ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవీన్ కస్తూరియా ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ప్రియురాలు శుభాంజలి శర్మను పెళ్లాడారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అభిమాన నటుడికి అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. బుల్లితెర నటుడిగా ఎంట్రీ నవీన్ కస్తూరియా ఆ తర్వాత సినిమాల్లోనూ మెప్పించారు. టీవీఎఫ్ పిచర్స్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌ల్లో నటించారు. బ్రీత్: ఇన్టు ది షాడోస్, ఆస్పిరెంట్స్, పతీ పత్ని ఔర్ పంగా, హ్యాపీ ఎవర్ ఆఫ్టర్, మ్యాన్స్ వరల్డ్ లాంటి సిరీస్‌ల్లో కనిపించారు. అంతేకాకుండా సులేమాని కీడా మూవీతో ఎంట్రీ ఇచ్చిన నవీన్ వా జిందగీ, లవ్ సుధా, ఇంటీరియర్ కేఫ్ నైట్, హోప్ ఔర్ హమ్ లాంటి సినిమాల్లోకి నటించారు. నవీన్ కస్తూరియా చివరిసారిగా మిథ్యా వెబ్ సిరీస్ సీజన్-లో కనిపించాడు. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.డేటింగ్ రూమర్స్..గతంలో నవీన్‌పై డేటింగ్ రూమర్స్ కూడా వినిపించాయి. తన సహనటి హర్షిత గౌర్తో ఆయన డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వాటిపై నవీన్ క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరం ఎప్పుటికీ స్నేహితులమని అంతకుమించి మరేమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా నవీన్‌కు పెళ్లి కావడంతో ఆ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది.