రామగుండం యూరియా ప్లాంటు పునరుద్ధరణపై దృష్టి
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని రామగుండంలో మూతపడిన యూరియా ప్లాంటు పునరుద్ధరణకుగాను కన్సార్షియం ఏర్పాటుకు నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), ఇంజనీర్స్ ఇండియా, ఫెర్టిలైజర్ కార్పొరేషన్(ఎఫ్సీఐఎల్) చర్చిస్తున్నాయి. పునరుద్ధరణకు రూ.4,700 కోట్లు వెచ్చించే అవకాశం ఉందని ఎన్ఎఫ్ఎల్ అధికారులు అంటున్నారు. ప్రతిపాదిత స్పెషల్ పర్పస్ వెహికిల్లో ఎన్ఎఫ్ఎల్, ఇంజనీర్స్ ఇండియాలకు చెరి 26%, ఎఫ్సీఐఎల్కు 11% వాటా ఉండే అవకాశం ఉంది. వ్యూహాత్మక భాగస్వామికి మిగిలిన వాటా ఇస్తారు. రామగుండంతో సహా ఎఫ్సీఐఎల్కు చెందిన 5 ప్లాంట్లు 2002 నుంచి మూతపడ్డాయి.