‘వారికి స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి’
రాజమండ్రి: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరారు. బుధవారం రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరిగిన జాతీయ దళిత సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం సదస్సులో వివిధ అంశాలపై 12 తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ఆచార్య ముత్యాలనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య నర్సింహారావు పాల్గొన్నారు.
SC, ST Rape Prevention Act, karem Shivaji, National Dalit Conference, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, కారెం శివాజీ, జాతీయ దళిత సదస్సు