National Geographic Magazine
-
భారత్‌కు రానున్న అఫ్గాన్ మహిళ
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ మహిళ షర్బత్గులా(40) త్వరలో భారత్‌కు చికిత్స కోసం రానున్నారు. ఆకుపచ్చ రంగు కళ్లతో కోపంగా చూస్తున్న ఆమె చిత్రాన్ని 1984లో నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగ్జైన్ కవర్‌పేజీగా ప్రచురించింది. ఈ చిత్రంతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆమె భారత్‌కు వస్తున్న విషయాన్ని అఫ్గాన్‌లో భారత రాయబారి షౌదా అబ్దాలీ ఆదివారం తెలిపారు. హెపటైటిస్-సితో బాధపడుతున్న ఆమెకు బెంగుళూరు ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వలసవెళ్లిన గులాను ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసి అఫ్గాన్‌కు పంపడం తెలిసిందే. ఈమెకు ముగ్గురు పిల్లలు. -
బిహైండ్ ది లెన్స్...
లెన్స్ వెనకాల ఏముంటుంది? సృజనాత్మకమైన ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు సామాజిక అవగాహన తోడైతే చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. మనకు పరిచయం లేని కొత్త ప్రపంచం లోతుగా పరిచయం అవుతుంది. విశ్లేషణకు దారి పరుస్తుంది. గత నూట ఇరవై అయిదు సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని భిన్నమైన కోణాలలో ఛాయచిత్రాల రూపంలో డాక్యుమెంట్ చేస్తోంది నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగ జీన్. వాటిలో భౌగోళిక రూపం మాత్రమే కాదు సామాజిక ఘటనలు, స్థితిగతులకు సంబంధించిన ఆత్మ కనిపిస్తుంది. ఇటీవల ఈ మ్యాగజీన్ నిర్వహించిన పోటీలో అవార్డ్డు గెలుచుకున్న ఫిమేల్ ఫొటో జర్నలిస్టుల ఫొటోల ప్రదర్శన వాషింగ్టన్‌లోని ‘ది నేషనల్ జియోగ్రఫిక్ మ్యూజియం’లో మొదలైంది. ఈ ఎగ్జిబిషన్‌లోని ఫొటోలలో పదకొండుమంది మహిళా ఫొటో జర్నలిస్టుల ప్రతిభాపాటవాలు ప్రతిఫలించాయి. వందకు పైగా ఉన్న ఫొటోలలో భిన్న ప్రాంతాలకు చెందిన సంస్కృతులు, భౌగోళిక స్థితిగతులు, సామాజిక ఘటనలు కళ్లకు కట్టాయి. ఎగ్జిబిషన్లో కొన్ని శక్తిమంతమైన ఫొటోలతో పాటు ప్రభావశీలమైనవి కూడా ఉన్నాయి. కొత్త తరానికి చెందిన సమస్త ధోరణులు వాటిలో కనిపిస్తాయి. బాల్యవివాహాలు, ఆధునిక కాల బానిసత్యం... ఇలా రకరకాల సామాజిక సమస్యలను ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఒక్కో ఫొటో ఒక్కో కథను చెబుతుంది. వాటిలో ఆధునిక కాలానికి చెందిన వాస్తవాలు కనబడతాయి. -
సెన్స్ ఆఫ్ ప్లేస్!
ఊరో, పల్లెటూరో, నగరమో, మహా నగరమో, అరణ్యమో, నది పరీవాహకమో...ఏదైతేనేం....ప్రతి ప్రదేశానికి తనదైన ‘సారం’ ఉంటుంది. ఆ సారాన్ని వెలికితీయడం అనేది మన కళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కళ్లకు ‘లెన్స్’ తోడైతే ఆ అనుభవం, ఆనందమే వేరు! నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజైన్ ‘లెన్స్’కు పని చెబుతుంది. సారాన్ని ఆవిష్కరించమని చెబుతుంది. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్’ ఫొటో కాంటెస్ట్ నిర్వహిస్తుంది. చేయితిరిగిన ఫొటోగ్రాఫర్లతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఫొటోలలో ప్రపంచ భౌగోళిక అందం కళ్లకు కడుతుంది. 2013 ఫొటోకాంటెస్ట్లో ప్రపంచవ్యాప్తంగా 15, 500 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ‘‘విజేతలను ఎంపిక చేయడం ప్రతి సంవత్సరం కష్టమైన పనే’’ అంటాడు ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కెయిత్ బెలో. ఆయన అన్న మాట అక్షరాల నిజమే మరి. ‘ఎంపిక’ కోసం ‘ఎంపిక’ చేయాల్సిందేగానీ ఏ ఫొటో కూడా తక్కువ తినలేదు. భౌగోళిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో దేని ప్రత్యేకత దానిదే. ‘‘ఫొటోల నాణ్యత, కొత్తదనం గతంతో పోలిస్తే బాగుంటుంది. ఒకేసారి ఇన్ని అద్భుతమైన ఫొటోలను చూడడానికి రెండు కళ్లు చాలవేమో’’ అంటాడు సంతోషంగా బెలో. పోటీని నాలుగు విభాగాలుగా విభజించారు. ఒకటి: ట్రావెల్ పోట్రాయిట్స్, రెండు: ఔట్‌డోర్ సీన్స్, మూడు: సెన్స్ ఆఫ్ ప్లేస్, నాలుగు: స్పాంటేనియస్ మూమెంట్స్. వేలాది ఫొటోల్లో నుంచి న్యాయనిర్ణేతలు ఏడు ఫొటోలను ఎంపిక చేసి చివరికి అందులో నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. మరో ఫొటోను పాఠకులు ఎంచకుంటారు. మీరు చూస్తున్న ఫొటోలు న్యాయనిర్ణేతలు, పాఠకులు మెచ్చినవి.