national vice president
-
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో " స్ట్రెయిట్ టాక్ "
-
'నాపై హత్యాయత్నం జరిగింది'
మలప్పురం : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఏపీ అబ్దుల్లా కుట్టీ ప్రయాణిస్తున్న కారుని వెనక వైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ఇది తనపై హత్యాయత్నమని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపినందుకు లారీ డైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అలాగే తాను రెస్టారెంట్లో ఉండగా, తన కారుపై కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారంటూ పోలీసులకు అబ్దుల్లా కుట్టీ మరో ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు సంఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, వీటిపై విచారణ జరిపి దోషులను పట్టుకొని, దీని వెనుక దాగి ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని అబ్దుల్లా కుట్టీ కోరారు. -
‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’
చిలమత్తూరు : రుణమాఫీ తదితర ప్రలోభాలతో రైతులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు విజుకృష్ణన్, మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం కొడికొండ చెక్‌పోస్టులో అఖిల భారత కిసాన్ సభ జాతా చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు సమాధానాలు ఇస్తూ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, సిద్దారెడ్డి, ప్రవీణ్, వినోద్, లక్ష్మీనారాయణ, వినోద్, వెంకట్రామిరెడ్డి, రామచంద్ర, నరసింహులు, నారాయణస్వామి, రాజప్ప, వెంకటేష్ తదితరులు పొల్గాన్నారు.