National service
-
Delhi liquor scam: త్వరలో వస్తా..అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో ఈడీ కస్టడీ నుంచి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. దాన్ని ఆయన భార్య సునీత ప్రత్యక్షప్రసారంలో చదివి వినిపించారు. ‘‘జైల్లో ఉన్నా, బయటున్నా నా జీవితంలో ప్రతి క్షణం దేశ సేవకే అంకితం. నా ప్రతి రక్తపుబొట్టు దేశం కోసమే ధారపోస్తా. మీ సోదరుడు, కుమారుడినైన నన్ను ఏ జైలూ ఎక్కువ రోజులు బంధించలేదు. త్వరలోనే బయటికొస్తా. మీకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా. కష్టాల్లోనే పెరిగా. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా. అందుకే ఈ అరెస్ట్‌తో ఆశ్చర్యపోలేదు. దేశాన్ని బలహీన పరిచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వాటిని ఓడించండి’’ అని బీజేపీని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘గత జన్మలో ఎంతో పుణ్యంచేసుకొని ఉంటా. అందుకే ఈ పుణ్యభూమిలో పుట్టా. కోట్లాదిగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమే నాకు కొండంత అండ’ అని అందులో కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ వాళ్లంతా నా సోదరసోదరీమణులు ‘‘ఆప్ వాలంటీర్లకు నాదో సూచన. నేను కస్టడీలో ఉన్నా çసామాజిక, సేవ కార్యక్రమాలు ఆగకూడదు. ఢిల్లీ మహిళలకు నెలకు రూ.1,000 వాగ్దానం నేనొచ్చాక నెరవేరుస్తా. నన్ను అరెస్ట్ చేశారని బీజేపీపై ద్వేషం పెంచుకోకండి. వాళ్లంతా నా సోదరసోదరీమణులు. ప్రజల ఆశీర్వా దాలతో మూడుసార్లు సీఎం అయిన నన్ను అధికార అహంకారంతో మోదీ జైళ్లో పడేశారు. ఇది ఢిల్లీ ప్రజలను వంచించడమే. ఎక్కడున్నా ప్రజాసేవలకే అంకితమవుతా. వాళ్లే నిర్ణాయక శక్తులు. జై హింద్’’ అన్నారు. ఆప్ ఢిల్లీ ఆఫీస్‌కు తాళం ఆప్ ఢిల్లీ కార్యాలయానికి సీలు వేశారని మంత్రి ఆతిషి ఆరోపించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీ ఆఫీస్‌కు వెళ్లకుండా మా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని చెప్పారు. ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ‘‘ఆఫీస్‌కు సీల్ వేయలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అందుకే వందల సంఖ్యలో వస్తున్న ఆప్ కార్యకర్తలను ఆఫీస్ వైపు వెళ్లనివ్వట్లేదు. గుమిగూడనివ్వట్లేదు’’ అని వివరించారు. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని ఆతిశీ ‘ఎక్స్’లో వెల్లడించారు. జైలులో సీఎం ఆఫీస్‌కు అనుమతి కోరతాం: భగవంత్ మాన్ ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడి నుంచి ఆయన ప్రభుత్వాన్ని నడిపేలా సీఎం తాత్కాలిక ఆఫీస్‌ను ఏర్పాటుచేసేందుకు అనుమతి కోరతామని ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ‘ఆప్‌లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీచేయ లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదనే నిబంధన ఏదీ లేదు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కోర్టు కేజ్రీవాల్‌ను జైలుకు తరలిస్తే అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహి స్తారు. దోషిగా తేలనంత వరకూ చట్ట ప్రకారం ఆయన జైలు నుంచి కూడా పనిచేయవచ్చు. అందుకే ఆఫీస్ కోసం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల అనుమతి కోరతాం’ అని మాన్ అన్నారు. సోదరా, తీహార్‌కు వెల్కం! కేజ్రీవాల్‌కు సుఖేశ్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రియ సోదరా, కేజ్రీవాల్! నెమ్మదిగా అయినా నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత్ శక్తికి ఇదో క్లాసిక్ ఉదాహరణ. వెల్ కం టూ తీహార్ క్లబ్. బాస్ ఆఫ్ తీహార్ క్లబ్‌గా ఆహ్వానిస్తున్నా. మీ డ్రామాలకు ముగింపు పడింది’’ అంటూ మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ శనివారం ఆయకు లేఖ రాశాడు. ‘‘మీ అవినీతంతా బయటపడుతుంది. ఢిల్లీ సీఎంగా 10 కుంభకోణాలు చేశారు. నాలుగింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. లిక్కర్ స్కాం కేవలం ఆరంభమే. అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయట పెడతా. నేను ఛైర్మన్‌గా, కేజ్రీ బిగ్‌బాస్‌గా, సిసోడియా సీఈఓగా, సత్యేంద్ర జైన్ సీఓఓగా తిహార్ క్లబ్ నడుపుతా‘’ అన్నాడు. -
కేంద్ర సర్వీసులకు అకున్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో బుధవారం పలు ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న డీఐజీ అకున్ సబర్వాల్‌ను కేంద్ర సర్వీసులకు పంపేందుకు రాష్ట్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఆయనను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీసులోకి ఆయన వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన దరఖాస్తును చాలా నెల లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచు తూ వస్తోంది. ఇక అకున్ సబర్వాల్ స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యనారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలో నల్లగొండ కలెక్టర్‌గా సత్యనారాయణ రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న రాజీవ్ త్రివేదిని జైళ్ల శాఖ డీజీగా బదిలీ చేశారు. కేంద్ర సర్వీసులకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న ఏడీజీ సౌమ్య మిశ్రాపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) మాజీ డైరెక్టర్ సంతోష్ మెహ్రా కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లే యోచనలో ఉన్నారు. వాస్తవానికి ఐపీఎస్ బదిలీలు గత ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. అదే నెలలో పదోన్నతులు పొందిన చాలామంది ఐపీఎస్ అధికారులు ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయిలో బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఉంటాయని సమాచారం. మరో ముగ్గురి బదిలీలు.. వీరితోపాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను హోంశాఖ బదిలీ చేసింది. మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీగా ఉన్న ఆర్ గిరిధర్, నిర్మల్‌లో అడిషనల్ ఎస్పీగా ఉన్న బి.రాజేశ్, సైబరాబాద్ సీపీ అటాచ్మెంట్లో ఉన్న అడిషనల్ డీసీపీ జె.రాఘవేంద్రరెడ్డిలను టీఎస్పీఏ అసిస్టెంట్ డైరెక్టర్లుగా నియమించింది. -
దేశసేవలో గోంగూర...
తిండి గోల ఆంధ్రమాతగా తెలుగువారి మదిని కొల్లగొట్టిన గోంగూర పుట్టుపూర్వోత్తరాలు ఎట్టివో ఎవరూ కనిపెట్టలేకపోయారు. బైటి దేశం నుంచి వచ్చిందే అని కొందరు, కాదు కాదు మనదే అని కొందరు వాదులాడుకున్నా పచ్చడి దగ్గరకొచ్చేసరికి అంతా ఒక్కటైపోయారు. పుల్లపుల్లగా కాస్త వగరుగా శాకమైనా, మాంసమైనా వంటకాలకు రుచిని తెచ్చే పుంటికూర గురించి ఫుల్స్టాప్ లేకుండా ఎన్ని పేజీలైనా రాసేయొచ్చు. ఇది బెండ కుటుంబానికి చెందింది. నార పంటగా వాడుకలో ఉంది. క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్యాసిడ్తో పాటు పీచు సమృద్ధిగా ఉండే ఆకుకూర. గోగు నారతో సంచులు, తాళ్లు... తయారుచేస్తారు. మెట్ట, మాగాణీ భూముల్లో గోగు పంటలు సాగు జరుగుతుంది. విదేశాలకు పచ్చడి రూపాన గోంగూర ఎగుమతి అవుతుంది. అయితే, గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణీనయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పరోక్షంగా దేశసేవ చేస్తూనే ఉంది. మనదేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లో విరివిగా కనిపిస్తోంది. చత్తీస్ఘడ్, మణిపురి, పంజాబ్‌లలో కనిపిస్తున్న గోంగూర బంగ్లాదేశ్‌లోనూ సాగుచేస్తున్నారు. చైనాలో వేసవి పంటగా గోంగూర పచ్చగా వర్థిల్లుతోంది. వింతేమిటంటే తెలుగు ప్రజలలో గోంగూరుకు ఎంత పేరుందో సౌత్ ఆఫ్రికాలోనూ అంతేపేరుంది. .