national crime beauro
-
'యువ సీఎం పాలనకు ఇంతకంటే ఏం కావాలి'
సాక్షి, అమరావతి: క్రైం రికార్డు బ్యూరో తాజాగా వెల్లడించిన రిపోర్టులో టీడీపీ హయాంలో కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 18శాతం నేరాలు తగ్గిన విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టిన వారంతా ఏమయ్యారో? బాబు హయాంలో కంటే 18% నేరాలు తగ్గినట్టు క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. కుల, మత ఘర్షణలు, రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి' అని విజయసాయి రెడ్డి ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. ('చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు') -
క్రైమ్ రిపోర్టు విడుదలలో జాప్యం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గతేడాది చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన వివరాల నివేదికను ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ నవంబర్ నెల ముగిసే నాటికి కూడా విడుదల చేయక పోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రతి నెలా జూలై నెల చివరలో నేరాల వివరాల నివేదికను విడుదల చేయడం బ్యూరో ఆనవాయితీ. జూలై నెల గడిచిపోయి నేటికి నాలుగు నెలలవుతున్న విడుదల చేయకపోవడం విచారకరం. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతందని ప్రశ్నించగా పాలనాపరమైన, విధానపరమైన ఇబ్బందులే కారణమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీజేపీ అధికారంకి వచ్చాక గతేడాది ఎక్కువగా జరిగిన గోరక్షక దాడులు, ప్రజలే జరిపిన దాడులకు నివేదిక జాప్యం జరగడానికి ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. దేశంలో గతేడాది గోరక్షణ పేరిట దేశంలో దళితులు, ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో తప్పనిసరిగా చేర్చాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌కు అయిష్టంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారులు అంగీకరించారు. అందుకనే ఇప్పటికీ నివేదిక విడదల కాలేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బ్యూరో అధికారులు తెలిపారు. ప్రభుత్వం సూచన మేరకు తాము గోరక్షక దాడులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించామని, అయితే ఈ రికార్డుల్లో భాగంగా దాన్ని పొందుపర్చడం లేదని, ప్రభుత్వం సలహా మేరకు ప్రత్యేక అనుబంధ నివేదిక కింద వాటిని విడుదల చేస్తున్నామని వారు చెప్పారు. 1953 నుంచి దేశంలో జరుగుతున్న నేరాలు-ఘోరాలకు సంబంధించిన వివరాలను నేషనల్ రికార్డ్స్ బ్యూరో నమోదు చేస్తూ ప్రతిఏటా విడుదల చేస్తూ వస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ వివరాలను పంపించేందుకు జనవరి నెల నుంచి జూన్ నెలవరకు దాదాపు ఐదు నెలల సమయం ఇస్తోంది. ఆ వివరాలను వివిధ విభాగాల కింద క్రోడీకరించి జూలై చివరి నాటికి నివేదిక రూపంలో బ్యూరో విడుదల చేస్తోంది. రెండు నెలల క్రితమే నివేదిక జాప్యం గురించి బ్యూరోను మీడియా ప్రశ్నించగా, బ్యూరో కార్యాలయాన్ని ఆర్కేపురం నుంచి మెహ్రాలికి మార్చడం వల్ల జాప్యం అవుతోందని చెప్పారు. మరి ఇంత లేటవడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా నోరు విప్పడానికి ఉన్నతాధికారులు ఇష్టపడడం లేదు. వాస్తవానికి బ్యూరో రెండు నెలల క్రితమే నివేదికను ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపించారని, ఇంకా అక్కడి నుంచి అనుమతి రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకునే నివేదికను విడుదల చేయడం లేదని ఆ వర్గాలు వివరించాయి. -
ప్రతి పది నిమిషాలకు ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది నిమిషాలకు ముగ్గురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఒక్క 2015 సంవత్సరంలోనే దేశంలో 1,48,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. 2011లో 1,36,000 మంది మరణించారు. 1015 నాటికి గడచిన నాలుగేళ్ల కాలంలో రోడ్డు ప్రమాద మతులు నాలుగు శాతం పెరిగింది. ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో రోడ్డు ప్రమాద మృతులు 83 శాతం మంది ఉంటున్నారు. రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న వారు 85 శాతంకాగా, కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఢీకొనడం వల్ల రెండు శాతం మరణిస్తున్నారు. 2015 సంవత్సరంలో 4,64,000 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 2014లో 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే ఒక్క సంవత్సరంలోనే మూడు శాతం పెరిగాయి. తమిళనాడులో 69,059, కర్ణాటకలో 44,011, మహారాష్ట్ర 42,250 రోడ్డు ప్రమాదాలు జరిగి మొదటి మూడు స్థానాలు ఆక్రమించగా, 18,403 మంది రోడ్డు ప్రమాద మృతులతోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముందున్నది. జాతీయ స్థూల ఉత్పత్తికి జాతీయ రోడ్డు రవాణా రంగం నుంచి 4.8 శాతం సమకూరుతుండగా, రోడ్డు ప్రమాదాల కారణంగా అందులో 1 నుంచి 3 శాతం వరకు నష్టం వస్తోందని 11వ ప్రణాళికా కమిషన్ 2007లో విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. 2015లో సంభవించిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలతో జరిగినవే. ఈ ప్రమాదాల్లో 45,540 మంది మరణించారు. ట్రక్కుల వల్ల 19 శాతం ప్రమాదాలు సంభవించగా, 28,910 మంది మరణించారు. 12 శాతం కారు ప్రమాదాల్లో 18,506 మంది మరణించారు. తమిళనాడు, మహారాష్ట్రలో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించగా, ఉత్తరప్రదేశ్‌లో ట్రక్కు, కారు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించారు. దేశంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారులు 1.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 28 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైనే జరిగాయి. దేశవ్యాప్తంగా వేగ పరిమితులు విధించినా, సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసినా, మద్యం సేవించి వాహనాలను నడపడాన్ని కఠినంగా నియంత్రిస్తున్నా దేశంలో నానాటికి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.