necklesroad
-
నీరా కేఫ్‌కు భూమి పూజ చేయనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో నిర్మించనున్న నీరా కేఫ్ నిర్మాణ ప్రాంతానికి రేపు(గురువారం) మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు. నిర్మాణ స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వేల సంవత్సరాలుగా గీత వృత్తిని నమ్ముకున్న వారికి ఈ రోజు మంచి రోజు వచ్చిందన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతోనే నెక్లెస్ రోడ్డులో నీర స్టాల్‌ను నిర్మించబోతున్నామని తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ నీరా కేఫ్‌కు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. నీరా కేఫ్ అనేది గౌడ సోదరుల ఆత్మగౌరవారనికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తక్కువ మందితోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ ఈత, తాటి వనాలు అభివృద్ధి చేసి కుల వృత్తులను ఆదుకుంటామని చెప్పారు. కోకాపేటలో 150 కోట్ల రూపాయల విలువైన భూమిని సీఎం కేసీఆర్ గౌడ భవనానికి కేటాయించారని తెలిపారు. అన్ని కులాలను ప్రభుత్వం అదుకుంటుందని, కల్లు ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా గతంలో చిత్రీకరించారన్నారు. నీరా తాగటం వల్ల ప్రోటీన్ అందుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలు అన్ని కులాలకు అందుతున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి మండిపడ్డారు. -
హృదయం పదిలం..
ఖైరతాబాద్: మెరుగైన జీవనం గడిపేందుకు ప్రతీ ఒక్కరు జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని, నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గురువారం నెక్లెస్‌రోడ్డులో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. దీనిని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో సీఎస్ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శ్రీధర్ కస్తూరి, డాక్టర్ వై.వి.సుబ్బారెడ్డి, డాక్టర్ గణేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ రమాకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్షంలోనూ ఉత్సాహంగా..
సాక్షి, సిటీబ్యూరో :నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. హుస్సేన్ సాగర్‌తో పాటు నెక్లెస్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేశారు. ప్రధాన చెరువుల్లోనూ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.