gangster nayeem encounter
-
కోర్టుకు హాజరైన నయీం భార్య, సోదరి
జగిత్యాల: ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, సోదరిని పోలీసులు శనివారం కోర్టుకు హాజరు పరిచారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ వ్యాపారిని నయీం భార్య హసీనా, సోదరి సలీమా బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను జగిత్యాల జిల్లా కోర్టుకు హాజరుపరచగా.. వారికి రిమాండ్ గడువును మరో 14 రోజులకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. -
'నయీం కేసును సీబీఐకి అప్పగించాలి'
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. నయీం దందాలు ఐదు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటంతో సిట్‌తో విచారణ సాధ్యమయ్యే పనికాదన్నారు. సిట్ చీఫ్ నాగిరెడ్డి ఉన్నతాధికారులను విచారణ చేయగలరా అని ప్రశ్నించారు. నయీం డైరీలోని పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదో తెలపాలన్నారు. -
నయీం కేసులో టెక్ మధు అరెస్ట్
నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో టెక్ మధును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని ఆలేరు కోర్టులో హాజరు పరిచారు. అశోక్ అలియాస్ మధుతోనూ నయీం సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. తన దందా కొనసాగించేందుకు నయీం అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. నయీం ఎన్కౌంటర్ అనంతరం అతడి స్థావరాల నుంచి స్టెన్ గన్లు, ఏకే-47, తపంచాలు, జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నయీం కేసుకు సంబంధించి వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో టెక్ మధు ఏ16గా ఉన్నాడు. కాగా గతంలో మావోయిస్టులకు టెక్ మధు రాకెట్ లాంఛర్లు సరఫరా చేసిన విషయం విదితమే. మరోవైపు నయీం కేసులో తవ్వేకొద్దీ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులతో పాటు, సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అలాగే నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 26మంది బాధితులు మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించారు.