Near field communication
-
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..!
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్..! లావాదేవీలను మరింత సులువు చేస్తూ సరికొత్త పేమెంట్ పద్దతులను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. మొబైల్లో ఇంటర్నెట్ డేటా లేకుండా క్షణాల్లో లావాదేవీలను జరిపే ఫీచర్‌ను పేటీఎం తీసుకొచ్చింది. ట్యాప్ టూ పే... ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ‘ట్యాప్ టూ పే’ సేవలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో యూజర్లు సులువుగా మనీ ట్రాన్సక్షన్లను జరపవచ్చునని పేటీఎం తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు వారి పేటీఎం రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా పీఓఎస్ మెషీన్లో వారి ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పించనుంది. యూజర్ల ఫోన్ లాక్‌లో ఉన్న, లేదా మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా నగదు లావాదేవీలను పూర్తి చేయవచ్చును. ఈ సదుపాయం ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. వివరాలు బహిర్గతం కావు..! ట్యాప్ టు పే ఫీచర్లో భాగంగా...సెలెక్ట్‌డ్ డెబిట్ కార్డ్‌లోని 16-అంకెల ప్రైమరీ అకౌంట్ నంబర్‌ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా 'డిజిటల్ ఐడెంటిఫైయర్'గా మార్చనుంది. ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్‌లో యూజర్ల కార్డ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ వ్యక్తులతో బహిర్గతం కాదు. ఒక యూజర్ రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు...కార్డ్ వివరాలను బహిర్గతంచేయకుండా ఉండేందుకు పీఓఎస్ మెషిన్ దగ్గర ట్యాప్ చేసి పేమెంట్ చేయవచ్చును. రిటైల్ స్టోర్లలో వేగవంతమైన చెల్లింపు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటుగా, ఈ సదుపాయం పేటీఎం పీఒఎస్ పరికరాలతో పాటు ఇతర బ్యాంకుల పీఓఎస్ మెషీన్లకు కూడా వర్తించనుంది. తాజా ఫీచర్‌తో ఎన్ఎఫ్సీ(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) లావాదేవీలను కూడా జరపవచ్చును. చదవండి: ఈ బ్యాంకులు దివాలా తీయవ్ ! ఆర్బీఐ కీలక ప్రకటన -
డిజిటల్ టోకెన్‌తో చెల్లింపులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాం, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయిన గూగుల్ పే, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అత్యంత భద్రతతో డిజిటల్ టోకెన్‌తో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్షంగా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇచ్చే అవసరం లేకుండానే గూగుల్ పే ఆన్‌డ్రాయిడ్ యూజర్లు ఈ డిజిటల్ టోకెన్‌తో చెల్లింపులు జరపవచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్తోపాటు ఆన్లైన్ లావాదేవీలూ దీని ఆధారంగా సులువుగా పూర్తి చేయవచ్చని కంపెనీ సోమవారం ప్రకటించింది. 3డీ సెక్యూర్ సైట్స్‌కు రీడైరెక్ట్ చేయకుండానే ఓటీపీతో ఈ–కామర్స్ లావాదేవీలు జరుపవచ్చు. ప్రస్తుతం యాక్సిస్, ఎస్బీఐ కార్డుదారులు ఈ సేవలు పొందవచ్చు. పెరుగుతున్న కస్టమర్లకు భద్రతతో కూడిన చెల్లింపులకు కట్టుబడి ఉన్నామని గూగుల్ పే బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ తెలిపారు. మోసాలకు తావు లేకుండా డిజిటల్ టోకెన్ సాయపడుతుందని, కార్డు వివరాలు ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదని అన్నారు. గూగుల్ పే భాగస్వామ్యంతో తమ కస్టమర్లకు భద్రమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అందించేందుకు వీలైందని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు. -
వాచీ పట్టీతో పేమెంట్!
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నగదు రహిత లావాదేవీలదే చర్చే. ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డు, వ్యాలెట్లతో కాకుండా నగదు రహిత లావాదేవీలకు ఇంకో పద్ధతి కూడా ఉంది. దాన్నే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్ఎఫ్సీ) అంటారు. ఇది కూడా క్రెడిట్, డెబిట్ లేదా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే పనిచేస్తుంది గానీ... ఏ రకమైన స్వైపింగ్, టైపింగ్ అవసరం ఉండదు. మీరు చెల్లించాల్సిన బిల్లు కోసం స్వైపింగ్ యంత్రంపై మీ స్మార్ట్‌ఫోన్‌ను అలా ఉంచడం.. మీ పిన్ నంబర్ కొట్టేయడం... అంతే మీరు చేయాల్సింది. ఇప్పుడు ఫొటోలోని వాచీ సంగతి చూద్దాం. వాచీ మామూలుదే. దాని కింద ఉన్న నల్లటి ప్లాస్టిక్ పట్టీని చూశారా? అదీ వావ్ అనిపించే అంశం. సిడ్నీకి చెందిన స్టార్టప్ కంపెనీ ఇనామో తయారు చేసిన ఈ గాడ్జెట్ పేరు ‘కర్ల్’! ఇది ఎన్ఎఫ్సీ చిప్‌తో కూడిన పరికరం. వాటర్ ప్రూఫ్ కూడా. మీ కార్డు వివరాలను దీంట్లోకి జొప్పించేస్తే... ఎన్ఎఫ్సీ ఆధారిత పేమెంట్లు చేయడం సులువైపోతుంది. ఒకవేళ ఈ కర్ల్ ఎక్కడైనా పోగొట్టుకున్నామనుకోండి. లేదా ఎవరైనా చోరీ చేశారనుకోండి. ఫోన్ సిమ్‌ను లాక్ చేసినట్టుగానే దీన్ని పనిచేయకుండా చేయవచ్చు. త్వరలోనే ఈ ప్లాస్టిక్ పట్టీ ద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇనామో అంటోంది. మరో నెలలో అందుబాటులోకి రానున్న ఈ హైటెక్ గాడ్జెట్ ఖరీదు 20 ఆస్ట్రేలియన్ డాలర్లు (వెయ్యి రూపాయలు). నెలవారీ ఫీజులు అదనం.