
Srikanth About Industrie Pedda: ప్రస్తుతం టాలీవుడ్‌లో టికెట్ల రేట్ల అంశంతో పాటు ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది కూడా హాట్‌టాపిక్‌గా మారింది. మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగింది. అయితే ఈ తర్వాత ఈ వ్యవహరం కాస్తా సద్దుమనిగింది. ఇక ఎన్నికల సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని, కానీ పరిశ్రమలోని కార్మికులకు, వ్యక్తులకు అవసరమైన సమయంలో తాను ముందుంటానని అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీ పెద్ద అంశంపై హీరో శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ‘బిగ్‌బాస్’ షోపై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఆయన నటించిన అఖండ మూవీ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారి ప్రతికథానాయకుడిగా కనిపించిన శ్రీకాంత్ తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మూవీ విశేషాలతో పాటు పరిశ్రమ పెద్ద అంశంపై కూడా స్పందించారు. ఈ మేరకు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన వరకు ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. ఎందుకుంటే ‘చాలా కాలంగా చిరంజీవి ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా కలిసేది చిరంజీవినే.
చదవండి: ఈ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్లతోపాటు సూపర్ గెస్ట్
ఆయనను కలిసి తమ సమస్యలు పరిష్కారించాలని కోరతారు. అలాగే అన్నయ్య(చిరంజీవి) కూడా వెంటనే స్పందించి వారి సమస్యలకు పరిష్కారం అందిస్తారు. అలాంటి ఆయనే దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద అనడంలో తప్పులేదు’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీకాంత్. అంతేగాక టికెటు రెట్ల అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుగా ఆహ్వానించింది చిరంజీవి గారినే.. దీన్ని బట్టి పరిశ్రమలో ఆయన స్థానం ఏంటన్నది అర్థమవుతోంది అన్నారు. కాగా ‘మా’ ఎన్నికల్లో శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే గెలిచిన ప్రకాశ్ ప్యానల్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విధితమే.