National Geographic Channel
-
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్‌డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
ప్రతి మహిళా ఒక సోల్జర్
నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్లు ఢిల్లీలో నిన్న ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ఆ షో కి ఎన్.సి.సి. గర్ల్ కెడేట్స్, ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు. చీఫ్ గెస్ట్ లెఫ్టినెంట్ జనరల్ మాధురీ కణిట్కర్! షో అయ్యాక ‘‘హౌ ఈజ్ ది జోష్’’ అని అమ్మాయిల్ని అడిగారు. ‘‘ఓ..’’ అని నోటికి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి ఉత్సాహంగా అరిచారు అమ్మాయిలు. ‘‘మనలో ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. మల్టీ టాస్కింగ్ చేయగలం. ఆర్మీ మిమ్మల్ని ఉమన్‌గా కాదు, ఒక సోల్జర్ గా గుర్తిస్తుంది. అదే మనకు కావలసిన గుర్తింపు’’ అంటూ.. వాళ్ల జోష్ ను మరింతగా పెంచారు కణిట్కర్. మాధురీ కణిట్కర్ ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ జనరల్. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఎన్.సి.సి. ఆడిటోరియంలో శుక్రవారంనాడు ఎన్.సి.సి. గర్ల్ కెడెట్లు, ఎన్.సి.సి. ఉమెన్ ఆఫీసర్స్ హాజరైన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఆ ప్రత్యేక కార్యక్రమం ఓ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వాళ్లు ఆర్మీలో చేరాలని అనుకుంటున్న అమ్మాయిల కోసం ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ అనే ఆ చిత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మహిళాశక్తికి ఒక పవర్ ప్రెజెంటేషన్‌లా ఉంది. గర్ల్ కెడెట్స్ లీనమైపోయి చూస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్మీలో చేరిపోయి తమ సత్తా ఏంటో చూపించాలన్నంతగా వారిని ఆ చిత్రం బందీని చేసింది. మాధురీ కణిట్కర్ కూడా వాళ్లతో కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు. చిత్రం పూర్తవగానే గర్ల్ కెడెట్స్ అరుపులు, చప్పట్లు! ‘ఉమెన్ ఆఫ్ ఆనర్ : డెస్టినేషన్ ఆర్మీ’ స్క్రీనింగ్ కార్యక్రమంలో మాధురీ కణిట్కర్ అప్పుడు అడిగారు మాధరి.. ‘హవ్వీజ్ ద జోష్?’ అని! ‘సూపర్బ్‌గా ఉంది మేడమ్’ అన్నారు అమ్మాయిలు. ‘‘కానీ ఆర్మీలో ఉద్యోగం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు’’ అన్నారు మాధురి. ఆ మాటకు కొంచెం నిరుత్సాహం. ‘‘అయితే ఆర్మీ మిమ్మల్ని ఒక శక్తిగా మలుస్తుంది’’ అని కూడా అన్నారు మాధురి. నిరుత్సాహం స్థానంలో మళ్లీ ఉత్సాహం! అప్పుడిక ఆమె భారత సైన్యంలో తన ప్రయాణం ఎలా ఆరంభమైందీ చెప్పడం మొదలు పెట్టారు. మాధురి ఆర్మీలోకి వచ్చేటప్పటికి మహిళా అధికారులు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలో కనిపించారు! క్రమంగా యూనిఫామ్‌లోకి మారిపోయారు. 37 ఏళ్లుగా ఆర్మీలో ఉన్నారు మాధురి. ఆర్మీలోని మెడికల్ విభాగంలో ఆఫీసర్ తను. లెఫ్ట్‌నెంట్‌గా చేరి లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్నారు. ఆర్మీలో పైనుంచి మూడో ర్యాంకే లెఫ్టినెంట్ జనరల్. (మొదటి ర్యాంక్ ఫీల్డ్ మార్షరల్. రెండో ర్యాక్ జనరల్). ఆర్మీలో తన వైద్య సేవలకు అతి విశిష్ట సేవామెడల్, విశిష్ట సేవామెడల్ కూడా పొందారు. ∙∙ నేషనల్ జియోగ్రాఫిక్ షోకి ఆమె ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు మాధురీ కణిట్కర్. ‘‘ఆర్మీలో చేరాక మీరు స్త్రీనో, పురుషుడో కాదు. ఒక సోల్జర్ మాత్రమే. స్త్రీ అనే గుర్తింపు కన్నా, సోల్జర్ అనే గుర్తింపే మనకు ముఖ్యం. ఆర్మీలో చేరక ముందు కూడా మనం సోల్జరే. స్త్రీలో సహజంగానే సైనిక శక్తి ఉంటుంది కనుక’’ అని మాధురి చెప్పడం కెడెట్ గర్ల్స్‌కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్.