National Payments Corporation
-
యూపీఐ లావాదేవీల్లో ఎస్బీఐ, పేటీఎం, ఫోన్‌పే టాప్
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక లావాదేవీల రికార్డును ఫిబ్రవరి నెలలో ఎస్బీఐ నమోదు చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఫోన్‌పే కూడా పలు విభాగాల్లో అగ్రగామిగా నిలిచాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై యాప్ ఆధారిత లావాదేవీలు, విలువ పరంగా ఎక్కువ నమోదు చేసింది ఫోన్‌పే. యాప్ విభాగంలో ఫోన్‌పే ద్వారా 975.53 మిలియన్ యూపీఐ చెల్లింపుల లావాదేవీలు జరిగాయి. ఎస్బీఐ 652.92 మిలియన్ల రెమిటెన్స్ లావాదేవీలను ఫిబ్రవరిలో నమోదు చేసింది. భీమ్ యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఇకమీదట ఫిర్యాదుల స్వీకరణ కాగా, డిజిటల్ లావాదేవీలకు భీమ్ యూపీఐ యాప్‌ను వినియోగించే వారు తమ పెండింగ్ (అపరిష్కృత) లావాదేవీల వివరాలను పరిశీలించుకోవడంతోపాటు, ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చని ఎన్పీసీఐ ప్రకటించింది. కస్టమర్ అనుకూల, పారదర్శక ఫిర్యాదుల పరిష్కార విధానం ఉండాలన్న ఆర్బీఐ విధానంలో భాగమే నూతన సదుపాయమని పేర్కొంది. భీమ్ యూపీఐ యాప్‌పై యూపీఐ–హెల్ప్ ఆప్షన్ నుంచి ఈ సదుపాయాలను పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
జనవరి 1నుంచి చెక్కు చెల్లింపులకు కొత్త రూల్స్
ముంబై, సాక్షి: వచ్చే(2021) జనవరి 1నుంచి చెక్కుల చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సానుకూల చెల్లింపుల(పాజిటివ్ పే) విధానం పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నిబంధనలలో భాగంగా ఇకపై రూ. 50,000కు మించిన చెక్కుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక అంశాలను మరోసారి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా.. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) అవకతవకలకు చెక్ పాజిటివ్ పేలో భాగంగా క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు చెక్కు సంఖ్య, తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబర్, చెల్లించవలసిన మొత్తం వంటి అంశాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది. తద్వారా మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను రూపొందించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ విధానం రూ. 50,000.. అంతకుమించిన పెద్ద మొత్తాల చెక్కులకు మాత్రమే వర్తింపచేయనున్నట్లు తెలుస్తోంది. (హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్) పలు విధాలుగా చెక్కును జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం తదితర వివరాలను వివిధ మార్గాల ద్వారా చెల్లించే(డ్రాయీ) బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఈ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం తదితరాల ద్వారా అందించవచ్చు. ఈ సమాచారాన్ని జమ చేసిన చెక్కు వివరాలతో చెక్ క్లియరింగ్ సిస్టమ్స్(సీటీఎస్) పోల్చి చూసుకునేందుకు వీలుంటుంది. ఎప్పుడైనా సమాచారం సరిపోలకుంటే డ్రాయీ బ్యాంకు, ప్రెజంటింగ్ బ్యాంకులకు సీటీఎస్ తెలియపరుస్తుంది. తద్వారా చెక్కుల పరిష్కారానికి బ్యాంకులు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్పీఎస్ ద్వారా సీటీఎస్‌లలో పాజిటివ్ పే వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేయడంతోపాటు.. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు సైతం అందించవలసి ఉంటుంది. వెరసి ఈ వ్యవస్థను బ్యాంకులు ఖాతాదారులందరికీ అమలు చేయవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ నిపుణులు పేర్కొన్నారు. రూ. 50,000, అంతకుమించి విలువగల చెక్కులకు ఈ వ్యవస్థ అమలుకానుంది. అయితే ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది. రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
యూపీఐలో ఆటోపేమెంట్ సదుపాయం
న్యూఢిల్లీ: తరచుగా జరిపే చెల్లింపులను ఆటోమేటిక్‌గా పూర్తి చేసేందుకు తోడ్పడేలా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో ఆటోపే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) తెలిపింది. మొబైల్ బిల్లులు, కరెంటు బిల్లులు, నెలవారీ కట్టాల్సిన వాయిదాలు, బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్స్ చందాలు మొదలైన వాటన్నింటికీ ఈ విధానంలో ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరపవచ్చు. ఆటోపేలో రూ. 2,000 దాకా పరిమితి ఉంటుంది. అంతకు మించిన లావాదేవీకి యూపీఐ పిన్ తప్పనిసరి. యూపీఐ ఆధారిత యాప్స్ అన్నింటిలోనూ ’మ్యాన్‌డేట్’ అనే సెక్షన్ ఉంటుందని, ఇందులో ఆటో డెబిట్ ఆదేశాలను పొందుపర్చవచ్చని ఎన్పీసీఐ తెలిపింది. నిర్దేశిత రోజున చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి కాబట్టి ఇటు వ్యక్తులకు, అటు వ్యాపార సంస్థలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైన వాటిల్లో ఇది అందుబాటులో ఉందని పేర్కొంది. త్వరలో ఎస్బీఐ, జియో పేమెంట్స్ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు కూడా ఇది ప్రవేశపెడుతున్నాయని ఎన్పీసీఐ తెలిపింది. -
ఇతర బ్యాంకుల మెషీన్ల్లలోనూ క్యాష్ డిపాజిట్‌కు ఆర్బీఐ అనుమతి!
కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంల నెట్వర్క్ అయిన జాతీయ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)లో భాగంగా ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రతిపాదన చేసిందని, ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ద్వారా కొన్ని షరతులపై సూత్రప్రాయంగా ఆమోదం కూడా లభించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ కోసం చేసిన ప్రతిపాదనలపై లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల క్యాష్ డిపాజిట్ మెషీన్ (సీడీఎంఎస్)లో జరిపే ఒక లావాదేవీకి రూ.49,999లు పరిమితి విధించినట్టు చెప్పారు. బ్యాంకుల్ని పటిష్టపరుస్తాం.. ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టం చేయడంపై కేంద్రం దృష్టిని సారించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. భారతీయ మహిళా బ్యాంకు సహా చిన్నతరహా బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే ప్రతిపాదనలపై ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గోకరాజు గంగరాజు, జ్యోతి ధృవే, భగవంత్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మరిన్ని అంశాలు... ⇒ ఒకప్పటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌సహా దాదాపు 14 సంస్థలపై కంపెనీల చట్ట నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ⇒ భారత్‌లో దాదాపు 8,354 విదేశీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఒక లిఖితపూర్వక సమాధానంలో మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వీటిలో కొన్ని కంపెనీలకు గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా పన్ను బకాయిలు ఉన్నాయని, ఆయా కంపెనీలపై తగిన చర్యలు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోందని ఆర్థికశాఖ సహాయమంతిర జయంత్ సిన్హా తెలిపారు. ⇒ కాగా మరో ప్రశ్నకు సిన్హా సమాధానం చెబుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధన మద్దతు కేంద్రం అందిస్తుందని వివరించారు. మార్కెట్ నుంచి సైతం నిధుల సమీకరణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ⇒ 2012 నుంచి రక్షణ రంగంలోకి దాదాపు 13 లక్షల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు రక్షణశాఖ సహాయమంత్రి రావు లలిత్జిత్ సింగ్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.