దేవరకొండ అభివృద్ధికి కృషి
కొండమల్లేపల్లి :దేవరకొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ మండల పరిధిలోని ముదిగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు కృష్ణా జలాలు అందించడానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
అనంతరం గ్రామంలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులు 23.75లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను వారు ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు జెడ్పీచైర్మన్, ఎమ్మెల్యేను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పర్తి సురేష్‌రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సీరాజ్‌ఖాన్, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ నర్యానాయక్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సత్యం, రవీందర్‌రెడ్డి, కొర్ర శంకర్‌నాయక్, కేశ్యానాయక్, కోట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.