నల్లగొండ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్ శిక్షణ కేంద్రంలో మధ్యాహ్నాం 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్‌ఆర్‌టీ డెరైక్టర్ జగన్నాథ్‌రెడ్డి, డీఈఓ ఎస్.విశ్వనాథ్‌రావు పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరిగింది. తొలుత కౌన్సెలింగ్‌లో స్పౌజ్ కేటగిరీ, ప్రత్యేక కేటగిరీల హెచ్‌ఎంలకు ప్రాధాన్యత కల్పించారు. ఎనిమిదేళ్ల సర్వీసు దాటిన హెచ్‌ఎంలు 399 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ కొనసాగించారు. కాగా బుధవారం స్కూల్ అసిస్టెంట్‌లకు హెచ్‌ఎంలకు పదోన్నతి కల్పించనున్నారు.
పదోన్నతి పొందే వారిలో ఎస్‌ఏలు 50 మంది వరకు ఉన్నారు. ఇదిలా ఉంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సీనియారిటీ తుది జాబితా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీంతోపాటు ఎస్‌జీటీలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా కుప్పులు తెప్పలుగా వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పడుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ దరఖాస్తు సమయంలో అనేక పొరపాట్లు దొర్లడంతో వాటిని సరిచేయడంతోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. 4,650 మంది ఎస్‌జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వాటిల్లో తెలుగు మీడియానికి బదులు ఇంగ్లీషు మీడియం అని ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేశారు. దీంతో వాటిని సరిచేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. మంగళవారం ప్రకటించాల్సిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను బుధవారం ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.
సంఘాల సందడి...
చాలాకాలం తర్వాత బదిలీల కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయా సంఘాల ఫ్లెక్సీలతో టీచర్లకు స్వాగతం పలికేవిధంగా ఏర్పాట్లు చేశారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమ టిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు నర్సిరెడ్డి, ఎస్‌టీయూ, టీపీటీఎఫ్ నాయకులు జెల్లా చంద్రమౌళి, పన్నాల గోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం
Published Wed, Jul 8 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM
Advertisement