దొండ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దఅడిశర్లపల్లి : రైతులు దొండ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. సోమవారం పీఏపల్లి మండలంలోని కోనమేకలవారిగూడెం స్టేజీ వద్ద ఏర్పాటు చేయనున్న దొండ మార్కెట్ స్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పీఏపల్లి మండలంలో కూరగాయల సాగు అత్యధికంగా ఉండడంతో మార్కెట్ ఏర్పాటు చేయాలని గతంలో మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిలకు విన్నవించినట్లు పేర్కొన్నారు. వెంటనే వారు స్పందించి మార్కెట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. దీంతో పాటు కొండమల్లేపల్లిలో రూ.కోటితో రిటైల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్కెట్లకు ఒకే సారి మంత్రులతో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జెడ్పీ చైర్మన్ వెంట ఎంపీపీ రాజమ్మనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు అలుగుబెల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ సరస్వతిపాండునాయక్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కుక్కల గోవర్ధన్‌రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ కుశలయ్య, కోఆప్షన్ సభ్యుడు అక్బర్, రైతులు వెంకట్‌రెడ్డి, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.