naziya
-
7 కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు ఇదే?
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్లో భాగంగా మంగళవారం నాటి ఎపిసోడ్లో ఐపీఎస్ అధికారి మహితా శర్మ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు ఏకధాటిగా సమాధానాలు ఇచ్చిన ఆమె రూ.7 కోట్లు గెల్చుకునే అవకాశం ఉన్న 15వ ప్రశ్న వద్ద క్విట్ అయ్యారు. దీంతో ఆమె కోటి రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మహితా శర్మను ఇంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటా అనుకుంటున్నారా... అయితే తెలుసుకోండి మరీ.. 1817లో ముంబైలో వాదియా గ్రూపు నిర్మించిన బ్రిటీష్ యుద్ధనౌక పేరేంటి అనేదే ఆ ప్రశ్న. దీనికి సమధానం చెప్పాల్సిందిగా ఆమెకు నాలుగు ఆప్సన్స్ ఇచ్చారు. అందులో 1. హెచ్ఎమ్ఎస్ మిండెన్ 2. హెచ్ఎమ్ఎస్ కోర్న్‌వాలీస్ 3. హెచ్ఎమ్ఎస్ త్రింకోమలీ 4. హెచ్ఎమ్ఎస్ మియానీ.. అయితే మహితా శర్మ దీనికి సమాధానం చెప్పలేక పోటి నుంచి తప్పుకుంటునట్లు చెప్పారు. దీనికి ‘హెచ్ఎమ్ఎస్ త్రింకోమలీ’ అనేది సరైన సమాధానం అని, ప్రస్తుతం ఈ యుద్ధ నౌక రాయల్ నేవీ జాతీయ మ్యూజియంలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుందని అమితాబ్ వెల్లడించారు. మహితా శర్మ కన్నా ముందు ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్‌గా నజీయా నసీమ్ పాల్గొన్నారు. ఆమె కూడా కోటి రూపాయలు గెల్చుకుని రూ.7 కోట్ల ప్రశ్న వద్ద క్విట్ అయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోష్ ‘ఆజాద్ హింద్ ప్రభుత్వం’ గురించి సింగపూర్‌లోని ఏ ప్రదేశంలో ప్రకటన చేశారనేది నజియాను అమితాబ్ అడిగిన రూ.7 కోట్ల ప్రశ్న. కేథలీ సినిమా హాల్, ఫోర్ట్ కానింగ్ పార్క్, సింగపూర్ జాతీయ యూనివర్సిటీ, సింగపూర్ జాతీయ గ్యాలరీ అనేవి ఆప్షన్లు. దీనికి సరైన సమాధానం.. కేథలీ సినిమాహాల్. క్విట్ కావడంపై నజియా మాట్లాడుతూ.. రూ.7 కోట్ల ప్రశ్న వద్ద క్విట్ అయినందుకు తాను బాధ పడట్లేదన్నారు. ఇప్పుడు గెల్చుకున్న కోటి రూపాయలు రాకపోయినా తనకు ఏ మాత్రం నిరాశ ఉండదన్నారు. వేదిక పైకి వెళ్లి తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నజియా పేర్కొన్నారు. నిజానికి తాను డబ్బు కోసం షోలో పాల్గొనలేదని, నన్ను అక్కడ చూడాలన్న తన తల్లి కోరిక నెరవేర్చడం కోసమే వెళ్లానన్నారు. తన తల్లి కోరిక తీర్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని నజియా తెలిపారు. (చదవండి: కేబీసీలో ప్రశ్న.. అమితాబ్‌పై కేసు) -
అందుకే డైరెక్టర్ పేరు వేయలేదు!
‘‘ఇంతకుముందు మోహమాటానికి కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. నాకు ఇష్టం అయితే సినిమా చేస్తాను. హీరోగా చేస్తా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తా, విలన్‌గా చేస్తా. డెస్టినీ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. హీరోగా మంచి హిట్స్ ఉన్నప్పుడు కూడా నటుడిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు ఇండస్ట్రీలో నేనున్న పొజిషన్‌కి హ్యాపీగానే ఉన్నాను’’ అన్నారు శ్రీకాంత్. శ్రీ మిత్ర చౌదరి సమర్పణలో శ్రీకాంత్, నాజియా హీరోహీరోయిన్లుగా విజి చెర్రీస్ విజన్స్ పతాకంపై విజయ్ నిర్మించిన ‘రా..రా’ చిత్రం ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో శ్రీకాంత్ చెప్పిన విశేషాలు... ► నా కెరీర్లో ‘రా..రా’ సినిమా 125మూవీ అనుకుంటున్నాను. తొలిసారి ఎంటర్టైన్మెంట్ మిక్సై ఉన్న హారర్ జోనర్‌ను టచ్ చేశాను. నిర్మాతలు నా మిత్రులే. అగ్రిమెంట్ పరంగా డైరెక్టర్‌కు, నిర్మాతలకు అభిప్రాయభేదాలు వచ్చాయి. అందుకే రిలీజ్ పోస్టర్‌పై దర్శకుని పేరు లేదు. సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేశాను. కుదర్లేదు. ఏ సినిమాకైనా నిర్మాత ముఖ్యమని నేను భావిస్తాను. కథ వేరే రచయిత అందించారు. ఒక పెద్ద పేరున్న డైరెక్టర్ ఈ సినిమాను టేకప్ చేశారు. పేరొద్దన్నారు. సినిమా హిటై్టనా, ఫ్లాప్ అయినా ఆయన పేరు చెప్పదలచుకోలేదు. ► కథ విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్‌గా ఉన్న నేను తెలియక దెయ్యాన్ని ప్రేమిస్తాను. అప్పుడు ఏం జరిగింది అనేది స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుంది. ఇందులో మూడు పాటలున్నాయి. ర్యాప్రాక్ షకీల్ మంచి సంగీతం అందించారు. సినిమా చూశాను. అవుట్‌పుట్ పట్ల ఫుల్ హ్యాపీ. ‘ఆపరేషన్– 2019’కి కూడా షకీల్‌నే స్వరకర్త. ► కృష్ణవంశీగారితో తప్పకుండా సినిమా ఉంటుంది. ఎప్పుడనేది చెప్పలేను. ఫెయిల్యూర్స్ వచ్చాయని స్నేహితులను దూరం చేసుకోను. ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో నేను నటించడానికి చర్చలు జరిగాయి. ప్రస్తుతానికైతే నేను చేయడం లేదు. నేను విలన్‌గా చేసిన ‘యుద్ధం శరణం’ సినిమా నిరాశపరిచింది. నిరుత్సాహపడ్డాను. ఆ తర్వాత కూడా విలన్‌గా ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయలేదు. ► హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్రభుదేవా ముఖ్య పాత్రలో రూపొందుతున్న సినిమాలో నా మూడో అబ్బాయి రోహన్ నటిస్తున్నాడు. కన్నడలో వేరే వాళ్లు కనిపిస్తారు. ఇప్పుడు షూటింగ్ కోసం రోహన్ ఊటీలో ఉన్నాడు. నేను, రోహన్ ఓ సినిమా చేయాల్సింది.. కుదర్లేదు. ► ప్రస్తుతం యాక్టింగ్‌లో డిప్లొమా చేస్తున్నాడు రోషన్. నెక్ట్స్ సినిమా చేయడానికి టు ఇయర్స్ టైమ్ పడుతుంది. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా రోషన్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యాక్టింగ్ మీద మరింత ఆసక్తి పెరిగింది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. స్పోర్ట్స్ బాగా ఆడుతోంది. ఎవరి డెస్టినీ ఎలా ఉంటుందో ముందే ఊహించలేం. ► ‘ఆపరేషన్ 2019’ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. కరణం బాజ్జీ దర్శకుడు. ఏ పార్టీని టార్గెట్ చేయడం లేదు. వివాదాలు తలెత్తకుండ తెరకెక్కిస్తున్నాం. ఇందులో హీరో మంచు మనోజ్ పోలీసాఫీసర్‌గా గెస్ట్ రోల్ చేయనున్నారు. కన్నడలో సుదీప్, శివరాజ్‌కుమార్ కలిసి నటిస్తున్న సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. కన్నడలో ఆఫర్స్ వచ్చాయి. కానీ టాలీవుడ్ నా ఇంట్రెస్ట్. -
సరికొత్త హారర్
శ్రీకాంత్ , నాజియా జంటగా విజీ చెర్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రా.. రా’. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్పై విజయ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘హారర్ జోనర్లో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇప్పటి వరకూ హారర్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినా ‘రా..రా’ సరికొత్తగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి సక్సెస్ ఇస్తుందనే నమ్మకం ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నాని, తరుణ్‌తో పాటు అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘అష్టా చమ్మా’ నుంచి శ్రీకాంత్‌గారితో నాకు మంచి పరిచయం ఉంది. నటుడిగా ఆయనేంటో అందరికీ తెలుసు. ఆయనకి ‘రా.. రా’ మరో పెద్ద హిట్ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో నాని. ‘‘శ్రీకాంత్‌గారితో 24 సంవత్సరాల అనుబంధం ఉంది. నా బ్రదర్‌లాంటి వ్యక్తి. ఆయన వంటి సీనియర్ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీమిత్ర చౌదరి. నిర్మాత విజయ్, సంగీత దర్శకుడు షకీల్, హీరో తరుణ్, నటులు అలీ, రఘుబాబు, నటి హేమ, నిర్మాత అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
దెయ్యాలు భయపడితే...
దెయ్యాలను చూసి మనుషులు భయపడటం కామన్. బట్ ఫర్ ఎ ఛేంజ్.. మనుషులను చూసి దెయ్యాలు భయపడితే? ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రా రా’. శ్రీకాంత్, నాజియా జంటగా విజి చరిష్ దర్శకత్వంలో విజయ్ నిర్మించిన ‘రా రా’ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘తొలిసారి నేను నటిస్తున్న హారర్ కామెడీ చిత్రమిది. కథ విన్నప్పుడే ఈ సినిమా బాగుంటుందనుకున్నా. హారర్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా కొత్తగా.. ఎంటర్టైనింగ్గా ఉండాలని ఈ సినిమా చేశాం. ఆర్టిస్టులు, ఖర్చు విషయంలో విజయ్, శ్రీమిత్ర చౌదరి రాజీ పడకుండా ఈ చిత్రం తీశారు. పాటలు, రీ– రికార్డింగ్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా విజయంపై వందశాతం నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ఈ సమావేశంలో విజి చరిష్, విజయ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్రాక్ షకీల్, కెమెరా: పూర్ణ, సమర్పణ: ఎంవీ చౌదరి. -
నీజతగా నేనుండాలి మూవీ స్టిల్స్