నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు కొలిక్కి!
పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతం శివారులో నెలకొల్పే నౌకాదళ రాడార్ కేంద్రం (నేవీ స్ట్రాటజిక్ సెంటర్) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నౌకౌదళం, అటవీశాఖ, జిల్లా ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నౌకాదళ రాడార్ కేంద్రాన్ని మండలంలోని దామగుండం సమీపంలో 2,900 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందుకు మరోచోట ఢీ రిజర్వు చేయనున్నారు.
ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో శత్రు దేశాల జలాంతర్గాముల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి పొంచి ఉండే ప్రమాదాలను కూడా తెలుసుకోవచ్చు. కాగా.. పూడూరు మండలానికే వన్నె తెచ్చే దామగుండం రామలింగేశ్వరాలయాన్ని వదిలేసి నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు నౌకాదళం అధికారులు అంగీకరించారు. సీఎంతో సోమవారం జరిగే సమావేశంలోని అంశాల తుది నివేదికను కేంద్ర అటవీశాఖ, నౌకాదళానికి పంపించనున్నారు.