యువతిని వేధిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్: మద్యం మత్తులో యువతిని వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... నేరేడ్మెట్ క్రాస్‌రోడ్డులో సిగ్నల్ క్రాస్ వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ యువతి (18)ని ఇద్దరు వ్యక్తులు వేధించటం అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు గమనించాడు. దీంతో సదరు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.