new bridegroom
-
కాళ్ల పారాణి ఆరకముందే..
సాక్షి, అనంతపురం : కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లి పందిరి తీయకముందే నవ వరుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన కురుబ వెంకటస్వామి నాలుగో సంతానమైన రామచంద్ర (23)కు విడపనకల్లు మండలం హావళిగి గ్రామానికి చెందిన రత్నమ్మతో గత ఆదివారం పెద్దల సమక్షంలో వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచి వధువు ఇంట్లో ఉన్న నవదంపతులు శనివారం సాయంత్రం వడిబియ్యం పెట్టుకుని షేక్షానుపల్లికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత తోటకు వెళ్లి వస్తానని రామచంద్ర ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. గంట తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యులు పరుగుపరుగున తోటకెళ్లి చూడగా రామచంద్ర అపస్మారకస్థితిలో కనిపించాడు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి కారులో తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి నేరుగా అనంతపురంలోని కిమ్స్ సవీర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున రామచంద్ర మృతి చెందాడు. ఇష్టం లేని పెళ్లి చేసినందు వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
నవ వధువు ఆత్మహత్య
కూడేరు : పుట్టింటికి పంపలేదన్న చిన్న కారణంతో నవ వధువు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కూడేరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు కూడేరుకు చెందిన చట్వోజీరావు రెండవ కుమారుడు రాఘవేంద్రకు కణేకల్ మండలం యర్రగుంటకు చెందిన కటిక జయరామ్ కుమార్తె ఉమాదేవి బాయి (20)తో 2016 ఆగస్టు 4న వివాహం జరిగింది. శుక్రవారం ఉమాదేవి తండ్రి కూతురును చూసేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఉమాదేవి పుట్టింటికి వస్తానని తండ్రిని కోరింది. తండ్రి, అత్తమామలు ఈ రోజు అమావాస్య వద్దు అని చెప్పుకొచ్చారు. తండ్రి వెళ్ళిపోయాడు. ఉమాదేవికి తలనొప్పి ఉండేది. పుట్టింటికి పంపలేదని మనస్థాపానికి గురై ఉదయాన్నే ఇంటి ముందు ఉన్న బాత్రూమ్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పిన కొద్దిసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఉమాదేవి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. పెళ్ళైన మూడు నెలలకే తనువు చాలించావా అంటూ రోదించారు. తలనొప్పిని భరించలేక, ఊరికి పంపలేదన్న చిన్న కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
వివాహం అయిన మూడు రోజులకే వరుడు మరణం