండి..వారిని అణిచివేయకండని ప్రధానికి విన్నవిస్తానన్నారు. ఇంత కీలక చర్యలు చేపడుతున్న క్రమంలో బెంగాల్ ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించేందుకు 1951 తర్వాత తొలిసారిగా అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను ప్రభుత్వం అప్డేట్ చేసింది. ఈ జాబితాలో 40 లక్షల మందికి చోటుదక్కకపోవడంతో వీరిని స్ధానికేతరులుగా పరిగణిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కేవలం ముసాయిదా జాబితానేనని, దీని ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయడం లేదా వేరే ప్రాంతానికి తరలించడం వంటి చర్యలు చేపట్టబోమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బంగ్లా వలసదారుల పేరుతో అస్సాం ముస్లిం జనాభాను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని తుది జాబితా కాదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా అస్సాంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. -
40 లక్షల మందికి దక్కని పౌరసత్వం
గువాహటి : అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) ముసాయిదాను విడుదల చేసింది. 3.29 కోట్ల మంది జనాభాలోలో 2.89 కోట్ల మందికి పౌరసత్వం లభించింది. ఎన్ఆర్సీలో 40 లక్షల మందికి పౌరసత్వం దక్కలేదు. అంతకుముందు ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్ఆర్సీ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్ఆర్సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్ఆర్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు. 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తించారు. అస్సాం ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన జాబితాతో 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది. ప్రస్తుతం విడుదల చేసింది ప్రభుత్వం గుర్తించిన జాబితా అని, తుది జాబితా మాత్రం కాదని ప్రతీక్ హజేలా అన్నారు. అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందిన నార్త్ ఈస్ట్ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్ తెలిపారు. తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నేడు ఎన్ఆర్సీ తుది ముసాయిదా విడుదల
గువాహటి: అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) తుది ముసాయిదాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. ఈ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్ఆర్సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని ఎన్ఆర్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు. 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తామన్నారు. అస్సాం ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో.. మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చింది. -
ఆదివాసీలు ఈ దేశ పౌరులేనా?
ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు తలపెట్టినా అక్కడి ఆదివాసీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే చట్టాలన్నా, రాజ్యాంగ సూత్రాలన్నా రాజ్యానికి లెక్కే లేదు. దళితుల లాగే సమాజం ఆదివాసీలను కూడా పౌరులుగా గుర్తించడం లేదు. ఒకవేళ మన సమాజానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. వారి సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయకుండా, స్వేచ్ఛగా బతకనివ్వాలి. అంతే తప్ప అభివృద్ధి పేరుతో వారి జీవితాల్లో విధ్వంసం సృష్టించరాదు. ‘‘ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా అట్టడుగు ప్రజల అభివృద్ధికి భరోసా లభించడం సంతోషమే. హక్కులను చట్టాలలో పొందు పర్చితే సమస్య పరిష్కారం అవుతుందని మనం భావిస్తుంటాం. కానీ చట్టాలు మాత్రమే పరిష్కారం ఇవ్వలేవని గత అనుభవంలో తేలింది. సామాజిక, నైతిక మద్దతు లభించనిదే అవి అమలుకావు. అందుకే సమాజంలో వీటి పట్ల అంగీ కారం కుదరాలి. ఇది భారత దేశ ప్రత్యేకతగా చెప్పవచ్చు.’’ భారత రాజ్యాంగ రచనా కాలంలో బొంబాయిలోని సిద్ధార్థ కళాశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఉపన్యాసంలోని మాటలివి. ఆరు దశాబ్దాలు పైబడినా నాటి ఆయన అంచనాల్లో రవ్వంత మార్పు రాలేదు. పైగా ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలుకు నోచుకోవడం గగనమే అవుతుంది. అలా అని అన్ని చట్టాలు అమలు కాకుండా ఉండవు. ధనిక, భూస్వామ్య వర్గాల, ఆధిపత్య కులాల, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం జారీ అయ్యే జీవోలు శర వేగంగా అమలవుతాయి. కానీ దళిత, ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమం కోసం ఎప్పుడో అరకొరగా ఏవైనా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు వచ్చినా అవి ఎన్నడూ సరిగ్గా అమలు కావు. అందువల్లనే ఆదివాసీల అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది. ఎవరికీ పట్టని వారు ఎవరంటే.....? అలా సమాజానికి, పాలకులకు కూడా పట్టకుండా ఉండిపోయినవి ఆదివాసీల సమస్యలే. రాజ్యాంగాన్ని రచించే సమయంలో నాటి నేతలు ఆదివాసీల భవిష్యత్తుని, సమాజం నుంచి వారికి రాబోయే చేటుని గ్రహించి, శ్రద్ధగా ఎన్నో అంశాలను చర్చించారు. ఆదివాసీల రక్షణకు పలు చట్టాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజ్యాంగ సభ సమావేశాల చివరి రోజైన నవంబర్ 26, 1949న అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనాధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ల ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ల ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా, వాళ్ల ప్రత్యేక మండలుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి’’ అని తేల్చి చెప్పారు. సామాజిక నిపుణులు, కార్యకర్తలు నేటికీ అదే విషయాన్ని మాట్లాడాల్సి రావడం శోచనీయం. ఆదివా సుల సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై అధ్యయనం కోసం యూపీఏ-2 ప్రభుత్వం వర్జినయస్ కాకా నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఇటీవలే అది తన నివేదికను సమర్పించింది. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రణా ళికలను రచించే ముందు వాళ్ల ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలనేది కమిటీ సిఫారసులలో ప్రధానమైనది. నిజానికి ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయ గలిగిన విధానం ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి కూడా అనువుగా ఉం టుందని కమిటీ అభిప్రాయపడింది. అటవీ హక్కుల చట్టం-2006. షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయతీ విస్తరణ చట్టం, ఆదివాసీ సబ్ ప్లాన్లు ఆశించినంతగా అమలు జరగడంలేదని, ప్రభుత్వాలు వాటి అమలుకు శ్రద్ధ వహించాలని అది సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యం, బతుకుతెరువు లాంటి పలు ఇతర విష యాలపైన కూడా ఈ కమిటీ చాలా ప్రయోజనకరమైన సిఫారసులను చేసింది. ఇటువంటి కమిటీల నియామకం, అవి కొన్ని సిఫారసులతో నివేదికలు సమ ర్పించడం ప్రభుత్వాలకు కొత్తకాదు. భూరియా కమిషన్, ముంగేకర్ కమిషన్, ఇలా ఎన్నో వచ్చాయి, పోయాయి. కానీ ఆదివాసీల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగానే ఉంది. పిట్టల్లా రాలే ‘విలువ’లేని బతుకులు మొట్టమొదటగా ఆదివాసీల విద్య అనే అంశాన్నే తీసుకుందాం. ప్రభుత్వ లెక్క ల ప్రకారమే ఆదివాసీల బిడ్డల్లో 70 శాతం పదవ తరగతిలోపు బడి మానే స్తున్నారు. ఇక రెండో ముఖ్యమైన అంశం ప్రభుత్వ ఉద్యోగాలు. 2004 లెక్కల ప్రకారం ఏ గ్రేడ్ ఉద్యోగులలో 4.1 శాతం, బి గ్రేడ్‌లో 4.0 శాతం, సి గ్రేడ్‌లో 6.7 శాతం, డి గ్రేడ్‌లో 6.7 శాతం మాత్రమే ఆదివాసీలున్నారు. ఇక ఆదివాసుల అనారోగ్య సమస్యల పరిస్థితి చూస్తే సమాజమే సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా సగటున వెయ్యికి 18 మంది పిల్లలు మరణిస్తుంటే, ఆది వాసీలలో అది రెండింతలు ఎక్కువ, అంటే 36. ఇక పౌష్టికాహార లోపం గురించి మాట్లాడాల్సిన పనేలేదు. ఒకప్పడు గిరిజన ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, సహజసిద్ధంగా లభించే వందలాది తృణధాన్యాలు వారికి అందుబాటులో ఉం డేవి. సాధారణ పౌరులకంటే వైవిధ్య భరితమైన ఈ ఆహారం వారిని బలిష్టంగా ఉంచేది. కానీ ఇప్పుడు ఆ అడవులూ లేవు, ఆ పంటలూ లేవు. పౌష్టికాహారం అంతకన్నా లేదు. కొట్టొచ్చినట్లు కనిపించే పౌష్టికాహార లోపం ఫలితంగా రోగనిరోధక శక్తి క్షీణించి సాధారణ జ్వరాలకు సైతం వందలాదిగా ఆదివాసీలు మృతి చెందడం సర్వసాధారణమైంది. ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మరొక ప్రధాన సమస్య తాగునీరు. ప్రకృతిలో, నదీపరీవాహక ప్రాంతాల్లో సహజసిద్ధంగా, సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన నీటి వనరుల చెంతనే ఆదివాసీల జీవనం ఒకప్పుడు సాగేది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం వారిని అన్నిటితో పాటూ గుక్కెడు నీళ్లకి కూడా దూరం చేసింది. దాహంతో అల్లాడే దుస్థితికి చేర్చింది. నేడు ఆదివాసీ ప్రాంతాల్లో సురక్షితమైన మంచి నీరు లభించదు. నిలవ నీరు తాగి వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడితే సాధారణమైన మాత్రలు సైతం అందక ఆదివాసులు పిట్టల్లా రాలిపోవాల్సి వస్తోంది. ‘అభివృద్ధి’ బలిపీఠంపై ఆదివాసీ మనుగడ ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థ కంగా మారుతోంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్వయం పాలన మాట అటుంచి అభి వృద్ధి పేరుతో అదివాసీలను అడవుల నుంచి తరిమివేసే విధానాన్ని ప్రభు త్వాలు బహిరంగంగానే అనుసరిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని ఖనిజ నిక్షే పాలే వారి పాలిట శాపాలవుతున్నాయి. ఆదివాసీలను బలి పశువులను చేసి, అటవీ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ శక్తులు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఆదివాసుల సహజ హక్కయిన అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు అన్ని చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనైతే నక్సలైట్ల ఏరివేత సాకుతో, ‘గ్రీన్ హంట్’ పేరుతో వేలాదిగా ఆదివాసీలను వేటాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో వారు దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నారు. ఏ ప్రభు త్వాలూ వారి బాధ్యతను తీసుకోవడం లేదు. అలాగే నిస్సిగ్గుగా మైదాన ప్రాం తాల అభివృద్ధి కోసం భద్రాచలం ప్రాంత ఆదివాసులను పశువులకన్నా హీనంగా లెక్కగట్టి, వారి అభిప్రాయాలకు కనీస విలువనైనా ఇవ్వకుండా పోల వరం ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు తలపెట్టినా అక్కడి ఆదివాసీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకో వాలనే చట్టాలన్నా, రాజ్యాంగ సూత్రాలన్నా రాజ్యానికి లెక్కే లేదు. ఆదివాసీ హక్కుల పట్ల ఈ తృణీకార భావం ఈ నాటిదేమీ కాదు. భారతంలో పాండ వులు నూతన రాజధానిని నిర్మించుకోవడానికి ఖాండవ వన దహనం చేసి, నాగ జాతిని నాశనం చే శారని విన్నాం. నక్సలైట్ల ఏరివేత పేరుతో 20 సంవత్సరాల క్రితం చింతపల్లి అడవుల్లో పోలీసులు ఆదివాసీ గూడేలను తగులబెట్టారు. అయితే ఇక్కడ ఒక తాత్విక సమస్య ఉన్నది. గ్రామాల్లో అంటరానితనానికి బల వుతున్న దళితులు మనుషులు కాదు. అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధికి సమిధలుగా మారుతున్న ఆదివాసీలు కూడా పౌరులు కారు. అంటే ఈ సమాజం ఇటు దళితులనుగానీ, అటు ఆదివాసీలనుగానీ పౌరులుగా గుర్తించడం లేదని అర్థం. ఒకవేళ మన సమాజానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ముందుగా మనం మనసా, వాచా, కర్మణా వారిని సమాన స్థాయి పౌరులుగా గుర్తించాలి. అంటే వారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. వారి సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయకుండా, స్వేచ్ఛగా బతకనివ్వాలి. ప్రభు త్వం అందుకు అవసరమైన తోడ్పాటును అందించాలి. అంతే తప్ప అభివృద్ధి పేరుతో వారి జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. కార్పొ రేట్ ఆర్థిక వ్యవస్థకు కాపలాదార్లుగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభు త్వాలు ఈ సమస్యపై అంత తేలికగా స్పందించరు. మానవత్వం కలిగిన పౌర సమాజం ఆదివాసీల పక్షాన నిలబడాలి. వారి పోరాటాల్లో భాగం కావాలి. సామాజిక ప్రగతి ఫలాల్లో వారి వాటా వారికి అందేలా ఉద్యమించాలి. ఆ ఉద్యమాల్లో వారితో కలిసి అడుగు ముందుకు వేయాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మల్లెపల్లి లక్ష్మయ్య