new airports
-
కొత్త ఎయిర్‌పోర్టులపై త్వరలో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఆరు కొత్త విమానాశ్రయాలకు సంబంధించి మరో వారం పదిరోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఆయా ప్రాజెక్టులకు కన్సల్టెంటుగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. విమానాశ్రయాల ప్రాథమిక స్వరూపాన్ని వివరించనుంది. ఈ సంస్థ గత జూన్‌లోనే వీటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల (టెక్నో ఎకనమిక్ ఫీజబిలిటీ) నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ఆరు విమానాశ్రయాలకు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను వివరించడంతో పాటు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించనుంది. దీంతో వీటికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తి అవుతుంది. ఆ తర్వాత నిర్మాణానికి సంబంధించిన అసలు ప్రక్రియ మొదలు కానుంది. అనుమానాల నివృత్తి.. అంచనా వ్యయంపై స్పష్టత ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే మొత్తం రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుదిక్కులా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నివేదిక కోరుతూ కన్సల్టెన్సీ బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వాణిజ్య విభాగానికి అప్పగించింది. దాని ప్రతినిధులు పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించ (బ్రౌన్‌ఫీల్డ్) వచ్చని తెలిపారు. వాటితో పాటు నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను ప్రతిపాదించారు. వీటన్నిటిలో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యమేనని తేల్చి ప్రాథమిక నివేదిక అందజేశారు. ఆ తర్వాత వాటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలు, కావాల్సిన భూమి వివరాలు, ఆయా విమానాశ్రయాల నిర్మాణం జరగాలంటే తీసుకోవాల్సిన చర్యలతో ఫీజబిలిటీ రిపోర్టును అందజేశారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాలకు సంబంధించి ఫేజ్–1, ఫేజ్–2 పేరుతో రెండు వేరువేరు అంచనాలను అందజేశారు. ఫేజ్–1 ప్రకారం రూ.1,350 కోట్లు, ఫేజ్–2 ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయం కానుంది. ఇక భూసేకరణకు ఇంతకు మించి ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గింపునకు సంబంధించి ఇప్పుడు జరగబోయే సమావేశంతో స్పష్టత రానుంది. ఇక పాల్వంచ, దేవరకద్ర, బసంత్‌నగర్ విమానాశ్రయాలకు సంబంధించి ఫీజబిలిటీ నివేదిక అస్పష్టంగా ఉంది. వీటిపైనా స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ రెండూ జీఎంఆర్‌కు..! ఆరు విమానాశ్రయాలను నిర్మిస్తామని, వెంటనే అనుమతి మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా విమానయాన శాఖను కోరారు. కానీ ప్రస్తుతం వ్యయ అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో రెండుమూడు ముందు చేపట్టి మిగతావి తర్వాత చేపడితే ఎలా ఉంటుందన్న విషయంలోనూ కొంత చర్చ జరుగుతోంది. దీనిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. మరోవైపు ఇప్పటికే మనుగడలో ఉన్న విమానాశ్రయానికి 150 కి.మీ. పరిధిలో రెండోది ఉండొద్దనే ఒక నిబంధన ఉంది. జీఎంఆర్ సంస్థ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఆ నిబంధన ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చనే అంశంపై కూడా సమావేశంలో సూచనలు అందే అవకాశం ఉంది. ఆ రెంటినీ జీఎంఆర్‌కు అప్పగించే అంశాన్ని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
గగనయానం దిశగా తెలంగాణ
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాల పరిశీలనలో భాగంగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సాంకేతిక విభాగం బృందాలు పలు దఫాలుగా ఆయా ప్రాంతాలు సందర్శించి సానుకూల నివేదికను అందించాయి. ఏడాదిగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలను తేల్చేందుకు చేస్తున్న కరసత్తును కొలిక్కి తెచ్చిన సాంకేతిక విభాగం.. ఈ మేరకు నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారుపై భారమే.. చిన్న పట్టణాల ప్రజలకు విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఉడాన్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. తొలుత కొన్ని పట్టణాలలో నిర్మించే విమానాశ్రయాల ఖర్చులో కొంత భరించేందుకు కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి తాజా అంచనా ప్రకారం భారీ వ్యయమే కానుంది. ఇక భూసేకరణకు అంతకంటే ఎక్కువ ఖర్చు కానుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథా రిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. టెక్నో ఎకనమిక్ ఫీజబిలిటీ రిపోర్టులో భాగంగా, తాజాగా విమానాశ్రయాలకు కావాల్సిన భూమి, అంచనా వ్యయంతో కూడిన తుది నివేదికను ఖరారు చేసింది. రెండురోజుల క్రితం ఆ వివరాలను తెలం గాణ ప్రభుత్వాని కి అందజేసింది. ఈ ఆరు విమానాశ్రయాల ఏర్పా టు సాధ్యమేనని సంస్థ టెక్నికల్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించగా, తాజా నివేదిక నేపథ్యంలో.. తుది అనుమతులకు సంబంధిం చిన సర్వే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నివేదిక ఆధారంగా చేయాల్సిన ఖర్చు, సమీకరించాల్సిన భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని పౌర విమానయాన శాఖకు అంగీకారం తెలిపితే, తుది అనుమతులకు సంబంధించిన సర్వే పనులు మొదలవుతాయి. ప్రతిపాదిత విమానాశ్రయాల్లో వేటికి తుది అనుమతులు ఇవ్వాలన్న విషయం ఆ సర్వేతో ఖరారవుతుంది. ఆ వెంటనే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుంది. ఎక్కడెక్కడ? నిజాం హయాంలో సేవలందించిన వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని దాదాపు 15 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు ఆ విమానాశ్రయంతో పాటు మరో ఐదు చోట్ల కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. మామునూరుతో పాటు ఆదిలాబాద్‌లో, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించాలని, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీ సేవలు అందించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరగా అంగీకరించింది. ఈ మేరకు సానుకూల నివేదిక ఇచ్చిన సంస్థ సాంకేతిక విభాగం.. తాజాగా అంచనా వ్యయం, కావాల్సిన భూముల వివరాలతో నివేదికను రాష్ట్రానికి అందించింది. ఫేజ్–1, 2 నివేదికలో ఫేజ్–1, ఫేజ్–2 పేరుతో సంస్థ వివరాలు పొందుపరిచింది. 40–50 సీట్ల సామర్ధ్యం ఉండే చిన్న విమానాల కోసం ఫేజ్–1 ప్రణాళిక రూపొందించింది. ఇవి పూర్తిగా డొమెస్టిక్ (దేశీయ) విమానాశ్రయాలుగా మాత్రమే ఉంటాయి. ఇతర వసతులు కూడా సాధారణంగా ఉంటాయి. వీటి వ్యయం కొంత తక్కువగా ఉంటుంది. భూమి అవసరం కూడా కొంత తక్కువే. ఇక అంతర్జాతీయ విమానాలు, బోయింగ్ విమానాల కోసం అదనపు హంగులతో నిర్మించే విమానాశ్రయాల కోసం ఫేజ్–2 ప్రణాళిక రూపొందించింది. వీటి వ్యయం కాస్త ఎక్కువ. భూమి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చు తగ్గింపుపై త్వరలో భేటీ ఇంత భారాన్ని భరించటం కష్టమైన విషయమే కావటంతో ఖర్చును ఎంతమేర తగ్గించాలనే విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. విమానాశ్రయానికి కావాల్సిన వసతులు, భద్రత ప్రమాణాల ప్రకారం అంచనా వ్యయం రూపొందుతుంది. ఇందులో భద్రత ప్రమాణాలకు చేయాల్సిన ఖర్చు విషయంలో రాజీ ఉండదు. వసతుల పరంగా అయ్యే వ్యయంలోనే కొంత కోతపెట్టి ఖర్చును తగ్గించవచ్చు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎక్కువ భూమిని సేకరించటం సహజం. దాన్ని ఇప్పుడు భారీగా తగ్గించటం ద్వారా భూసేకరణ వ్యయాన్ని కొంత అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమే రాష్ట్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో చర్చించనుంది. ఇక వరంగల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అక్కడ ఫేజ్–2 ప్రకారం విమానాశ్రయాన్ని నిర్మించి, మిగతా చోట్ల ఫేజ్–1 ప్రమాణాల ప్రకారం తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంది. అలాగే ఒకేసారి ఆరుచోట్ల కాకుండా తొలుత ఒకటి, రెండు చేపట్టి.. మిగతావి దశలవారీగా చేపట్టే అవకాశం కూడా ఉంది. విమానాశ్రయానికి 150 కి.మీ. లోపు మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదనే ఒప్పందం జీఎంఆర్ ఎయిర్‌పోర్టు–రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉంది. అందువల్ల మమహబూబ్‌నగర్ విమానాశ్రయం విషయంలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై జీఎంఆర్ సంస్థతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
