Nenorakam
-
హిట్ ట్రాక్ ఎక్కేశావంటున్నారు
‘‘హిట్ ట్రాక్ ఎక్కేశావ్ సాయి. ఇప్పట్నుంచీ నీ అసలు సిసలైన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది చూడ’ని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు సాయిరామ్ శంకర్. ఆయన హీరోగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ శుక్రవారం విడుదలైంది. ఈ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని సాయిరామ్ శంకర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘చాలా రోజులుగా ఇంత మంచి హిట్ కోసం వెయిటింగ్. ప్రతి ఏరియా నుంచి సూపర్‌హిట్ టాక్ వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదిది. ఓ సందేశం ఇస్తూ, థియేటర్లలో చివరి వరకూ ఉత్కంఠగా కూర్చోబెట్టడమనేది ప్రేక్షకులకు నచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో నాకూ, శరత్‌కుమార్‌గారికి మధ్య వచ్చే సీన్లు వాళ్లకు బాగా నచ్చాయి. రిలీజ్‌కు ముందే అన్నయ్య (పూరి జగన్నాథ్)కు సినిమా చూపించా. ‘సెకండాఫ్ చాలా బాగుంది. ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించింది’ అన్నారాయన. ప్రేక్షకులూ అదే అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘డేంజర్’, ‘హాలో ప్రేమిస్తా’ వంటి థ్రిల్లర్స్, కొత్త తరహా చిత్రాలను సాయిరామ్ శంకర్ పదేళ్ల క్రితమే చేశారు. అటువంటి సినిమాలు చేయడం ప్రజెంట్ ట్రెండ్. ఆ సినిమాలను ఎర్లీగా చేశాననుకుంటున్నారా? అని సాయిరామ్ శంకర్‌ని అడగ్గా... ‘‘అంతే కదా! నా కెరీర్ ఎలా ఉండాలని నేననుకున్నానో అలాంటి ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ‘బంపర్ ఆఫర్’ తర్వాత సక్సెస్ జర్నీ కంటిన్యూ కావల్సింది. మధ్యలో చేసిన కొన్ని సినిమాల వల్ల కుదరలేదు. ఇకపై ట్రెండ్‌కి తగ్గట్టుండే సినిమాలు చేస్తా. ప్రస్తుతం చేస్తున్న ‘వాడు నేను కాదు’ ట్రెండీ సినిమానే. నాలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. రీజనబుల్ బడ్జెట్లో న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయాలనుంది’’ అన్నారు. -
ఆ రోజు చిరంజీవి అన్నమాట నిజమైంది!
‘‘చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ తెలుగులో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’లో విలన్‌గా చేశాక చిరుగారితో ‘తర్వాత సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వండి’ అనడిగా. ‘నువ్ హీరో అయిపోతావ్’ అన్నారు. అలాగే, హీరోనైపోయా. తమిళంలో హీరోగా బిజీ కావడం వల్ల తెలుగులో పెద్దగా ఛాన్సు లు రాలేదనుకుంట!’’ అన్నారు శరత్‌కుమార్. కొంత గ్యాప్ తర్వాత ఆయన చేసిన తెలుగు సినిమా ‘నేనో రకం’. రామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. శరత్‌కుమార్ చెప్పిన సంగతులు. ♦‘నేనో రకం’ వంటి మంచి ఛాన్సులొచ్చిన ప్రతిసారీ తెలుగులో నటించా. ఎమోషన్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథతో దర్శకుడు సుదర్శన్ ఈ సినిమా తీశారు. ప్రేమంటే ఏంటి? తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా అనేక విషయాలను సినిమాలో చర్చించాం. నా పాత్రతో పాటు హీరో రామ్‌శంకర్ పాత్రను బాగా డిజైన్ చేశారు. నాతో పోటాపోటీగా రామ్‌శంకర్ నటించాడు. సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ♦∙చిరంజీవిగారంటే ప్రత్యేకమైన అభిమానం. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా నిర్మించాలనుకున్నా. మీ రెమ్యునరేషన్ ఎంతని ఆయన్ను అడగ్గా.. ‘నువ్ నాకు డబ్బులిస్తావా! నువ్వు హెల్ప్ అడిగావ్. ముందు సినిమా, మిగతావన్నీ తర్వాత చూసుకుందాం’ అన్నారు. అప్పుడు సినిమా చేయలేకపోయా. కానీ, ఆయనిచ్చిన ధైర్యం మర్చిపోలేను. ‘ఖైదీ నంబర్ 150’లో చిన్న పాత్రైనా చేస్తానని చిరు, వినాయక్‌లను అడిగా. కానీ, కుదరలేదు. అన్నయ్యతో నటించే ఛాన్స్ వస్తే నేనెప్పుడైనా రెడీ. ♦ మా అమ్మాయి వరలక్ష్మి ఒకడి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి చెప్పిన విషయాలు వింటే వాడెంత నీచుడో తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో స్త్రీలకూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరి కాదు. ♦ నా వందో చిత్రానికి నేనే దర్శకత్వం వహించా. కానీ, దర్శకత్వం అంత ఈజీ కాదు. ప్రతి క్రాఫ్ట్‌ను దగ్గరుండి చూసు కోవాలి. ప్రస్తుతం నాకంత టైమ్ లేదు. ఇప్పటివరకూ 140 సినిమాల్లో నటించా. ఇప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనుంది. ఉదాహరణకు... హిందీలో అమితాబ్ చేస్తున్న పాత్రలు లేదా ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర వంటివి. నిర్మాతగా విజయ్ ఆంటోనితో ఒకటి, జీవీ ప్రకాశ్‌తో మరొక సినిమా చేస్తున్నా. -
కొత్త రకం...
‘‘సగటు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ మెచ్చే, అందర్నీ ఆలోచింపజేసే సినిమా తీయాలనేది నా లక్ష్యం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ రెడ్డి. రామ్‌శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ ఈ నెల 17న రిలీజవుతోంది. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సుదర్శన్ నా స్నేహితుడే. కాంటెంపరరీ ఇష్యూ స్ఫూర్తితో కథ రెడీ చేశాడు. కంటెంట్ పరంగా, కమర్షియల్‌గా డెప్త్ ఉన్న ఈ కథ విని ఆర్టిస్టులందరూ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. కథ, కథనం హైలెట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. అదే విధంగా కమర్షియల్ సినిమాల్లో ఇదో కొత్త రకం అనే టాక్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
ఈ సినిమాతో హిట్ గ్యారంటీ
– పూరి జగన్నాథ్ ‘‘నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్ శంకర్‌కు హిట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది. మహిత్ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రం నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను పూరి జగన్నా«థ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో గోపీచంద్ విడుదల చేసి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కథ నచ్చడంతోనే శరత్ కుమార్ ఈ సినిమా చేశారు. మహిత్ పాటలు, రీ–రికార్డింగ్ హైలెట్. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్‌ను ‘నేనో రకం’ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘రామ్ శంకర్ కెరీర్లో ‘నేనో రకం’ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మార్చి 17న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. రామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు’’ అన్నారు.