Navdeep Singh Suri
-
శ్రీదేవి కేసు: మనం ఏమీ చేయలేం!
దుబాయ్: ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకు తరలించే విషయంలో జరుగుతున్న ఆలస్యంపై దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి నిస్సహాయత వ్యక్తం చేశారు. పార్థీవదేహాన్ని అప్పగించే వరకు ఏమీ చేయలేమని ఆయన అన్నారు. వీలైనంత తొందరగా శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశం తరలించేందుకు దుబాయ్ ప్రభుత్వ యంత్రాంగంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. వదంతులు వద్దు శ్రీదేవి లాంటి సెలబ్రిటీ చనిపోయినప్పుడు మీడియాకు ఆసక్తి సహజమని, వదంతులు వ్యాపింపజేయడం ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని.. వారి బాధను పంచుకుంటున్నామని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఈలాంటి కేసుల్లో చట్టప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయడానికి రెండుమూడు రోజులు పడుతుందన్నారు. శ్రీదేవి ఎలా చనిపోయిందనేది నిపుణులు తేలుస్తారని చెప్పారు. రీపోస్టుమార్టంకు అవకాశం? శ్రీదేవి భౌతికకాయానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకపోలేదని తెలుగు మహిళా న్యాయవాది అనురాధ వొబ్బిలిశెట్టి తెలిపారు. ప్రవాసుల సహజ, అసహజ మరణాల్లో న్యాయప్రక్రియ అందరికీ ఒకేలా ఉంటుందన్నారు. లోతుగా దర్యాప్తు అవసమని భావిస్తే రీపోస్టుమార్టంకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశిస్తుందని చెప్పారు. అనుమానాలు నివృత్తి కాకుండా భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒప్పుకోదని స్పష్టం చేశారు. -
ఆస్ట్రేలియన్లను అలరించనున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
మెల్బోర్న్: భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, కళాకారుల నైపుణ్యాన్ని చాటడానికి మొదటిసారిగా ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్, కాన్బెర్రా తదితర ప్రధాన నగరాల్లో ఆగస్టులో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని భారత హైకమిషనర్ నవ్‌దీప్ సూరి వెల్లడించారు. నాలుగు నెలలపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు, సంగీతంతోపాటు భారతీయ కళలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఆస్ట్రేలియా, ఇండియా ప్రభుత్వాలతోపాటు పలు ప్రైవేటు సంస్థల సహాయంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రదర్శనలు ఉంటాయని, ఒడిషా నర్తకి సుజతా మహాపాత్ర, రఘు దీక్షిత్ సంగీతం, అజిత్ నియాన్ కార్టూన్ ఎగ్జిబిషన్, తోలుబొమ్మలాట వంటివి ఆస్ట్రేలియన్లను అలరిస్తాయని చెప్పారు. ఈ ఉత్సవం అధికారికంగా వచ్చే నెలలో సిడ్నీలో ప్రారంభమవనుంది.