పుష్కర తొక్కిసలాట దృశ్యాలు మాయం
రాజమహేంద్రవరం క్రైం: గతేడాది జరిగిన పుష్కర తొక్కిసలాటపై మరిన్ని కీలక ఆధారాలు ఈనెల 9వ తేదీలోపు కమిషన్‌కు సమర్పించాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ సోమయూజులు ఆదేశించారు. పుష్కర తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సోమయాజులు కమిషన్ శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మూడోసారి విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా నేషనల్ జియోగ్రఫిక్ చానల్ తీసినట్లు చెబుతున్న వీడియోను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జస్టిస్ సోమయాజులు తిలకించారు. విజువల్స్‌లో.. ఘాట్‌లో ముఖ్యమంత్రి, ఇతర భక్తులు స్నానాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నారుు. తొక్కిసలాట జరిగిన ఘటనగానీ, మృతి చెందిన 29 మంది దృశ్యాలుగానీ లేకుండా వీడియోను ఎడిట్ చేసి చూపించారు. దీంతో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు జోక్యం చేసుకొని తొక్కిసలాటపై మరికొన్ని ఆధారాలు సమర్పించాలని కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేశారు.