
కోర్టుకు హాజరైన నయీం భార్య, సోదరి
జగిత్యాల: ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, సోదరిని పోలీసులు శనివారం కోర్టుకు హాజరు పరిచారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ వ్యాపారిని నయీం భార్య హసీనా, సోదరి సలీమా బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను జగిత్యాల జిల్లా కోర్టుకు హాజరుపరచగా.. వారికి రిమాండ్ గడువును మరో 14 రోజులకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.