త్వరలో వరంగల్ ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం వెల్లడించారు.అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో పాత ఎయిర్‌పోర్టుల పునరుద్ధరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్ట్స్ తేనున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుదిబండ వద్ద కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతోపాటు వరంగల్ సమీపంలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్ వద్ద ఉన్న విమానాశ్రయాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా ప్రదర్శన, సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించాం. వరంగల్ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుంది.మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్‌కు తోడ్పాటు లభిస్తుంది. ‘ఉడాన్’లో భాగంగా వరంగల్ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం’అని చెప్పారు. భారత్‌లో తొలి అటానమస్ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్ ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. -
దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం రానున్న ఐదేళ్లలో విమాయన రంగంలో ప్రభుత్వం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఆర్థిక వృద్ధిని పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం గతవారం జరిగిన ఓ సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా కొత్తగా 1000 రూట్లను చిన్న పట్టణాలు, పల్లెలను అనుసంధానించాలని కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశ ఆర్థిక వృద్ధి తగ్గిపోవడం, మరింతగా దిగజారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా 2025 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల్లో భాగంగా గత నెలలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలకు పెట్టుబడులు తరలివెళ్లకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ పన్నులను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయాల అభివృద్ధిలో భారత్ చైనా కంటే వెనకపడి ఉంది. చైనా 2035నాటికి 450 కమర్షియల్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఏడాదికి 600 మంది పైలట్లతో దేశీయ విమానాలు నడిపేలా కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్‌లో చిన్న పట్టణాలకు విమానాలు నడపకపోవడంవల్ల మూడేళ్ల క్రితం 450 రన్వేలు ఉండగా.. ప్రస్తుతం 75 రన్వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. పాత రన్‌వేలపై విమానాలను నడిపేందుకు విమానాయాన సంస్థలు సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రంగ అభివృద్ధి కోసం మోడీ సర్కార్ 38 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి కొన్ని ప్రాంతాలకు టికెట్ ధరలు కూడా తగ్గించింది. అంతేకాదు మరో 63 విమానాశ్రయాలకు తమ విమానాలను తిప్పాల్సిందిగా ప్రభుత్వం కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. మధ్యతరగతికీ విమాన ప్రయాణం మధ్యతరగతి వారికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందులోభాగంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏషియా ఎయిర్‌లైన్స్‌లకు స్థానికంగా తమ యూనిట్లను నెలకొల్పుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంధనంపై కూడా పన్నులు చాలావరకు తగ్గించింది. ఇక డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది. 2024 నాటికి చట్టబద్ధంగా మిలియన్ డ్రోన్లను తిప్పాలని భారత సర్కార్ భావిస్తోంది. 2021 నాటికల్లా డ్రోన్ కారిడార్లను ఏర్పాటుచేసి 2023 కల్లా సరుకులను డ్రోన్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కొత్తగా ఐదు విమానాశ్రయాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విమానయాన సదుపాయం కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని, ఇందుకు అవసరమైన సర్వేలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌స్ట్రిప్ దగ్గర సుమారు 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీనికి అదనంగా మరింత స్థలాన్ని సేకరించాల్సిన అవసరముందని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే మిగిలిన నాలుగు చోట్లతో పోల్చితే వరంగల్‌లో ముందుగానే విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయని నివేదించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 27న వరంగల్‌లో సమీక్ష నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కూడా ఆహ్వానించాలని ఆదేశించారు. కొత్తగూడెంలో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించినట్లు అక్కడి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలిపారు. తాజాగా గుర్తించిన స్థలం సర్వేకు సిద్ధంగా ఉందని కేటీఆర్‌కు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి వద్ద మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎంపిక చేసిన ఈ ఐదు ప్రాంతాల్లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితర సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. త్వరలోనే సర్వే ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ‘సీ ప్లేన్’ ఏర్పాటు కోసం సాగునీటి అధికారులతో భేటీ నూతనంగా దేశంలో అందుబాటులోకి వస్తున్న సీ ప్లేన్ సదుపాయానికి అనుకూలంగా ఉన్న రిజర్వాయర్లను గుర్తించేందుకు సాగు నీటి శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విహార, ఆధ్యాత్మిక కేంద్రాలను కొత్తగా వచ్చే ఐదు విమానాశ్రయాలు, సీ ప్లేన్, హెలీపోర్టులను అనుసంధానం చేసేందుకు రాష్ట్ర విమానయాన వ్యూహాన్ని తయారు చేయాలని రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ అధికారులకు మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ స్కీంలో ఉన్న సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
50 కొత్త విమానాశ్రయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో 50 కొత్త విమానాశ్రయాలను నెలకొల్పేందుకు కేంద్రం నిర్ణయించినట్లు విమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త విమానాశ్రయాలను నెలకొల్పేందుకు భూసేకరణ సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సులువవుతుందని తెలిపారు. విమానయాన శాఖలో ప్రపంచంలోనే భారతదేశం 20 శాతం అభివృద్ధి చెందిందన్నారు. చైనా తొమ్మిది శాతం, ఇతర దేశాలు ఒకటిన్నర శాతం వృద్ధిలో ఉన్నాయని తెలిపారు. స్వదేశం కంటే విదేశీ ప్రయాణాలకే ప్రయాణికులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ప్రాంతీయ ప్రయాణాలను సైతం ప్రోత్సహించేందుకు తమ శాఖ అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలో 32 విమానాశ్రయాలు అనుసంధానంగా ఉన్నా మౌలిక సదుపాయాల్లో ఇంకా లోటు ఉందని, ఈ లోటును భర్తీ చేసేందుకు ముందుగా పది విమానాశ్రయాలను ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
ibps RRBs CWE-III (Office Assistant) Model Paper
Directions (Q. 38 - 39): Study the following information carefully and answer the questions given below: (i) P × Q' means 'P is brother of Q' (ii)'P -Q' means 'P is sister of Q' (iii) 'P ÷ Q' means 'P is father of Q' (iv) 'P + Q' means 'P is mother of Q' 38. Which of the following means 'D is nephew of R'? 1) D × M ÷ R 2) R - M ÷ D 3) R - M ÷ D × T 4) R × M + D 5) None of these 39. Which of the following means 'M is maternal uncle of T'? 1) M × R + T 2) M × R ÷ T 3) T × J - N ÷ M 4) M - R + T 5) None of these 40. Pointing to a man Leena said "He is the son of my grandmother's only child". How is the man related to Leena? 1) Son 2) Brother 3) Cousin Brother 4) Data inadequate 5) None of these General Awareness 41. ICICI has recently launched its mobile banking service called mobile money with which of the following public service providers? 1) Vodafone 2) Aircel 3) Airtel 4) Tata Docomo 5) None of these 42. GDP growth in 2014-15 is estimated at ______ per cent year-on-year. 1) 5.4 - 5.9 2) 5.6 - 5.9 3) 5.4- 5.6 4) 4.5 -4.9 5) 4.6 -4.9 43. Development of new airports in ____ cities will be launched for implementation through Airport Authority of India or PPPs. 1) Tier I and Tier II 2) Tier II and Tier III 3) Tier I and Tier III 4) Tier I and Tier IV 5) Tier I and Tier V 44. The security which is a claim on the government and is a secured financial instrument guarantees certainty of both capital and interest is called? 1) Gilt-Edged Security 2) Call Money 3) Treasury Bills 4) Certificate of Deposits 5) All of these 45. Income Tax Deduction limit under Section 80-C raised to _______ . 1) Rs 1.5 lakh 2) Rs 1.6 lakh 3) Rs 1.7 lakh 4) Rs 2.5 lakh 5) Rs 2.6 lakh 46. Who is appointed as 41st Chief Justice of India? 1) Dr. Harsh Kumar Bhanwala 2) Rajendra Mal Lodha 3) S.K.Roy 4) J. M. Shanti Sundharam 5) Shashikanth Sharma 47. Govt. proposes to launch ___ prog-ramme to ensure broad band conne-ctivity at village level. 1) Digital India 2) Satellite India 3) Broadband India 4) Smart India 5) New India 48. Who is the Leader of the Opposition of Rajya Sabha? 1) Gulam Nabi Azad 2) Sonia Gandhi 3) Rahul Gandhi 4) Ambica Soni 5) None of the above 49. Who is the author of the book "Gandhi before India"? 1) Ravindranath Tagore 2) Ramchandra Guha 3) A.P.J Abdul kalam 4) Pele 5) Sunaina Singh 50. The Euro is not used in which of the following countries? 1) Germany 2) Italy 3) France 4) Norway 5) None of these 51. Who won the Indian Premier League (IPL) - 2014 ? 1) Rajasthan royals 2) Punjab kings 3) Chennai super kings 4) Kolkata Knight Riders 5) Sun rises 52. Which of the following relationship is incorrect in case of Locker facility: 1) Lessor- Lessee 2) Landlord-Tenant 3) Bailor-Bailee 4) Licensor- Licencee 5) None of these 53. Largest shareholder (in percentage shareholding) of a nationalized bank is ____ 1) RBI 2) NABARD 3) LIC 4) Govt. of India 5) IBA 54. RBI recently issued draft guidelines for implementation (BBPS) of an "any time -any where" bill payment system. What does BBPS stands for: 1) Barath Bill Payment Serves 2) Barath Bill Payment System 3) Barathiya Bill Payment system 4) British Bill payment System 5) None of these 55. Most important small scale industry of India is ___ 1) Agarbatti 2) Paper industry 3) Handloom 4) All the above 5) None of these 56. Project Namaskar launched by which bank as a part of financial inclusion __ 1) PNB 2) BOI 3) BOB 4) SBI 5) None of these 57. SEBI on 19th March 2014 inaugu-rated its local office at? 1) Pune 2) Shimla 3) Ranchi 4) Bhopal 5) Delhi 58. Madhya Pradesh Government's financial inclusion model is ____ 1) Vihari 2) Samriddhi 3) Paripurna 4) Akhshara 5) None of these 59. Which bank opened CSP (Customer Service Point) to extend financial inclusion targeting urban poor? 1) Andhra bank 2) SBI 3) SBH 4) Canara bank 5) Corporation bank 60. RBI pays interest on CRR balances of banks at _____. 1) Bank Rate 2) Repo Rate 3) Bank Rate minus 2% 4) Zero % 5) 5% 61. Statutory Liquidity Ratio (SLR) can be maintained in the following ways? 1) Cash 2) Gold 3) Unencumbered approved securities 4) All of these 5) None of the above 62. The Rate at which the domestic currency can be converted into foreign currency and vice-versa is known as the 1) Domestic Rate 2) Exchange rate 3) Bank rate 4) Fixed rte 5) None of these 63. Which credit card company has tied up the Railways to issue a credit cum loyalty card? 1) ICICI Cards 2) SBI Cards 3) ABN Amro Cards 4) Citibank 5) SBH cards 64. Who has won the 2014 Templeton Prize? 1) Dalai Lama 2) Desmond Tutu 3) Tomas Halik 4) Aung San Su Kyi 5) None of these 65. Which Indian shooter clinched a silver medal at the ISSF World Cup in Fort Benning, USA in March 2014? 1) Chain Singh 2) Pooja Ghatkar 3) Rahi Sarnobat 4) Heena Sidhu 5) None of these 66. Abdel Fattah el-Sisi became the President of which of the following countries in June 2014? 1) Yemen 2) Egypt 3) Iran 4) Libya 5) Syria 67. "The Substance and The Shadow" is the autobiography of which of the following actors? 1) Dev Anand 2) Rajesh Khanna 3) Dilip Kumar 4) Dharmendra 5) Aamir Khan 68. Bor Wildlife Sanctuary has been notified as the 47th Tiger Reserve of India. It is in? 1) Maharashtra 2) Odisha 3) Assam 4) Gujarat 5) Madhya Pradesh 69. Which team won the Deodhar Trophy Cricket recently in Visakhapatnam? 1) West Zone 2) North Zone 3) South Zone 4) Central Zone 5) East Zone 70. Which of the following countries ho-nored Shah Rukh Khan with Officer of the Legion of Honor recently? 1) Germany 2) France 3) South Korea 4) Italy 5) UK 71. Rani-Ki-Vav, an 11th century step well was accorded the UNESCO World Heritage Site status. It is in? 1) Rajasthan 2) Madhya Pradesh 3) Gujarat 4) Uttar Pradesh 5) Haryana 72. Who won the gold medal in the World Rapid Chess championship in Dubai in June 2014? 1) Magnus Carlsen 2) Viswanathan Anand 3) Fabiano Caruana 4) Hikaru Nakamura 5) None of these 73. Who visited China in June 2014 to attend the events to mark the 60th anniversary of Panchsheel agreement? 1) Pranab Mukherjee 2) Hamid Ansari 3) Narendra Modi 4) Sushma Swaraj 5) Arun Jaitley 74. Who is the Union Minister of Consumer Affairs, Food and Public Distribution? 1) Anantha Kumar 2) Anant Geete 3) Ramvilas Paswan 4) Radha Mohan Singh 5) Jual Oram 75. Who has been appointed as the Governor of Gujarat? 1) Kesri Nath Tripathi 2) Om Prakash Kohli 3) Balram Das Tandon 4) Padmanabha Acharya 5) Ram Naik 76. Which city hosted the 6th BRICS Summit in July 2014? 1) Durban 2) Rio de Janeiro 3) Moscow 4) Fortaleza 5) Cape Town 77. Nay Pyi Taw is the capital of which of the following countries? 1) Bangladesh 2) Vietnam 3) Cambodia 4) Laos 5) Myanmar 78. Nadine Gordimer of South Africa passed away in July 2014. She was a winner of Nobel Prize in which of the following fields? 1) Physics 2) Peace 3) Literature 4) Chemistry 5) Economics 79. Which of the following became the 1000th site to be included in the UNESCO World Heritage Site List in June 2014? 1) Iguazu National Park, Argentina 2) Great Barrier Reef, Australia 3) Ruins of Loropeni, Burkina Faso 4) Preah Vihear Temple, Cambodia 5) Okavango Delta, Botswana 80. Petra Kvitova defeated which of the following players in the final to win the 2014 Wimbledon women's singles tennis title? 1) Serena Williams 2) Venus Williams 3) Eugenie Bouchard 4) Maria Sharapova 5) Li Na Computer Knowledge 81. Which of the following is an example of non volatile memory? 1) VLSI 2) LSI 3) ROM 4) RAM 5) Hard disk 82. IEEE 802.16 popularly called ___ 1) Ethernet 2) Wi-Fi 3) WIMAX 4) Wireless Network 5) None of these 83. To protect system, there are how many security levels? 1) One 2) Two 3) Three 4) Four 5) Five 84. Java was originally invented by 1) Oracle 2) Microsoft 3) Novell 4) Sun 5) IBM 85. A small network making up the internet and also having a small number of computers with in it is called ___ 1) Host 2) Address 3) Sub domain 4) Domain 5) URL 86. The operating system of a computer serves as a software interface between the user and ___ 1) Software 2) Hardware 3) Processor 4) Compiler 5) RAM 87. Both the ALU and control section of CPU employ special purpose storage locations called: 1) Decoders 2) Buffers 3) Multiplexer 4) Registers 5) Flip flops 88. The address of the next instruction to be executed by the current process is provided by the ___ 1) CPU registers 2) program counter 3) process stack 4) pipe 5) coding counter 89. Which command combines the contents of one file with another? 1) Restore 2) Rename 3) Append 4) Add 5) Store 90. The ___ is the administrative section of the computer system. 1) Memory Unit 2) Input Unit 3) Central Processing Unit 4) Control Unit 5) Logic Unit 91. Coded entries which are used to gain access to a computer system are called 1) Codeword's 2) Entry codes 3) Entry words 4) Security commands 5) Data codes 92. What is the primary requisite of a good computer programmer? 1) Mathematical mind 2) Artistic mind 3) Logical mind 4) Scientific knowledge 5) Memory Knowledge 93. The errors that can be pointed out by the compiler: 1) Syntax errors 2) Internal errors 3) Semantic errors 4) Coding errors 5) Logical errors KEY 38) 3; 39) 1; 40) 2; 41) 5; 42) 2; 43) 1; 44) 1; 45) 1; 46) 2; 47) 1; 48) 1; 49) 2; 50) 4; 51) 4; 52) 3; 53) 4; 54) 2; 55) 3; 56) 1; 57) 3 ; 58) 2; 59) 2; 60) 4; 61) 4; 62) 2; 63) 2; 64) 3; 65) 4; 66) 2; 67) 3; 68) 1; 69) 1; 70) 2; 71) 3; 72) 1; 73) 2; 74) 3; 75) 2; 76) 4; 77) 5; 78) 3; 79) 5; 80) 3; 81) 3; 82) 3; 83) 4; 84) 4 ; 85) 1; 86) 2 ; 87) 4; 88) 2; 89) 3; 90) 3; 91) 4; 92) 3; 93) 5. (Continued in tomorrow's VIDYA)