దెయ్యాలు భయపడితే... | Srikanth's Ra Ra Movie Press Meet | Sakshi
Sakshi News home page

దెయ్యాలు భయపడితే...

Published Tue, Jan 30 2018 12:33 AM | Last Updated on Tue, Jan 30 2018 12:33 AM

Srikanth's Ra Ra Movie Press Meet  - Sakshi

విజయ్, శ్రీకాంత్, విజి చరిష్‌

దెయ్యాలను చూసి మనుషులు భయపడటం కామన్‌. బట్‌ ఫర్‌ ఎ ఛేంజ్‌.. మనుషులను చూసి దెయ్యాలు భయపడితే? ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రా రా’. శ్రీకాంత్, నాజియా జంటగా విజి చరిష్‌ దర్శకత్వంలో విజయ్‌ నిర్మించిన ‘రా రా’ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘తొలిసారి నేను నటిస్తున్న హారర్‌ కామెడీ చిత్రమిది.

కథ విన్నప్పుడే ఈ సినిమా బాగుంటుందనుకున్నా. హారర్‌ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా కొత్తగా.. ఎంటర్‌టైనింగ్‌గా ఉండాలని ఈ సినిమా చేశాం. ఆర్టిస్టులు, ఖర్చు విషయంలో విజయ్, శ్రీమిత్ర చౌదరి రాజీ పడకుండా ఈ చిత్రం తీశారు. పాటలు, రీ– రికార్డింగ్‌ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా విజయంపై వందశాతం నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ఈ సమావేశంలో విజి చరిష్, విజయ్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్‌రాక్‌ షకీల్, కెమెరా: పూర్ణ, సమర్పణ: ఎంవీ చౌదరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement