రారా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది | Chiranjeevi unveils Srikanth's 'Ra Ra' motion poster | Sakshi
Sakshi News home page

రారా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది

Published Thu, Feb 16 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

రారా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది

రారా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది

‘‘నా తమ్ముడు శ్రీకాంత్‌ హీరోగా, సోదరుడు శ్రీమిత్ర చౌదరి, విజయ్‌ నిర్మించిన ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ చూశా. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా? అనే ఉత్సుకత కలిగింది’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. శ్రీకాంత్, నాజియా జంటగా విజి చరిష్‌ యూనిట్‌ దర్శకత్వంలో శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజయ్‌ నిర్మించిన చిత్రం ‘రారా’. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘దెయ్యాలకు, మనుషులకు మధ్య సాగే సరదా ఆటల కథాంశంతో తీసిన  చిత్రమిది.

చిన్న పిల్లలు కూడా ఈ సినిమా చూసి సంబరపడతారు. ఇందులో పలు ఆటలు కూడా ఉన్నాయని తెలిసి ఉత్సుకతకు గురయ్యా’’ అన్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘అన్నయ్య చిరు చేతులమీదుగా విడుదలైన ‘పెళ్ళిసందడి, ప్రేయసిరావే’  ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ‘రారా’ కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు విజయ్‌. శ్రీమిత్ర చౌదరి పాల్గొన్నారు. గిరిబాబు, సీత, నారాయణ, అలీ, రఘుబాబు, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్‌ రాక్‌ షకీల్, కెమెరా: పూర్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement