పార్టీకి పూర్వవైభవం తెస్తాం
ధారూరు: జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కోల్కొంద సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ధారూరు మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకుల అధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోల్కొంద సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకుల సహకారంతో, సలహాలతో పార్టీని ముందుకు నడిపిస్తామని చెప్పారు.
2019లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. తనకు జాతీయ స్థాయిలో పదవి లభించినా.. సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని అన్నారు. చైనాలో జరిగిన యువజన సదస్సుకు పార్టీ తనను పంపిందని సంతోష్‌కుమార్ చెప్పారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల గురించి ప్రసంగించినట్లు ఆయన తెలిపారు. తనకు పదవి ఇచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతవ్, ఇన్చార్జి సూరజ్‌హెగ్డేలకు సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ధారూరు జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ కార్యదర్శి బుజ్జయ్యగౌడ్, యూ త్ కాంగ్రెస్ వికారాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, ఎంపీటీసీలు మాన్సింగ్, గొల్ల బాలప్ప, రమేశ్‌కృష్ణ, నాయకులు వెంకటయ్య యాదవ్, అశోక్ తదితరులు ఉన్నారు.