naxal commander
-
సొంత కమాండర్‌నే హతమార్చిన మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సొంత దళకమాండర్‌నే హతమార్చిన సంఘటన గురువారం జరిగింది. బస్తర్ రేంజ్ ఐజీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో పలువురు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. అయితే ఈ హత్యల నేపథ్యంలో పలువురు అమాయక ఆదివాసీలు సైతం హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో గంగులూరు డీవీసీ ఏరియా కమిటీ కమాండర్ విజా మొడియం అలియాస్ భద్రు (34) కొంతకాలంగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వారిని హత్య చేశారనే సమాచారం మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలకు చేరింది. దీంతో గురు వారం గంగులూరు–కిరండోల్ మధ్యలోని ఎటావర్ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టు ముఖ్య నేతలు సదరు కమాండర్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. (బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఏజెన్సీ) -
నక్సల్ కమాండర్ లొంగుబాటు
కరీంనగర్ : మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్ లింగయ్య అలియాస్ మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆరోగ్యప్రభుత్వం గతంలో అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డెవీస్ మాట్లాడుతూ లింగయ్యపై సుమారు 15 కేసులు ఉన్నాయని తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అతని పేరు మీద ఉన్న రూ. లక్ష రివార్డును త్వరలోనే అతనికే అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా లింగయ్యపై ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యలతో పాటు తెలంగాణ రీ రీజయన్ పరిధిలోని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురు గ్రామస్తులను హత్య చేసిన కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. 2010 లో మావోయిస్టు గ్రూప్ చేరిన మల్లేష్, 2014 లో మహదేవ్పూర్ మండలం ఏటూరు నాగారం మావోయిస్టు డిప్యూటీ కమాండర్ పదవి చేపట్టాడు. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతోనే లొంగిపోయినట్లు లింగయ్య పేర్కొన్నాడు.