National Disaster Management Agency
-
గుడ్‌న్యూస్.. రాత్రి వరకు సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకి!
ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం నుంచి బాధిత కార్మికులను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న నలబై ఒక్క మంది కార్మికులను బయటకు తీసే పనులు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలోని కార్మికులను వెలికి తీసేందుకు సహాయ బృందాలు కేవలం 12 మీటర్ల దూరంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. నేటి రాత్రి 11. 30 గంటలలోపు మిగిలిన డ్రిల్లింగ్ పూర్తి చేసి కూలీలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పనులన్నీ ఆశావహంగా సాగుతున్నాయని చెబుతున్నాయని, అమెరికాకు చెందిన డ్రిల్లింగ్ మిషన్ మరో ఆరు మీటర్ల శిథిలాలను తొలగించినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక అధికారి భాస్కర్ ఖుల్బే పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మేము మరో ఆరు మీటర్లు ముందుకు వెళ్లగలిగామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మరో రెండు గంటల్లో తదుపరి దశకు సద్ధమవుతున్నాం. అతి తక్కువ సమయంలోనే మిగిలిన పనిని పూర్తి చేయగలమని భావిస్తున్నాం’ అని మీడియాతో చెప్పారు. ఇప్పటి వరకు 67శాతం డ్రిల్లింగ్ పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది కార్మికుల కోసం పడకలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే టన్నెల్ బయట 20 అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కాసేపట్లో ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉంది. చదవండి: Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే! #WATCH | NDRF personnel enter Silkyara tunnel as operation to rescue 41 trapped workers intensifies, in Uttarakhand pic.twitter.com/f9LCO5PBun — ANI (@ANI) November 22, 2023 సహాయక చర్యలు కీలక దశకు చేరుకోవడంతో తమ రాష్ట్రానికి చెందిన 15 మంది కార్మికులను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే.. వారిని విమానంలో తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. డెహ్రాడూన్ నుంచి రాంచీకి విమానంలో తరలించనున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ప్రమాదం జరిగి పది రోజులు కావొస్తుంది. చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఫోన్లు కూడా పంపించి వారితో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌తో సహా ఐదు ప్రభుత్వ ఏజెన్సీలు ఈ భారీ ప్రయత్నానికి పూనుకున్నాయి. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | A machine that was stuck yesterday due to the road being narrow, has now reached the Silkyara tunnel site where rescue operations to bring out the trapped workers are underway. pic.twitter.com/KbN6OvYdFC — ANI (@ANI) November 22, 2023 -
టీవీ, రేడియోల్లోనూ వాతావరణ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ హెచ్చరికలను ఇకపై టీవీలు, రేడియోల్లోనూ ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, తుపాన్లు, వడగాలుల గురించి మొబైల్ ఫోన్లకు మెసేజీలు పంపే ప్రక్రియను ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రారంభించింది. రెండో దశలో టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా కూడా హెచ్చరికల మెసేజీలను పంపే ప్రక్రియ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఎన్డీఎంఏ అధికారి ఒకరు చెప్పారు. -
31 దాకా లాక్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్ఈసీ) చైర్మన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం రాత్రి నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు జారీచేశారు. విమానాలు, మెట్రో రైళ్ల రాకపోకలపై ఉన్న నిషే«ధాన్ని యథాతథంగా కొనసాగించారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని స్పష్టం చేశారు. నిర్ధిష్టంగా నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు. (ఒక్కరోజులోనే 4,987) చిక్కుకుపోయిన వారంతా తరలింపు దేశంలో చిక్కు కుపోయిన విదేశీ యులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన శ్రామికులు, భారతీయ సీఫేరర్స్, వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అను మతి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయు లు, భారతీయ విద్యార్థుల తరలింపునకు అనుమతి. ప్రత్యేక రైళ్ల ద్వారా వ్యక్తుల ప్రయా ణం వంటి అంశాల్లో ఇదివరకే జారీచేసిన ప్రామాణిక నియమావళి వర్తిస్తుంది. కొవిడ్– 19 మేనేజ్మెంట్కు సంబంధించి జాతీయ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. కట్టడి, బఫర్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ► కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. ► రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కట్టడి జోన్లు, బఫర్ జోన్లను జిల్లా యంత్రాంగాలు నిర్ధేశిస్తాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని గుర్తిస్తాయి. ► కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలనే అనుమతిస్తారు. ఆయా జోన్లలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు తప్ప వ్యక్తులు ఈ జోన్లలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► కట్టడి జోన్లలో పటిష్టమైన కాంటాక్ట్ ట్రేసిం గ్, ఇంటింటిపై నిఘా, అవసరమైనప్పుడు వైద్య సేవలు అందించడం వంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. రాత్రి పూట కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది. సీఆర్పీసీ సెక్షన్ 144 కింద స్థానిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. కట్టడి జోన్లలో అత్యవసరానికే అనుమతి నిర్ధిష్టంగా నిషేధించిన వాటికి మినహా ఇతర అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అయితే, కట్టడి జోన్లలో మాత్రం ఐదో నిబంధనలో పేర్కొన్నట్టుగా అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిస్థితిని అంచనా వేసి, విభిన్న జోన్లలో కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. అవసరమైన మేరకు ఆంక్షలు విధించవచ్చు. హాని పొంచి ఉన్న వారికి రక్షణ 65 ఏళ్ల వయస్సు పైబడి ఉన్నవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరాలు, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది. ‘ఆరోగ్యసేతు’ వినియోగం ► పని ప్రదేశాలు, ఆఫీసుల్లో రక్షణ కోసం యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలి. ► వ్యక్తులు ఆరోగ్యసేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని తరచుగా తమ ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు, వస్తు రవాణాకు ప్రత్యేకం ► రాష్ట్రంలో, అంతర్రాష్ట్ర పరిధిలో వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అంబు లెన్స్‌ల రాకపోకలపై ఆంక్షలు కూడదు. ► ఖాళీ ట్రక్కులు సహా అన్ని రకాల వస్తు, కార్గో రవాణా వాహనాల అంత ర్రాష్ట్ర రాక పోకలపై ఆంక్షలు ఉండరాదు. ► ఏ రాష్ట్రమైనా అంతర్జాతీయ భూ సరిహద్దు వద్ద వస్తు రవాణాను అడ్డుకోరాదు. కచ్చితంగా అమలు చేయాల్సిందే ► జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీచేసిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు ఏ విధంగానూ బలహీన పర్చరాదు. ► అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. వీటిని అమలు చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్ కమాండర్లుగా పంపాలి. వారి పరిధిలో నిబంధనల అమలుకు ఇన్సిడెంట్ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు. ► జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పరిధిలోని సెక్షన్ 51 నుంచి సెక్షన్ 60 మధ్య ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 180 పరిధిలో శిక్షార్హులు. -
వలస కూలీల కోసం ఆన్లైన్ డాష్‌బోర్డు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వలస కూలీలకు రవాణా వసతి కల్పించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయానికి వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఆన్లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేసింది. నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎన్ఎంఐఎస్) పేరుతో ఎన్డీఎంఏ–జీఐఎస్ పోర్టల్‌లో ఈ ఆన్లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. వలస కూలీలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలు, జిల్లాల మధ్య ఇచ్చిపుచ్చుకుంటూ వారికి అవసరమైన రవాణా వసతి కల్పించడంలో సమన్వయం చేసుకునేందుకు గాను ఆన్లైన్ డేటా క్రోడీకరణకు ఈ డాష్‌బోర్డు వీలు కల్పిస్తుంది. ఆన్లైన్లోనే రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునే వీలుంది. అలాగే వలస కూలీల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. ఈనేపథ్యంలో ఈ డాష్‌బోర్డు కోసం వలస కూలీల వివరాలను నమోదు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రాలు ఇప్పటికే వలస కూలీల సమాచారాన్ని సేకరించినందున, బ్యాచుల వారీగా కూలీల వ్యక్తిగత వివరాలను ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఆయా కూలీల పేర్లు, వయస్సు, మొబైల్ నెంబర్, ప్రస్తుతం ఉన్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న తేదీ తదితర వివరాలను రాష్ట్రాలు ఇప్పటికే సేకరిస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రాలు ఆయా శ్రామికుల వివరాలపై అంచనాకు వచ్చే వీలుంది. ఎంత మంది వెళుతున్నారు? ఎంత మంది వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారన్న వివరాలు అందుబాటులోకి వస్తాయి. వారికి అవసరమైన ప్రయాణ సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది. కోవిడ్–19 నేపథ్యంలో వారి కదలికలపై పర్యవేక్షణకు వీలుంటుంది. ప్రతి వలస కూలీకి సంబంధించి ఒక గుర్తింపు నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఆధారంగానే భవిష్యత్తు లావాదేవీలు జరుపుతారు. వలస కూలీల కదలికలపై ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పర్యవేక్షణకు వీలు కలుగుతుంది. -
విద్యార్థులతోనే ‘సురక్షిత భారత్’
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల దశ నుంచి భద్రత విషయంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం వల్ల ‘సురక్షిత భారతదేశం’సాధ్యమవుతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఏర్పాటై 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్డీఎంఏ వార్షిక థీంగా ‘పాఠశాలల భద్రత’ను ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. దీని ద్వారా స్కూల్ దశ నుంచి విద్యార్థులను భద్రత విషయంలో భాగస్వామ్యం చేయవచ్చన్నారు. విద్యార్థుల ఉత్సాహం, వారి సృజనాత్మకత విపత్తుల నివారణలో మెరుగ్గా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో రంగారెడ్డి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ రెడ్డి, వనపర్తి డీఈవో సుశీందర్‌రావు పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలల భద్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు అనుసరిం చాల్సిన ప్రణాళికలను సదస్సులో వివరించినట్లు వారు తెలిపారు. -
ఎన్డీఎంఏకు శశిధర్‌రెడ్డి రాజీనామా
-
ఎన్డీఎంఏకు శశిధర్‌రెడ్డి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కొందరు గవర్నర్ల తర్వాత ఇప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు ఎం.శశిధర్‌రెడ్డి వంతు. పదవుల నుంచి తప్పుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆయనతో పాటు సంస్థకు చెందిన ఐదుగురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. జాతీయ మహిళా కమిషన్, ఎస్టీ, ఎస్సీ కమిషన్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్)ల అధిపతులు, సభ్యులను సైతం రాజీనామా చేయూల్సిందిగా కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. శశిధర్‌రెడ్డితో పాటు ఎన్డీఎంఏ సభ్యులుగా వ్యవహరిస్తున్న సీఐఎస్ఎఫ్ మాజీ డెరైక్టర్ జనరల్ కె.ఎం.సింగ్, పౌర విమానయూన శాఖ మాజీ కార్యదర్శి కె.ఎన్.శ్రీవాస్తవ, మేజర్ జనరల్ (రిటైర్డ్) జె.కె.బన్సల్, బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్) మాజీ డెరైక్టర్ బి.భట్టాచార్జీ, సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ కె.సలీం అలీ రాజీనామాలు చేశారు. ‘ప్రధాని ఎన్డీఎంఏని పునర్వ్యవస్థీకరించేందుకు వీలుగా మంగళవారమే రాజీనామా లేఖను పంపా. అది ఆయన పరిశీలనలో ఉండి ఉంటుంది. రాజీనామా చేయాలని నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఎవరి ఒత్తిడీ లేదు. స్వచ్ఛందంగానే రాజీనామా చేశా. సంస్థ పునర్నిర్మాణ కార్యక్రమం త్వరలోనే పూర్తవుతుందని భావిస్తున్నా..’ అని శశిధర్‌రెడ్డి గురువారం నాడిక్కడ సంస్థ కార్యాలయంలో మీడియూకు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగే వరకు బాధ్యతల్లో కొనసాగుతానన్నారు. 2005లో ఎన్డీఎంఏ సభ్యుడిగా నియమితులైన శశిధర్‌రెడ్డి, 2010 డిసెంబర్లో సంస్థ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు.