nerella anjaneyulu
-
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): ఉమ్మడి నిజామా బాద్‌లో ఎల్లారెడ్డి అ సెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలు పొందిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఉన్నత పదవులు నిర్వర్తించారు. 1962లో ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం మొదట కామారెడ్డితో కలిసి ఉమ్మడి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఈ స్థానం ఎస్సీకి రిజర్వు చేయబడింది. 1962లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి టి.ఎన్.సదాలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి పోటీచేసి గెలుపొందిన టి.ఎన్.సదాలక్ష్మి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం 1967, 1972లలో జరిగిన వరుస ఎన్నికల్లో ప్రస్తుత మాజీమంత్రి గీతారెడ్డి తల్లి జెట్టి ఈశ్వరీబాయి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బరిలోకి దిగిన ఈశ్వరీబాయి 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ రోజుల్లోనే ఈశ్వరీబాయి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి(ఎస్టీఎస్) పార్టీని ఆమె స్థాపించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీఎస్ తరపున ఈశ్వరీబాయి, కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఈశ్వరీబాయి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనాటి రాష్ట్రశాసనసభ ప్రతిపక్ష నాయకులలో ప్రముఖ నాయకులైన తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, జి.శివయ్యగార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. 1978లో ఎస్సీ రిజర్వ్డ్ 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్‌కు మారడంతో నియోజకవర్గ పరిధిలోని లింగంపేట మండలం అయిలాపూర్‌కు చెందిన తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన అప్పటి ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి కేబినెట్లలో చక్కెర పరిశ్రమశాఖ మంత్రిగా, రోడ్లుృభవనాలశాఖ మంత్రిగా కొనసాగారు. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం బాలాగౌడ్ నిజామాబాద్ పార్లమెంట్‌స్థానం నుంచి రెండుసార్లు పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగా రు. నేరెళ్ల హ్యాట్రిక్ 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గాంధారి వాస్తవ్యులు నేరేళ్ల ఆం జనేయులు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994, 1999ల లో వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీచేసిన నేరేళ్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వరుసగా మూ డుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన నేతగా పేరొందారు. వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన నేరేళ్ల ఆంజనేయులు 1998లో ప్రభుత్వవిప్‌గా కొనసాగారు. 2001లో రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఇ లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్న త పదవులను అధిరోహించి జిల్లాలో ఎల్లారెడ్డి ప్రత్యేకతను చాటారు. -
కాంగ్రెస్‌కు జనార్దన్‌గౌడ్ రాజీనామా
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ టికెట్ కేటాయింపులో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఆరు మండలాల కార్యకర్తలతో కలిసి తీసుకున్న నిర్ణయంగా వారు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అధిష్టానం పెద్దలు నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తున్నారని, అభివృద్ధి నిధులు సైతం పక్క మండలాల నాయకులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఆయన హయాంలోనే వచ్చిన నిధులు తప్ప అటు తరువాత మంజూరు కాలేదన్నారు. 2010 ఉప ఎన్నికల్లో సైతం స్థానికులకు టికెట్ ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. నాటి నుంచి ప్రారంభమైన వివక్ష ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా బయటపడిందన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, కామారెడ్డికి చెందిన నాయకునితో కలిసి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రావాల్సిన నిధులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో కేవలం 38 లక్షలు మాత్రమే నియోజకవర్గానికి ఎంపీ నిధులు మంజూరు చేశారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి పాటుపడిన ఎందరో సీనియర్లు ఉండగా కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ విషయమై ఈనెల 7న ఆరు మండలాల నాయకులతో కలిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అధిష్టానం గుర్తించలేదన్నారు. దీంతో కార్యకర్తలంతా కలిసి తీసకున్న నిర్ణయానుసారం పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు రాజీనామా చేసినవ వారిలో మాజీ మంత్రి నేరేళ్ల అంజనేయులు, డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, వైఎస్ చెర్మైన్ శ్రీనివాసరెడ్డితో పాటు 13 మంది డెరైక్టర్లు, షాదీఖానా చెర్మైన్ ఇబాదుల్లా, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల అధ్యక్షుడు శ్రీనివాస్ జోషి, శ్రీధర్‌గౌడ్, ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ పప్పువెంకటేశం, నాయకులు కృష్ణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, హబీబ్, ప్రతాప్‌గౌడ్, రఘువీర్‌గౌడ్, రాంమోహన్, విఠల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మురళి, బాలయ్యతో పాటు 100 మంది కార్యకర్తలు ఉన్నారు.