breaking news
Nephrotic syndrome
-
డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం
డయాబెటిస్ (మధుమేహం) అంటే కేవలం రక్తంలో చక్కెర మోతాదులు పెరగడం మాత్రమే కాదు. అది దేహంలోని అనేక అవయవాలను నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదకారి. డయాబెటిస్ వల్ల మిగిలిన అన్ని అవయవాల్లో కన్నా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలెక్కువ. ఎంత ఎక్కువ అంటే... డయాబెటిస్తో బాధపడే వ్యక్తులలో 60% మందికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా ఆ సమస్య తారస్థాయికి చేరే వరకూ చాలామందికి ఆ విషయం తెలియనే తెలియదు. ఇలా చాపకింద నీరులా నిశ్శబ్దంగా పెరుగుతూపోయే డయాబెటిక్ నెఫ్రోపతీ అనే ఈ కిడ్నీల వ్యాధి కారణంగా వచ్చే అనర్థాలూ, లక్షణాలూ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం...ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే డయాబెటిస్‌తోపాటు దానివల్ల కలిగే అనర్థాలు పెరిగిపోయాయి. టైప్ 1 అలాగే టైప్ 2... ఈ రెండు రకాల డయాబెటిస్‌లూ నెఫ్రోపతీకి దారితీస్తాయి, అయితే ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉండటం వల్ల చాలా కేసుల్లో కిడ్నీ పనిచేయకపోడానికి ఇదే కారణం. పైగా కిడ్నీ దాదాపుగా దెబ్బతిని పూర్తిగా పనిచేయకుండా పోయేవరకు చాలామందికి ఈ విషయం తెలియనే తెలియదు. డయాబెటిస్తో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయంటే... కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడ΄ోస్తూ, అందులోని వ్యర్థాలూ, విషపదార్థాలను తొలగిస్తూ, వాటిని మూత్రం ద్వారా బయటకు ΄ోయేలా చేస్తుంటాయి. రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉన్నకొద్దీ కిడ్నీలోని అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా వాటి వడ΄ోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. ఒకనాటికి కిడ్నీ పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. దాంతో జీవితాంతం డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయమే ఉండదు.ముందుగానే గుర్తించడం ఇలా... డయాబెటిక్ నెఫ్రోపతికి చికిత్స చేసి మళ్లీ మొదటిలా కిడ్నీని పనిచేయించడం అసాధ్యం. అంటే దీనిని రివర్స్ చేయలేమని అర్థం. పైగా దాదాపుగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు దీని లక్షణాలు కనిపించవు. అందుకే నిశ్శబ్దంగా వృద్ధిచెందే ఈ వ్యాధిని తెలుసుకోడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తుండటం అవసరం.ఇవీ వైద్యపరీక్షలు... మైక్రో అల్బుమిన్ మూత్ర పరీక్ష : ఈ పరీక్షతో మూత్రంలో కొద్ది మొత్తంలోనైనా లీక్ అవుతుండే ప్రోటీన్ (అల్బుమిన్)ను గుర్తించవచ్చు. కిడ్నీ దెబ్బతినడంలో ఇది తొలి దశ. సీరం క్రియాటినిన్ అండ్ ఈ–జీఆర్ఎఫ్ (ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్) : ఈ పరీక్షతో కిడ్నీ వడ΄ోత సామర్థ్యాన్ని కొలవవచ్చు. ఈ–జీఆర్ఎఫ్ తగ్గడం అంటే అది కిడ్నీ పనితీరు తగ్గడానికి ఒక సూచన.రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుండటం : హైబీపీ అన్నది కిడ్నీ దెబ్బతినే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండటం, మందులతో అదుపులో పెట్టుకోవడం అవసరం. వార్షిక ఆరోగ్య పరీక్షలు: మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఎక్కువగా డయాబెటిస్తో బాధపడుతున్న ఆరోగ్య చరిత్ర ఉన్నవారు ప్రతి ఏడాదీ వార్షిక పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం. ఎందుకంటే ఈ డయాబెటిస్ ఏ అవయవంపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఎవరికీ తెలియదు. అందుకే డయాబెటిస్తో బాధపడే ప్రతి ఒక్కరూ ఇలా ప్రతి ఏడాది అన్ని రకాల వైద్యపరీక్షలూ చేయించుకోవడం మేలు.ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్‌కి చికిత్సలిలా:కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ సామర్థ్యం పూర్తిగా తగ్గినట్లయితే, మూత్రపిండాల మార్పిడి చికిత్స (రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ) అవసరం డయాలసిస్: ఈ ప్రక్రియ ద్వారా రక్తంలోని వ్యర్థాలనూ, విషాలతో కూడిన ద్రవాలను తొలగిస్తారు హీమో–డయాలసిస్: శరీరం వెలుపల అమర్చే యంత్రంతో వారానికి పలు మార్లు రక్తాన్ని వడ΄ోయడం పెరిటోనియల్ డయాలసిస్: కడుపులోని పెరిటోనియమ్ అనే పొరలో అమర్చే క్యాథటర్ (గొట్టం లాంటి పరికరం) సహాయంతో దేహంలోని వ్యర్థాలూ, విషాలను వడపోయడం చివరగా కిడ్నీ మార్పిడి చికిత్స : చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన లేదా బతికే ఉన్న దగ్గరి బంధువైన దాత నుంచి తీసుకున్న కిడ్నీని బాధితులకు అమర్చేందుకు చేసే శస్త్రచికిత్స ఇది ∙ఇక టైప్ 1 మధుమేహంతో బాధపడే బాధితులకు కిడ్నీ–ప్రాంక్రియాస్ మార్పిడి చికిత్స కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు.మేనేజ్మెంట్ : పరిస్థితి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకూడదనుకునే బాధితులు ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన మందులు వాడుతూ, తమ బీపీ, చక్కెర మోతాదులు అదుపులో ఉండేలా చూసుకోవాలి.చివరగా... డయాబెటిక్ నెఫ్రోపతీ అనేది రివర్స్ చేయలేని తీవ్రమైన వేదన కలిగించే పరిస్థితి. డయాబెటిస్‌ను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులను క్రమశిక్షణతో అవలంబించడం, డాక్టర్ సూచనలను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలతో చాలా ఖర్చుతో కూడినవీ లేదా బాధించేవైన డయాలసిస్, కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని అవగాహన పెంచుకోవడమన్నది అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి. మొదటి, రెండో దశల్లో... జీవనశైలిలో మార్పులు:రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడం ( గ్లైసీమిక్ కంట్రోల్) : రక్తంలోని చక్కెర మోతాదులను పరిమిత స్థాయిలోనే ఉండేలా చూసేందుకు కొన్ని మందులు అవసరమైన వారికి ఇన్సులిన్ వంటివి ఇవ్వడం. రక్తపోటును అదుపు చేయడం (బీపీ కంట్రోల్) : ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ) ఇన్హిబిటర్స్ లేదా ఏంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ సహాయంతో బీపీని 130 / 80 అనే కొలతకంటే తక్కువగా ఉండేలా మందులివ్వడం ఆహారంలో మార్పులు : తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదులు తగ్గించడం అలాగే ్ర΄ోటీన్ నియంత్రిత స్థాయిలోనే ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వంటి జాగ్రత్తలు క్రమ తప్పకుండా చేసే వ్యాయామలు : బరువును ఆరోగ్యకరమైన పరిమితిలోనే ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం దురలవాట్లకు దూరంగా ఉండటం : పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం.డయాబెటిక్ నెఫ్రోపతీ లక్షణాలు సాధారణంగా డయాబెటిక్ నెఫ్రోపతీ తాలూకు మొదటి దశల్లో గుర్తించదగిన లక్షణాలేవీ కనిపించవు. అయితే జబ్బు పెరుగుతున్నకొద్దీ ఈ కింద పేర్కొన్న లక్షణాలూ, సూచనలూ కనిపించవచ్చు పాదాలు, చీలమండలు లేదా కళ్ల చుట్టూ ఉబ్బు లేదా వాపు (కిడ్నీల పనితీరు తగ్గడంతో దేహంలోని నీరు బయటకు పోలేకపోవడవంతో ఈ ఉబ్బు / వాపు కనిపిస్తుంది) అలసట, నీరసం, నిస్సత్తువ, బలహీనతఆకలి లేకపఓవడం లేదా వికారం మరీ ఎక్కువగాగానీ లేదా తక్కువగాగానీ జరిగే మూత్ర విసర్జన నురుగుతో కూడిన మూత్రం (ప్రోటీన్ నష్టం వల్ల)నిరంతరం అధిక రక్తపోటు (కన్సిస్టెంట్గా హైబీపీ)శ్వాస ఆడకపోవడం (దేహంలోని నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల) ఈ లక్షణాలను గమనించినట్లయితే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.డయాబెటిక్ నెఫ్రోపతి చికిత్సలుదీనికి నిర్దిష్టంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగానూ, వ్యక్తిగతంగానూ (పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్) చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సల ద్వారా కిడ్నీ దెబ్బతినడం మరింత వేగంగా జరగకుండా చూడటంతోపాటు అప్పటికే దెబ్బతిన్నందున ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా చేస్తారు.ఇవీ వాడాల్సిన మందులు ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్లు (ఉదాహరణకు, డపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్); అలాగే జీఎల్పీ – 1 రిసెప్టర్ అగోనిస్ట్‌లు (ఉదాహరణకు లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్) అనేవి టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న బాధితుల్లో కిడ్నీ వ్యాధి మరింత వేగంగా పురోగమించకుండా చూడటంతోపాటు గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గించడానికి ఉపయోగించే కొత్త మందులివి ఫైనెరెనోన్ (కెరెండియా) అనేది ఒక నాన్–స్టెరాయిడల్ మినరలో కార్టికాయిడ్ రిసెప్టర్ యాంటాగనిస్ట్ డ్రగ్. కిడ్నీ వైఫల్యమూ అలాగే గుండె సంబంధిత జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడానికి వాడే మందు అధిక కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడానికి స్టాట అనే మందులు. డాక్టర్ గంధె శ్రీధర్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 55 ఏళ్లు. ఏడాది కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి ఒక స్టెంట్ వేశారు. కొన్ని నెలల పాటు బాగానే ఉన్నారు. సాయంత్రాల పూట అలా వాకింగ్‌కు కూడా వెళ్లి వచ్చేవారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్రమైన ఆయాసానికి గురవుతున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ లో పూడికలు ఏర్పడ్డాయని, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు, షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? రిస్కేమైనా ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు. - సురేశ్, హైదరాబాద్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) వస్తే బైపాస్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకటి లేదా రెండు బ్లాక్స్ ఏర్పడితే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేయవచ్చు. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే మొదట్లో మీ నాన్నగారికి అలానే వేశారు. అయితే ఈసారి మీ నాన్నగారి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడినట్లు పరీక్షల ద్వారా తేలి ఉండవచ్చు. అందుకే డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించి ఉంటారు. ఇక మీ సందేహాల విషయానికి వస్తే మీరు మీ నాన్నగారి విషయంలో ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా బైపాస్ సర్జరీ 50 ఏళ్లు దాటిన వాళ్లకి, అది కూడా గుండె స్థితిని బట్టి డాక్టర్లు నిర్వహిస్తుంటారు. ఒకప్పటిలాగా ఇప్పుడు గుండెకు సంబంధించిన ఆపరేషన్ అంటే కలవరడాల్సిన అవసరం లేదు. వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే నిపుణులైన డాక్టర్లు కూడా ఉన్నారు. అందులో భాగంగానే ‘మినిమల్లీ ఇన్వేజివ్’ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా ఛాతీ ఎముకలను కట్ చేయకుండానే కేవలం చిన్నకోత ద్వారా గుండె బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించవచ్చు. ఈ పద్ధతిలో వైద్యులు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్సలను సులువుగా, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సర్జరీ సమయంలో గుండెను బయటకు తీసి దానికి బదులుగా ఒక మెషిన్‌ను కొన్ని గంటల పాటు రక్తం పంపింగ్ కోసం సపోర్టుగా వాడుకుంటారు. వాల్వ్‌లలో ఏర్పడిన పూడికలను తీసివేసిన అనంతరం మళ్లీ గుండెను యధాస్థానంలో విజయవంతంగా అమర్చి ఆపరేషన్‌ను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కోత చిన్నగా, రక్తస్రావం తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా పెద్దగా ఉండదు. ఇన్ఫెక్షన్ కూడా సోకదు. 3 - 4 రోజుల్లో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేస్తారు. ఇక మీ నాన్నగారి బీపీ, షుగర్ లెవల్స్ విషయానికి వస్తే... సర్జరీకి ముందే డాక్టర్లు అన్ని పరీక్షలను నిర్వహిస్తారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకునే ఆపరేషన్‌కు ఉపక్రమించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి మంచి ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్సను అందించండి. - డాక్టర్ ఆరుముగమ్ సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రోటిక్ సిండ్రోమ్‌కు మందులు చెప్పండి... ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత 20 ఏళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. మందులు వాడతున్నాను. అదుపులో ఉంది. ప్రస్తుతం వారం రోజుల క్రితం జ్వరం వచ్చి మూడు రోజులుగా బాధపడ్డాను. అది తగ్గి ఒళ్లంతా వాపులు, ముఖం ఉబ్బిపోవడం జరిగింది. అన్ని పరీక్షలూ చేసి డాక్టర్లు ‘నెఫ్రోటిక్ సిండ్రోమ్’ అన్నారు. దీన్ని సంపూర్ణంగా పోగొట్టడానికి ఆయుర్వేద చికిత్స తెలపండి. - యు.వి. కృష్ణమూర్తి, బెంగళూరు ఆయుర్వేద పరిభోషలో వాపుని ‘శోథ’ అంటారు. మీకు సర్వాంగశోథ వచ్చింది. మూత్రాపిండాలు ‘నెఫ్రానులు’ అనే అతిన్న పరికరాల సముదాయంతో తయారవుతాయి. ఇవి రక్తాన్ని వడగట్టడం ద్వారా మూత్రాన్ని తయారు చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కారణాల వల్ల నెఫ్రానుల్లో గొట్టాలు బలహీనపడి, అతి ముఖ్యమైన, శరీరానికి బలాన్ని సమకూర్చే ప్రోటీన్లను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. దీనివల్ల ఒళ్లంతా వాపు, రక్తహీనత, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రుగ్మతకు కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, విషాలు, హెవీమెటల్స్, అలర్జీ కలిగించే పదార్థాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కారణమవుతాయి. ఈ కింద వివరించిన విధంగా ఆహార విహారాలు పాటించి, మందులను క్రమం తప్పకుండా వాడితే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు, రెండు వారాల పాటు పాటించాల్సినవి... ఆహారం : ఉప్పుని 95 శాతం తగ్గించి, నామమాత్రంగా వేసి, జావలు (బార్లీ జావ, బొంబే రవ్వ జావ మొదలైనవి) తయారు చేసుకొని మూడుపూటలా తాగాలి. కేవలం మెత్తగా చేసిన పెరుగన్నం తినండి. నిమ్మరసం పిండిన మజ్జిగను పుష్కలంగా తాగండి. ఇడ్లీని తేనెతో రోజూ తినండి. పెసరకట్టు, కందికట్టు పలచగా చేసుకొని, పుల్కాలను వాటిలో నానబెట్టి తినండి. ఖర్జూరం తినండి, (డయాబెటిస్, రక్తపోటులను మాత్రం నియంత్రించుకోవాలి). విహారం : పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లోనే అటు ఇటు తిరుగుతుండండి. భారీ పనులు చేయవద్దు. తగినంత నిద్ర, మానసిక స్థైర్యం ఉండాలి. మందులు : కోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ( వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం 1, మధ్యాహ్నం 2, రాత్రి 1 (వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, రాత్రి 1 యష్టిమధు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 (మొదటి వారం); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (రెండు వారాలు) వరుణాది క్వాధ (ద్రావకం) : 4 చెంచాలు రెండుపూటలా సమానంగా నీళ్లు కలిపి. రెండు వారాల తర్వాత : యష్టిమధుచూర్ణ 2 గ్రాములు + గోక్షురాది చూర్ణం 3 గ్రాములు - కలిపి ఒక మోతాదుగా తేనెతో తీసుకోవాలి. రోజూ రెండు మోతాదులు మూడు నెలల పాటు వాడండి. రోజూ ఒక ఉసిరికాయ తినండి లేదా ఆమలకీ స్వరసం రెండు చెంచాలు సేవించండి. గమనిక : వ్యాధి కారణాలను గుర్తుంచుకొని జాగ్రత్త వహించండి. బలకరమైన, మూత్రం సాఫీగా వెళ్లడానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోండి. సహజసిద్ధమైన పానీయాలను (మజ్జిగ, నీరు, బార్లీజావ, అప్పుడప్పుడు చెరకురసం, కొబ్బరినీళ్లు సముచితమైన పరిమాణంలో సేవించండి. నెఫ్రానులకు సంబంధించిన గొట్టాలు తిరిగి ప్రాకృతావస్థకు వస్తాయి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్


