Nenavat balunayak
-
దొండ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దఅడిశర్లపల్లి : రైతులు దొండ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. సోమవారం పీఏపల్లి మండలంలోని కోనమేకలవారిగూడెం స్టేజీ వద్ద ఏర్పాటు చేయనున్న దొండ మార్కెట్ స్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పీఏపల్లి మండలంలో కూరగాయల సాగు అత్యధికంగా ఉండడంతో మార్కెట్ ఏర్పాటు చేయాలని గతంలో మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిలకు విన్నవించినట్లు పేర్కొన్నారు. వెంటనే వారు స్పందించి మార్కెట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. దీంతో పాటు కొండమల్లేపల్లిలో రూ.కోటితో రిటైల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్కెట్లకు ఒకే సారి మంత్రులతో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జెడ్పీ చైర్మన్ వెంట ఎంపీపీ రాజమ్మనారాయణ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అలుగుబెల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ సరస్వతిపాండునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుక్కల గోవర్ధన్‌రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ కుశలయ్య, కోఆప్షన్ సభ్యుడు అక్బర్, రైతులు వెంకట్‌రెడ్డి, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం
నల్లగొండ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్ శిక్షణ కేంద్రంలో మధ్యాహ్నాం 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్ఆర్టీ డెరైక్టర్ జగన్నాథ్‌రెడ్డి, డీఈఓ ఎస్.విశ్వనాథ్‌రావు పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరిగింది. తొలుత కౌన్సెలింగ్‌లో స్పౌజ్ కేటగిరీ, ప్రత్యేక కేటగిరీల హెచ్ఎంలకు ప్రాధాన్యత కల్పించారు. ఎనిమిదేళ్ల సర్వీసు దాటిన హెచ్ఎంలు 399 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ కొనసాగించారు. కాగా బుధవారం స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలకు పదోన్నతి కల్పించనున్నారు. పదోన్నతి పొందే వారిలో ఎస్ఏలు 50 మంది వరకు ఉన్నారు. ఇదిలా ఉంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సీనియారిటీ తుది జాబితా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీంతోపాటు ఎస్జీటీలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా కుప్పులు తెప్పలుగా వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పడుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ దరఖాస్తు సమయంలో అనేక పొరపాట్లు దొర్లడంతో వాటిని సరిచేయడంతోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. 4,650 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వాటిల్లో తెలుగు మీడియానికి బదులు ఇంగ్లీషు మీడియం అని ఉపాధ్యాయులు ఆన్లైన్లో ఎంటర్ చేశారు. దీంతో వాటిని సరిచేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. మంగళవారం ప్రకటించాల్సిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను బుధవారం ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. సంఘాల సందడి... చాలాకాలం తర్వాత బదిలీల కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయా సంఘాల ఫ్లెక్సీలతో టీచర్లకు స్వాగతం పలికేవిధంగా ఏర్పాట్లు చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమ టిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు నర్సిరెడ్డి, ఎస్టీయూ, టీపీటీఎఫ్ నాయకులు జెల్లా చంద్రమౌళి, పన్నాల గోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
దేవరకొండ అభివృద్ధికి కృషి
కొండమల్లేపల్లి :దేవరకొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ మండల పరిధిలోని ముదిగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు కృష్ణా జలాలు అందించడానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం గ్రామంలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులు 23.75లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను వారు ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు జెడ్పీచైర్మన్, ఎమ్మెల్యేను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పర్తి సురేష్‌రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సీరాజ్‌ఖాన్, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ నర్యానాయక్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సత్యం, రవీందర్‌రెడ్డి, కొర్ర శంకర్‌నాయక్, కేశ్యానాయక్, కోట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.