National Mahasabha
-
సీపీఎం మహాసభల్లో కీలక తీర్మానాలు
సాక్షి, హైదారాబాద్: జాతీయ మహాసభల్లో భాగంగా పలు కీలక తీర్మానాలపై చర్చించినట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్ తెలిపారు. రాజకీయ తీర్మానంపై గురువారం చర్చ ముగిసిందని, తీర్మానంపై 47 మంది ప్రతినిదులు ప్రసంగించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని కారత్ తెలిపారు. 286 ప్రతిపాదనల్లో చర్చలో వచ్చిన సూచనలతో కొన్ని మార్పులు చేసి రాజకీయ తీర్మానం సిద్ధంచేశామని, ఇవాళ పూర్తి స్థాయి రాజకీయ తీర్మానం ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ రాజకీయ నిర్మాణం పై తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తామన్నారు. చర్చలో భాగంగా 15వ ఆర్థిక సంఘం సూచనలు, దక్షణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై చర్చించామని తెలిపారు. 1971 జనాభా ప్రాతిపదికన కాకుండా 2011 లెక్కల ప్రకారం నిదుల కేటాయింపు సరికాదని, అలా అయితే జనాభా నియంత్రణ సక్రమంగా జరిపిన రాష్ట్రాలు నష్టపోతాయని తీర్మానంలో చర్చించినట్లు కారత్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సంక్షేమ పథకాలు కుదించటం సరికాదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రతపై మరో తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రైవేట్ సెక్టార్లో కార్మికులు, ఉద్యోగుల చట్టాల అమలుపై కార్మిక సంఘాల సూచనలను పరిశీలించారు. సభలో ప్రవేశపెట్టిన రెండు ముసాయిదాలపై వచ్చిన సవరణలకు సమాధానం ఉంటుందని, ముసాయిదాలపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఓటింగ్ నిర్వహిస్తామని కారత్ తెలిపారు. ఓటింగ్‌కు ఏ సభ్యుడైనా డిమాండ్ చేయవచ్చునని, పార్టీలో రహాస్య ఓటింగ్ విధానం లేనందున ప్రతినిదులు రహస్య ఓటింగ్ కోరితే ఆలోచిస్తామని తెలిపారు. ఓటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులందరూ పాటించాలని, అప్పుడు మెజారిటీ, మెనారిటీ అన్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. పార్టీ సెంట్రల్ కమిటీ కంటే పార్టీ కాంగ్రెస్ ఉన్నతమైనదని, కీలక అంశాలపై ఇక్కడ స్పష్టమైన ముగింపు ఉంటుందని ప్రకాష్ కారత్ స్పష్టంచేశారు. -
అంబేద్కర్ అందరివాడు
►వీసీ డాక్టర్ తులసీరాందాస్ ►జేఎన్టీయూకేలో జాతీయ మహాసభ మెయిన్‌రోడ్(కాకినాడ): కులరహిత సమాజానికి పాటుపడి అందరివాడుగా భారత రాజ్యాంగపిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎనలేని కీర్తిని సంపాదించారని జేఎన్టీయూకే ఉపకులపతి డాక్టర్ తులసీరాందాస్ పేర్కొన్నారు. వర్సిటీ క్రీడాప్రాంగణంలో జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఆదివారం ‘అంబేద్కర్ అందరివాడు’ జాతీయ మహాసభ నిర్వహించారు. మాల, మాదిగ ఉపకులాల గిరిజన అభివృద్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు బొర్రా విజయ్‌కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథి వీసీ తులసీరామ్‌దాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి, వర్థంతి సందర్భాల్లో కాకుండా సాధారణమైన రోజుల్లో ఇటువంటి సభ నిర్వహించడం ముదావహమన్నారు. ఎటువంటి సౌకర్యాలు, రిజర్వేషన్లు లేని కాలంలో అంబేద్కర్ అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. తాను పడిన అవమానాలు బడుగు వర్గాలవారు పడకూడదని రిజర్వేషన్ల ద్వారా సమానత్వం కల్పించారన్నారు. పవన్‌కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రూపాయి విలువ తెలిిపిన ఆర్థికవేత్తని పేర్కొన్నారు. ఆహార భద్రత, ప్రాథమిక విద్య హక్కుపై రాజ్యాంగంలో విలువైన సమాచారం పొందుపరచారన్నారు. గౌరవ అతిథులుగా రెక్టార్ ప్రొఫెసర్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, డీఏపీ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్, డై త్రీ పీఅండ్‌టీ డాక్టర్ జేవీఆర్ మూర్తి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.పద్మరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుబ్బారావు, ఎస్సీ,ఎస్టీ జేఎన్టీయూకే కో-ఆర్డినేటర్ డాక్టర్ వి.శ్రీనివాసులు, మదర్ ఇండియా సంస్థ చైర్మన్ పిల్లి తిరుపతిరావు, అడిషనల్ డీఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్ తదితరులు వేదికను అలంకరించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జి.శ్యామ్‌కుమార్ పర్యవేక్షించారు.