సి.సి.లో కొత్తగా జాయిన్ అయినవాళ్లే వాళ్లంతా. ‘‘సోల్జర్‌కి జెండర్ ఉండదు. అది మన మైండ్‌లో ఉంటుంది. మహిళల జెండర్ వారిలో పవర్ మాత్రమే’’ అని మాధురి చెప్పడం కూడా ఆ పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఒక ఆర్మీ పర్సన్ మాటలు ఎంతలా పని చేస్తాయంటే.. అది ఆర్మీ గొప్పతనమే అనాలి. ఆర్మీలో చేరిన ప్రతి వ్యక్తినీ అలా తీర్చిదిద్దుతుంది ఆర్మీ. సమాజంలో స్ఫూర్తిని నింపేలా. ‘‘అమ్మాయిలూ మీకొక మాట చెప్తాను వినండి. మనకు అదనంగా ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ ఉంది. అది మన చేత మల్టీ టాస్కింగ్ చేయిస్తుంది. లక్ష్యం కోసం పరుగులు తీయిస్తుంది. కలల్ని నిజం చేసుకుని శక్తిని ఇస్తుంది. ఏ ఉద్యోగంలోనైనా మనకు ఛాలెంజింగ్ ఏమిటంటే.. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. అది సాధ్యమైతే మనకు ఏదైనా సాధ్యమే. ఉద్యోగానికి ఇల్లు, ఇంటికి ఉద్యోగం అడ్డుపడవు. నన్నే చూడండి. నా భర్త కూడా ఆర్మీలోనే చేసేవారు. ఇద్దరం ఆర్మీలోనే ఉన్నా 24 ఏళ్ల పాటు ఒకేచోట లేము. కానీ ఆర్మీ మాకు సపోర్ట్‌గా ఉంది. ఇద్దరం ఒకచోట లేకున్నా ఇద్దరం ఆర్మీలోనే ఉన్నామన్న భావనను ఆర్మీనే మాకు కలిగించింది. మహిళలకు సురక్షితమైన ఉద్యోగరంగం ఆర్మీ అని చెప్పగలను’’ అని మాధురి తన అనుభవాలు కొన్ని చెప్పారు. ‘‘ఉమన్‌లో ఆర్మీ పవర్ ఉంది. ఆర్మీకి ఉమన్ పవర్ అవసరం ఉంది’’ అని చివర్లో మాధురీ కణిట్కర్ అన్నమాట.. అమ్మాయిలకు డాక్యుమెంటరీ ఎంత జోష్ని ఇచ్చిందో అంతే జోష్‌ను ఇచ్చి ఉండాలి. వారంతా నోటికి రెండు చేతులూ అడ్టుపెట్టుకుని కోరస్‌గా మళ్లొకసారి ‘ఓ’ అని ఉల్లాసంగా చప్పట్లు చరిచారు. -
నింగినే మింగేలా..
ఈ నల్లని పొగ నింగినే మింగేస్తోందేమో అనిపిస్తోంది కదూ.. కాలుష్య తీవ్రతకు అద్దం పట్టేలా ఉన్న ఈ చిత్రాన్ని సింగపూర్‌లో తీశారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలపై చిత్రాలను తీసి పంపమని నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కోరినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రాఫర్లు స్పందించారు. అలా వచ్చిన చిత్రమే ఇదీ.. దీన్ని టెరెన్స్ చ్యూ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. -
పుష్కర తొక్కిసలాట దృశ్యాలు మాయం
రాజమహేంద్రవరం క్రైం: గతేడాది జరిగిన పుష్కర తొక్కిసలాటపై మరిన్ని కీలక ఆధారాలు ఈనెల 9వ తేదీలోపు కమిషన్‌కు సమర్పించాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ సోమయూజులు ఆదేశించారు. పుష్కర తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజులు కమిషన్ శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మూడోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నేషనల్ జియోగ్రఫిక్ చానల్ తీసినట్లు చెబుతున్న వీడియోను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జస్టిస్ సోమయాజులు తిలకించారు. విజువల్స్‌లో.. ఘాట్‌లో ముఖ్యమంత్రి, ఇతర భక్తులు స్నానాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నారుు. తొక్కిసలాట జరిగిన ఘటనగానీ, మృతి చెందిన 29 మంది దృశ్యాలుగానీ లేకుండా వీడియోను ఎడిట్ చేసి చూపించారు. దీంతో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు జోక్యం చేసుకొని తొక్కిసలాటపై మరికొన్ని ఆధారాలు సమర్పించాలని కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేశారు.