nayeem wife haseena
-
అక్రమ వసూళ్ల కేసులో నయీం భార్య అరెస్టు
సాక్షి, యాదాద్రి భువనగిరి: గ్యాంగ్స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్ ఎస్సై ఎం.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు పేర్కొన్న ఐటీ అధికారులు గతేడాది వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
పోలీస్కస్టడీకి నయీం భార్య, కోడలు
మిర్యాలగూడ: ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నయీం భార్య హసీనా, కోడలు సాజిద్ షాహీన్లకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఇద్దర్ని పోలీసులు శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టుకు హాజరు పర్చగా.. న్యాయస్థానం వీరికి ఈ నెల 17 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టుకు హాజరైన నయీం భార్య, సోదరి
జగిత్యాల: ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో గ్యాంగ్స్టర్ నయీం భార్య, సోదరిని పోలీసులు శనివారం కోర్టుకు హాజరు పరిచారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ వ్యాపారిని నయీం భార్య హసీనా, సోదరి సలీమా బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను జగిత్యాల జిల్లా కోర్టుకు హాజరుపరచగా.. వారికి రిమాండ్ గడువును మరో 14 రోజులకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.