navy officers
-
జైలు శిక్షపైనా అప్పీలు!
న్యూఢిల్లీ: ఖతర్‌లో గూఢచర్య ఆరోపణలపై జైల్లో ఉన్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరింత ఊరట. వారికి విధించిన మరణశిక్షను అక్కడి న్యాయస్థానం ఇటీవలే జైలు శిక్షగా మార్చడం తెలిసిందే. దానిపై కూడా ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలు కల్పించడంతో పాటు అందుకు 60 రోజుల గడువిచ్చినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ తెలిపారు. 8 మంది మాజీ అధికారుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా జైలు శిక్ష విధించినట్టు చెబుతున్నారు. వాటి వివరాలను ఖతార్, భారత్ గోప్యంగా ఉంచుతున్నాయి. -
ఖతర్‌లో మరణశిక్ష కేసు.. బాధితులను కలిసిన భారత రాయబారి
ఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ.. భారత్ అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు. #WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "You would have seen Prime Minister Modi meet Sheikh Tamim Bin Hamad, the Amir of Qatar in Dubai on the sidelines of CoP28. They've had a good conversation on the overall bilateral relationship as well as in the well-being of the… pic.twitter.com/PfcBKtKvnm — ANI (@ANI) December 7, 2023 సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నావికాదళ అధికారులకు న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 3ను వారిని భారత్ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అదేవిధంగా.. ఇటీవల కాప్ సదస్సులో భాగంగా దుబాయ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు. -
నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట
దోహా: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల కుటుంబాలకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం అందినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. భారత అప్పీల్‌ను కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తూ ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడినట్లు వీరిపై ఖతార్ ఆరోపణలు మోపింది. చదవండి: కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 30న ఎనిమిది మంది అధికారులను అరెస్ట్ చేశారు. గత అక్టోబర్ నెలలో దేశ న్యాయస్థానం వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగరణించింది. ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి నవంబర్ 9న వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరణ శిక్ష పడిన వారిలో..కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేగ్లు ఉన్నారు. సంబంధిత వార్త: అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు -
502 అడుగుల ఎత్తులో చేజారిన పరిస్థితులు.. ట్రైనీ పైలట్‌ను తప్పించి ప్రాణత్యాగం
2020 నవంబర్ 26.. గోవా సాగరజలాల్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి.. రయ్‌మంటూ గాల్లోకి మిగ్–29కి చెందిన మిగ్ 677 యుద్ధ విమానం దూసుకెళ్లింది. కొత్తగా నౌకాదళంలో చేరిన వారికి యుద్ధ విమానాలు నడిపే అంశంపై శిక్షణలో భాగంగా.. మిగ్ 677 విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కమాండర్ నిశాంత్ సింగ్ నడుపుతూ కోపైలట్‌కు శిక్షణ అందిస్తున్నారు. 1500 గంటలకు పైగా.. మిగ్ విమానాల్ని నడిపిన అనుభవం ఉన్న నిశాంత్.. శిక్షణ అందిస్తున్న సమయంలో సాయంత్రం 4.27 గంటల సమయంలో మిగ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒక్కసారిగా తలెత్తిన ఈ హఠాత్పరిణామం నుంచి తప్పించుకునేందుకు నిశాంత్ తన శాయశక్తులా ప్రయత్నించారు. 15 వేల అడుగుల ఎత్తు నుంచి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. కిందకి వస్తూ ఉన్నారు. దాదాపు 502 అడుగుల ఎత్తులో పరిస్థితులు చేజారిపోయినట్లు గుర్తించారు. వెంటనే ట్రైనీ పైలట్ ను విమానం నుంచి తప్పించేసిన నిశాంత్.. తన ప్రాణాల్ని మాత్రం కాపాడుకోలేక దేశం కోసం తుదిశ్వాస విడిచారు. అందుకే నిశాంత్‌కు శౌర్య పతకం వరించింది. 2021.. సెప్టెంబర్ 26.. ఉదయం 8 గంటలు.. జమ్మూకాశ్మీర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న 14 రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్ సెక్టార్–3లోని ఒక ఇంట్లో ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వెంటనే మార్కోస్ బృందానికి సమాచారం అందించారు. వినీత్‌కుమార్‌తో సహా మార్కోస్ బృందం ఉగ్రవాదులున్న ఇంటి వద్దకు చేరుకుంది. ఖాన్ మొహల్లా, వాట్రినా అనే ఇద్దరు ఉగ్రవాదులున్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లుని మార్కోస్ బృందం ఆక్రమించింది. ఉగ్రవాదులు నేరుగా కాల్పులు జరిపేందుకు వీలుగా ఉన్న ఇంటి పైకప్పుపైకి ప్రమాదం అని తెలిసినా.. టెర్రరిస్టుల్ని మట్టుపెట్టడమే లక్ష్యంగా వినీత్‌కుమార్, మనీష్ చౌహాన్ పైకి వెళ్లారు. 9.30 గంటల సమయంలో టెర్రరిస్టులు గ్రానైడ్లతో దాడి చేయడంతో పాటు ఏకకాలంలో ఫైరింగ్ చేశారు. ఈ క్రమంలో రైఫిల్ మ్యాన్ మనీష్ చౌహాన్‌కు గాయాలయ్యాయి. గ్రానైడ్ పేలుడుతో వచ్చిన అగ్ని కీలల నుంచి తప్పించుకున్న వినీత్‌కుమార్.. ఉగ్రవాదుల్ని ట్రాక్ చేస్తూ.. వారున్న ఇంటిపైకి దూసుకెళ్లారు. ఫైరింగ్ తర్వాత రెండు గంటల పాటు మౌనంగా ఉన్న టెర్రరిస్టులు మరోసారి దాడికి ప్రయత్నించారు. ఈలోపునే.. వారిని ట్రాక్ చేసుకున్న వినీత్‌కుమార్.. ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఉగ్రమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వినీత్కుమార్కు అత్యుత్తమమైన శౌర్య పతకం(గ్యాలంట్రీ మెడల్) వరించింది. ఇలా ఒక్కొక్కరిదీ.. ఒక్కో విజయగాధ.. శత్రుదేశాల నుంచి దేశాన్ని రక్షిస్తూ.. పౌరులు జీవితాలు ప్రశాంతంగా సాగేందుకు శ్రమిస్తున్న నౌకాదళ అధికారులు, సిబ్బంది ధైర్య సాహసాలకు గుర్తింపుగా అత్యుత్తమ సేవా పతకాలతో ఇండియన్ నేవీ సత్కరించింది. 33 మందికి శౌర్య, నవ్‌సేనా, విశిష్ట సేవా, కెప్టెన్ రవిధీర్ మెమొరియల్, లెఫ్టినెంట వీకే జైన్ మెమోరియల్ గోల్డ్ మెడల్స్, జీవన్ రక్షా పదక్ అవార్డులను భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నేవల్ ఇన్వెస్టిచర్ సెరమనీ –2023ని బుధవారం ఘనంగా నిర్వహించారు. నౌకాదళాధికారులు, సెయిలర్స్, యుద్ధ నౌకలు, సబ్మైరెన్ల సారధులు, నేవీ కుటుంబాల సమక్షంలో పతకాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ హితంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నౌకల నిర్వహణ సాగిస్తున్న విశాఖలోని నేవల్ డాక్‌యార్డు... బెస్ట్ గ్రీన్ ప్రాక్టీస్–2023 ఇండస్ట్రియల్ విభాగంలో సీఎన్ఎస్ ట్రోఫీని దక్కించుకుంది. – సాక్షి, విశాఖపట్నం -
ఆరుగురు భారతీయుల అరెస్ట్
డ్రగ్స్ అమ్ముతూ ఆరుగురు భారతీయులు పట్టుబడ్డారు. కొలంబో(శ్రీలంక): డ్రగ్స్ అమ్ముతున్న ఆరుగురు భారతీయుల్ని శ్రీలంక నావీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద బోటులో అనుమానంగా తిరుగుతుండటంతో పెట్రోలు సిబ్బంది పట్టుకున్నట్లు నావీ అధికారులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిని కంకేసతురాయ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
వైఫ్-స్వాపింగ్ ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తన భర్త, అతని స్నేహితులు వైఫ్-స్వాపింగ్ (భార్యలను మార్చుకోవడం) పార్టీలు చేసుకున్నారని, వారి గ్రూపులో చేరనందుకు తనను చిత్రహింసలకు గురిచేశారంటూ ఓ నావీ ఆఫీసర్ భార్య చేసిన సంచలన ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలలలోపు విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013, ఏప్రిల్ 4న కోచి హార్బర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. బాధితురాలికి 2012 మార్చిలో ఓ నావీ ఆఫీసర్‌తో వివాహం అయింది. అనంతరం ఆమె భర్త వెంట కోచికి వెళ్లింది. తన భర్త, ఇతర నావీ అధికారులు వైఫ్-స్వాపింగ్ పార్టీలు చేసుకునేవారని, ఆ పార్టీలో పాల్గొనాల్సిందిగా తన భర్త ఒత్తిడి చేసేవారని ఆమె ఆరోపించింది. ఈ పార్టీల్లో పాల్గొనేందుకు నిరాకరించినందుకు తన భర్త వేధించాడని చెప్పింది. ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో తన భర్తను అభ్యంతరకర పరిస్థితిలో చూశానని ఆరోపించింది. తన భర్త స్నేహితులు, కొలీగ్స్, పైఅధికారులు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నారంటూ ఆరోపించింది. భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు ఐదుగురు నావీ అధికారులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదుగురు నావీ అధికారులు, ఈ అధికారుల్లో ఒకరి భార్య తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది. తొలుత ఈ కేసు కేరళ హైకోర్టులో విచారణకు వచ్చింది. కేరళలో తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. సీబీఐతో విచారణ చేయించాలని కోర్టుకు విన్నవించింది. ఆమె విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు కేరళ పోలీసులు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.