National Commission for Minorities
-
‘అయోధ్య’పై మధ్యవర్తిగా ఉంటా: రిజ్వీ
న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీమసీదు–రామమందిరం వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు వీలుగా ఇరుపక్షాలతో చర్చలు జరుపుతానని మైనారిటీల జాతీయ కమిషన్(ఎన్సీఎం) చైర్మన్ ఘయోరుల్ హసన్ రిజ్వీ తెలిపారు. రామమందిరం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం అయినందున ముస్లింలు పెద్దమనసు చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ముస్లింలు అంగీకరిస్తే, కాశి, మధుర సహా మిగతా ప్రాంతాల్లోని మసీదుల విషయంలో హిందూసంస్థలు వెనక్కి తగ్గేలా కృషి చేస్తానన్నారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపరా?
న్యూఢిల్లీ: దుష్ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిని నిలువరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రముఖ న్యాయనిపుణుడు ఎస్ నారిమన్ ఆరోపించారు. మైనారిటీలపై కొందరు నాయకులు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలను కట్టడిచేసేందుకు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ విషయంలో జాతీయ మైనారిటీ కమిషన్(ఎన్సీఎం) తనంతట తానే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీఎంతో ఏడవ స్మారకోపన్యాసం చేస్తూ నారిమన్ ఈ మాటలన్నారు.